కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ చెప్పిందని.. ఇప్పుడు దానిపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. కేవలం మేడిగడ్డపైనే జ్యుడీషియల్ విచారణ అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ తీరు బీఆర్ఎస్ నేతల అవినీతిని కప్పిపుచ్చేలా ఉంటోందని బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో యువతను డ్రగ్స్, మద్యానికి బానిసలుగా చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. విద్యాసంస్థల అడ్డాగా మత్తుపదార్థాల దందా జరుగుతోందని ఆరోపించారు. రామమందిర నిర్మాణం బీజేపీ కార్యక్రమం కాదని దీన్ని రాజకీయం చేయడం కాంగ్రెస్కు తగదన్నారు.
కేంద్ర ప్రభుత్వం
కేంద్రంలోని బిజెపి, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నిరంకుశ ప్రజా వ్యతిరేక పాలనను వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టేందుకు అందరూ కలిసి రావాలని కాంగ్రెస్ పార్టీ నేత మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం పిలుపునిచ్చారు. ఏలూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమాలోచన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టును, అమరావతి రాజధానిని విస్మరించాయని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. వైసిపి దళితులపై కపట ప్రేమ చూపిస్తూ వారిపై దాడులకు పాల్పడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలను సంఘాలను ఏకం చేసి బిజెపితో పొత్తు పెట్టుకున్న పార్టీలను వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు..
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలంలో కృష్ణా జిల్లా స్థాయి బూత్ కమిటీ సమావేశానికి విచ్చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాలను తమ పథకాలుగా చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఈ విషయాలను ప్రజలకు తెలియజేస్తే వారు ఆశ్చర్యపోతున్నారని పురందేశ్వరి తెలిపారు. కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె మీడియాకు తెలిపారు. టిడిపి, జనసేన పొత్తుల విషయం కేంద్ర పార్టీ చూసుకుంటుందని పురందేశ్వరి తెలిపారు. రాష్ట్రంలో బిజెపి పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేస్తున్నట్లు ఆమె వివరించారు.






Total views : 78141