ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైఎస్సార్సీపీ రెండవసారి నియోజకవర్గాల ఇన్చార్జిల పేర్లను ప్రకటించింది. ఇందులో ప్రధానంగా యువతకు ప్రాధాన్యత ఇస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థిగా తుడా చైర్మన్ మోహిత్ రెడ్డిని ప్రకటించారు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రస్తుత ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి ఇప్పటికే గడపగడపకు మన కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు. 2019 ఎన్నికల తర్వాత నుంచి కూడా ప్రజల మధ్యలోనే ఉండి ప్రజలకు కావలసిన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నామని, కరోనా సమయంలో అయితే ఒక అడుగు ముందుకు వేసి ప్రతి ఇంటిని ఆదుకున్నమని అన్నారు మోహిత్ రెడ్డి. ఈసారి చంద్రగిరి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని కచ్చితంగా వైసీపీ జెండా ఎగుర వేస్తామని చంద్రగిరి ఇంచార్జ్ మోహిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి
జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలు నూతన సంవత్సరంలో ఆయురారోగ్యాలతో పాటు సుఖశాంతులతో ఉండాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి తెలిపారు. సివిఆర్ న్యూస్ ఛానల్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మరోసారి రాష్ట్ర ప్రజలు గెలిపించుకుంటే అన్ని రంగాల్లో రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు.
ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు 26.12.23 మంగళవారం ఉదయం 11 గంటలకు బాపట్ల మున్సిపల్ హై స్కూల్ లో బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆడుదాo ఆంధ్ర అనే కార్యక్రమం మంచి స్ఫూర్తితో కూడిన క్రీడాకారులకు మంచి నైపుణ్యం అందిస్తుందని కలెక్టర్ అన్నారు. మనం ఈ బిజీ కాలంలో మానసికంగా ఎంతో ఒత్తిడికి గురవుతూ ఉంటామని, అలాంటి టైంలో ప్రతిరోజు ఏదో ఒక సమయం కేటాయించి క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ శారీరకంగా క్రీడలతో మానసిక ఉల్లాసం పొందచ్చని ఆయన అన్నారు. ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదగా రాష్ట్రవ్యాప్తంగా గుంటూరులో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని, ప్రతి ఒక్క క్రీడాకారుడు, విద్యార్థులు, విద్యార్థినిలు, యువకులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ సందర్భంగా బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ముఖ్య మంత్రి ఆలోచన ధోరణికి అద్ధం పడుతుందని, మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులు, విద్యార్థినిలు, యువకులు లాప్టాప్లు సెల్ ఫోన్లతో బిజీ లైఫ్ లో ఉన్నారని గమనించి శారీరకంగా అందరూ కష్టపడితే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని ఈ అవకాశాన్ని స్కూలు, కాలేజీ విద్యార్థులు, విద్యార్థినిలు, యువకులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.




Total views : 79066