మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో వామపక్ష ఉగ్రవాదంపై పైచేయి సాధించామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. అభివృద్ధితోనే మావోయిజం అంతమవుతోందన్నారు. ఇప్పుడు మావో ఉద్యమం తుదిదశకు చేరిందన్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టిపెట్టామన్న అమిత్‌షా ఓవైపు ఆపరేషన్ కగార్ మరోవైపు అభివృద్ధి నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో హోంశాఖ ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో అమిత్‌షా ఆయా రాష్ట్రాలకు మార్గదర్శనం చేశారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలు, సీఎస్‌లు, డీజీపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
కేంద్ర హోంశాఖ నిర్వహించిన ఈ భేటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ హోంమంత్రి అనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసు శాఖ సామర్ధ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలు చాలా బాగా పనిచేశాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రశంసలు కురిపించారు. హింసతో ఏదీ సాధించలేం, జనజీవన స్రవంతిలో.. కలవాలని మావోయిస్టులకు అమిత్‌షా పిలుపు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ..ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు సీఎం రేవంత్‌రెడ్డి. డీలిమిటేషన్‌తో సౌత్ స్టేట్స్తో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఈ నిర్ణయంతో బీజేపీకి తాత్కాలికంగా లాభం జరగవచ్చు కానీ..దీర్ఘకాలంలో దేశానికి నష్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి..ఈ మేరకు డీలిమిటేషన్ విషయంలో…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు రావడంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. ప్రస్తుతం దర్శనానికి సుమారు…
- భారత భూభాగాలకు చైనా కల్పిత పేర్లు..అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా కల్పిత పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. చైనా చర్య దురుద్దేశపూరితమంటూ మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో విడదీయలేని అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. కల్పిత పేర్లు పెట్టడం ద్వారా వాస్తవాలను మార్చలేరని స్పష్టం చేసిన…
- హైదరాబాద్‌లో అంతులేకుండా పోతున్న రియల్ మోసాలు..హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ సంస్థల ఆగడాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. చిన్న చితకా సంస్థల నుంచి మొదలుపెట్టి… బడా బడా కన్స్ట్రక్షన్ కంపెనీల వరకూ అందరూ నిబంధనలను తుంగలో తొక్కేవారే. కొంచెం ఎక్కువ… కొంచం తక్కువ అనే తప్ప… ఉల్లంఘనలకు…
- పశ్చిమాసియాలో మళ్లీ మొదటికొచ్చిన పరిస్థితి..పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పాకిస్థాన్ వేదికగా అమెరికా – ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో… మళ్లీ యుద్ధం మొదలయ్యే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ దిశగా ట్రంప్ అనేక సూచనలు కూడా ఇచ్చారు. దీంతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Total views : 38429