పట్టణంలోని యాదవ్ బజార్ లో రూ.60 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా స్ట్రోమ్ వాటర్ డ్రైనేజ్ – జగనన్న వాక్ వే ను నిర్మించారు. పాత బస్టాండ్ సమీపంలో రూ.22 లక్షల అంచనా వ్యయంతో ఆధునికరించిన బాబు జగ్జీవన్ రామ్ భవన్ ను మంత్రి జోగి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని అన్నారు. నేను వైసిపి పెనమలూరు అభ్యర్థిని నా మీద ఎవరు పోటీ చేసినా నేను సిద్ధమేనని, పెడన నియోజకవర్గ ఉప్పాల రాముకు నేను పూర్తిగా సహకరిస్తానని అన్నారు. కేశినేని నాని మా పార్టీలోకి వస్తాను అనడంతో అతన్ని పార్టీలోకి ఆహ్వానించామని, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించామని ఆయన అక్కడ గెలవబోతున్నారని అన్నారు. నా నియోజకవర్గం మైలవరం 2009లో రాజశేఖర్ రెడ్డి గారు పెడనలో పోటీ చేయమన్నారు అప్పుడు అక్కడ పోటీ చేశాను. 2014లో జగన్మోహన్ రెడ్డి మైలవరం నియోజకవర్గంలో పోటీ చేయమన్నారు అప్పుడు అక్కడ పోటీ చేశాను. 2019లో మరల పెడన నియోజకవర్గంలో పోటీ చేయమన్నారు మళ్ళి అక్కడ పోటీ చేశాను. ఇప్పుడు పెనమలూరులో పోటీ చేయమంటున్నారు అలానే ఇప్పుడు అక్కడ పోటీ చేస్తాను. జగన్ ఎలా చెప్తే అలా నేను పని చేస్తానని, ఆయన మాటను నేను శిరసా వహిస్తానని ఆయన అన్నారు.
కేశినేని నాని
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. సీఎం జగన్తో కీలక భేటీ అనంతరం కేశినేని నాని మీడియా సమావేశంలో మాట్లాడారు. తనను టీడీపీలో తీవ్రంగా అవమానించారని, తన రాజీనామాను ఆమోదించిన అనంతరం వైసీపీలో చేరతానని ఆయన తెలిపారు. టీడీపీ కోసం ఎంతో కష్టపడ్డానని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ గెలుపు కోసం పని చేశానని, చంద్రబాబు చెబితే కొందరికి నెల వారీ జీతాలు కూడా ఇచ్చానన్నారు. 2014 కు ముందు టీడీపీలో చేరతానంటే.. చాలా మంది మా సామాజిక వర్గం వాళ్లే నన్ను మందలించి చేరొద్దన్నారని కేశినేని నాని పేర్కొన్నారు. రాజకీయాల కోసం రూ. 2 వేల కోట్ల ఆస్తులను అమ్ముకున్నానని ఆయన వెల్లడించారు. చంద్రబాబు తీరుతో వ్యాపారాన్ని కూడా ఆపేశానన్నారు.
అమరావతి, ఈనెల 11న వైసీపీ తీర్థం పుచ్చుకోవటానికి రంగం సిద్ధం చేసుకున్న కేసినేని నాని. తనతో పాటు మరో 5 అసెంబ్లీ సీట్లు కోరిన నాని. విజయవాడ తూర్పు నుండి తన కూతురు కేసినేని శ్వేతకు. విజయవాడ పశ్చిమ నుండి ఎంఎస్ బేగ్, నందిగామ నుండి కన్నెగంటి జీవరత్నం, తిరువూరు నుండి నల్లగట్ల స్వామి దాసుకు, మైలవరం నుండి బొమ్మసాని సుబ్బారావుకు ఇవ్వమని అడిగిన నాని. తనకు ఎంపీ పదవి తోపాటు రెండు సీట్లు మాత్రమే వాగ్దానం చేసిన అధిష్టానం.
ఏలూరు జిల్లా నూజివీడు సబ్ జైలులో ఉన్న పలుకు టిడిపి కార్యకర్తలను విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని పరామర్శించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గత నాలుగు రోజుల క్రితం జరిగిన గొడవలో ఎస్సై సతీష్ కు గాయం అవడంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచుగా మొత్తం పదిమందిని జడ్జి రిమాండ్ కు తరలించారు. విషయం తెలుసుకున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని నేడు నూజివీడు సబ్ జైల్లో ఉన్న తన అనుచరులను పరామర్శించడానికి వచ్చి అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన సొంత అనుచరులు ముగ్గురు జైల్లో ఉన్నారని వారిని పరామర్శించడానికి వచ్చాను త్వరలోనే వారికి బెయిల్ కూడా వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.





Total views : 91171