ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ వినియోగదారులకి షాక్ ఇచ్చింది. ఓలా ఎస్1 ప్రో ధరను పెంచింది. ఇప్పుడు ఈ-స్కూటర్‌ను కొనుగోలు చేయడానికి మరో 10 వేలు ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు FAME II సబ్సిడీని తొలగించిన తర్వాత దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.29 లక్షలుగా ఉండేది. ఇప్పుడు అది రూ. 1.39 లక్షలకు పెరిగింది.
Ola S1 ప్రో స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే.. ఈ కొత్త స్కూటర్ పది రంగులలో వస్తుంది. Ola S1 ప్రో అనేది కంపెనీ S1 మోడల్ ప్రీమియం వేరియంట్. S1 ప్రో మోటార్ 5500 W శక్తిని ఇస్తుంది. వినియోగదారులు S1 ప్రో రెండు చక్రాలలో డిస్క్ బ్రేక్‌లతో వస్తుంది. S1 ప్రో గరిష్ట వేగం 115kmph అని కంపెనీ పేర్కొంది. Ola S1 ప్రో ఈ-స్కూటర్ క్రూయిజ్ కంట్రోల్, హిల్-హోల్డ్ సిస్టమ్, వాయిస్ అసిస్ట్ అంటూ మూడు రైడింగ్ మోడ్లతో వస్తుంది. S1 ప్రో బ్యాటరీ ఆరున్నర గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.
ఓలా ఎస్1 ప్రో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈ-స్కూటర్ అని అందరికి తెలిసిందే. మార్చిలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను పెంచాలని ఓలా ఎలక్ట్రిక్ సీఈవో సూచించారు. దీని తర్వాత Ola S1 ప్రో బుకింగ్‌ను పునఃప్రారంభిస్తున్నప్పుడు కంపెనీ ధరను 10 వేల రూపాయలు పెంచింది. అదే సమయంలో Ola త్వరలో MoveOS 2 OS స్కూటర్లని విడుదల చేయనుంది. ఈ ఏడాది జనవరిలో బుక్ చేసుకున్న వినియోగదారులకు కూడా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కంపెనీ నిర్ణయం ప్రకారం జనవరిలో బుకింగ్ చేసుకునే కస్టమర్లు కూడా కొత్త ధరను చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో తాజా బుకింగ్ S1 ప్రో కోసం మాత్రమే ఓపెన్ చేశారు.
2024
వన్ ప్లస్ గ్లోబల్ మార్కెట్లలో వన్ ప్లస్ 12 లాంచ్ తేదీని ప్రకటించింది. డిసెంబర్ 5న చైనాలో లాంచ్ అయిన వన్ ప్లస్ 12 జనవరి 23, 2024న భారతదేశంతో సహా అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులోకి రానుంది. ఈ నెల ప్రారంభంలో, స్మార్ట్ఫోన్ల కోసం జనవరి 23 గ్లోబల్ లాంచ్ తేదీని కూడా కంపెనీ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. ఎక్స్ లో పోస్ట్ చేశారు. చైనీస్ తయారీదారు జనవరి 23 రాత్రి 7.30 గంటలు వన్ ప్లస్ 12 లాంచ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. వన్‌ప్లస్ 12ఆర్ ధరలను కూడా ఈ వెంట్లో వెల్లడించే అవకాశం ఉంది. వన్ ప్లస్ 12 సిరీస్ లాంచ్ కోసం మైక్రోసైట్ కూడా కంపెనీ వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. వన్ ప్లస్ ఆసక్తి గల కస్టమర్లకు ఈవెంట్‌కు సభ్యత్వం పొందడం ద్వారా ఉచిత వన్ ప్లస్ 12, వన్ ప్లస్ 12R గెలుచుకునే అవకాశాన్ని కూడా అందిస్తోంది. వన్ ప్లస్ 12 డిసెంబర్ 5న చైనాలో అందుబాటులోకి తెచ్చారు. క్వాల్ కమ్ సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 SoC, 100W వైర్డు SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,400mAh బ్యాటరీని కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ గరిష్టంగా 24GB వరకు LPDDR5X RAM, 1TB వరకు స్టోరీతో వస్తుంది. వన్ ప్లస్ 11 సక్సెసర్ 6.82-అంగుళాల క్వాడ్-HD+ డిస్ ప్లే, ఫాంట్ 64-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 48-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌ను కూడా కలిగి ఉంది. ముందు భాగంలో వన్ ప్లస్ 12 సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32-మెగాపిక్సెల్ని కలిగి ఉంది. వన్ ప్లస్ 12 చైనాలో బేస్ 12GB+256GB RAM సుమారు రూ. 50,700గా ఉంది. 16GB+512GB, 16GB+1TB వేరియంట్ల ధర వరుసగా దాదాపు రూ. 56,600, రూ. 62,500 గా ఉన్నాయి.






Total views : 78042