విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీగా అజిత్ కుమార్ సక్సేనా నియమితులయ్యారు. ప్రస్తుతం మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ సీఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు విశాఖ ఉక్కు సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఉక్కు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలి కాలం వరకూ విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీగా బాధ్యతలు నిర్వహించిన అతుల్ భట్ పదవీ కాలం ఈ ఏడాది నవంబర్ 30వరకూ ఉన్నా, ఆయన రెండు నెలల క్రితం దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. దీంతో కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే కార్యక్రమంలో భాగంగా ఆయనను దీర్ఘకాలిక సెలవుపై పంపినట్లుగా కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు.
అతుల్ భట్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన నేపథ్యంలో అప్పటి నుంచి ఉక్కు డైరెక్టర్ ఏకే బాగ్చీ ఇన్ చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఉక్కు సీఎండీ పోస్టునకు నిర్వహించిన ఇంటర్వ్యూలో శక్తిమణి ఎంపికయ్యారు. ఆయన డిసెంబర్ 1 నుండి బాధ్యతలు స్వీకరించనున్నారు. అప్పటి వరకూ ఏకే సక్సేనా సీఎండీగా వ్యవహరిస్తారు. మరో పక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనలకు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేసే ప్రదిపాదన చేయనున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…
- ప్యారడైజ్ నా కెరీర్లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా.ప్యారడైజ్ నా కెరీర్లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా. సెప్టెంబర్ 24న వస్తున్నాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అడ్రినలిన్ పంపింగ్ హై ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సినిమా అంతా హైలెట్‌గా ఉంటుంది: ప్రెస్ మీట్లో న్యాచురల్ స్టార్ నాని న్యాచురల్ స్టార్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి