తెలంగాణలో ఎండలు రోజు రోజుకీ భయంకరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మండుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే రోడ్లపై జనసంచారం పూర్తిగా తగ్గిపోతోంది. నిత్యం రద్దీగా ఉండే పట్టణాలు కూడా మధ్యాహ్న సమయాల్లో నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ మే నెల చివరి వరకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. దీనితో ప్రభుత్వ అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 తర్వాత మాత్రమే బయటికి రావాలని సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, వికలాంగులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండలో తిరగొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వడదెబ్బ ప్రమాదం ఎక్కువగా ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయినా ఉద్యోగాలు, వ్యాపారాల కోసం ప్రజలు మండుటెండల్లోనే ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండ తీవ్రతతో ప్రజల దైనందిన జీవితం తీవ్రంగా ప్రభావితమవుతోంది.
Tag: