శ్రీ రామనవమి (Sri Rama Navami) :
నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీ రామనవమి (Sri Rama Navami) సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం దేవస్థానం ఘనంగా నిర్వహించింది. దేవస్థానానికి అనుబంధ అలయమైన ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో ఉదయం నుండి శ్రీ సీతారామస్వామికి శ్రీ ప్రసన్నాంజనేయస్వామికి విశేష పూజలు నిర్వహించి పూజలనంతరం శ్రీ సీతారాముల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు.
ఇది చదవండి : ఈ నెల 17న శ్రీరామనవమి తిరు కళ్యాణ మహోత్సవం
కళ్యాణోత్సవానికి ముందుగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పం ఫాటించి కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ, వృద్ధి అభ్యుదయాలను కాంక్షిస్తూ పుణ్యాహవాచనం, కంకణపూజ, యజ్ఞోపవీత పూజ, నూతన వస్త్ర సమర్పణ, వరపూజ, ప్రవర పఠన, మాంగల్య పూజ, శ్రీసీతాదేవికి మాంగల్య ధారణ, తలంబ్రాలు మొదలైన కార్యక్రమాలతో శాస్త్రోక్తకంగా సాంప్రదాయబద్ధంగా కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని దేవస్థానం అధికారులు, సిబ్బంది స్థానికులు భక్తులు తిలకించారు అనంతరం దేవస్థానం భక్తులకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి.
చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. గోపాల కృష్ణారావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. పూజల… - శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.
నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామి అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తున్నారు. అలంకార… - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత.
రాష్ట్ర మంత్రి సవిత ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న ఆమె కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో మంత్రి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: శ్రీశైలంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు…








Total views : 142006