ఏపీ సీఎం జగన్‌పై ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణలో ధరణి పేరుతో కేసీఆర్ చేసిన మోసాల కంటే.. ఏపీలో జగన్ చేసిన తప్పులే ఎక్కువని ఆరోపించారు. తెలుగు ప్రజానీకానికి భాజపా వ్యతిరేకంగా ఉందని.. అయితే, ఆ పార్టీకి అనుకూలంగా జగన్ ఉన్నారని మండిపడ్డారు. ఏపీలోనూ అధికార మార్పిడి ఖాయమని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణలో ఒక్కో ఎంపీ స్థానంలో పోటీచేస్తామని నారాయణ ప్రకటించారు.
ap politics
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను రాజకీయాల్లో కింది స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగానని ఇప్పటి వరకు ప్రజాబలంతో ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నానన్నారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ ఏం చేస్తాడో నాకు తెలియదు నేను మాత్రం ఎన్నికల్లో పోటీ చేస్తాను అన్నారు. నా కొడుకు కూడా ప్రజాభిమానం పొంది రాజకీయాల్లో ఎదగాలని కోరుకుంటున్నా అని తెలిపారు.
అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె 7వ రోజు కు చేరింది. ప్రకాశం జిల్లా మార్కాపురం లో ఏడో రోజు సమ్మెలో అంగన్వాడీలు ఎర్ర చీరలు ధరించి పెద్ద ఎత్తున పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న అంగన్వాడీలను చూసి సబ్ కలెక్టర్ సేతు మాధవన్ కార్యాలయం నుండి బయటికి వెళ్లిపోయారు.ఈ సమ్మెలో ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్, సిఐటియు యూనియన్ల నాయకులు పాల్గొన్నారు. డివిజన్ పరిధిలోని 13 మండలాలకు చెందిన అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు
సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ అంగన్వాడి సెంటర్ల తాళాలు పగలగొట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు. అవసరమైతే సమస్యల సాధన కోసం త్వరలో రాజధానిని కూడ ముట్టడిస్తామని ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపి రాష్ట్ర కార్యదర్శి కొత్త నాగేంద్రకుమార్ (నాగబాబు) మీడియా సమావేశం నిర్వహించారు..
ఈ సందర్భంగా నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ ఇది ఆరోగ్యశ్రీ కాదు, అనారోగ్యశ్రీ అని అన్నారు. జగన్ రెడ్డి పాలనలో కార్పొరేట్ హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ పదకం పేదలకు దూరం అయ్యిందన్నారు. రూ 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పదకం అంటూ జగన్ రెడ్డి కొత్త ప్రచారానికి తెర తీశారు. కార్పొరేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ లో వైద్యం చేయలేమని నెల కిందటే కార్పొరేట్ యాజమాన్యాలు ప్రభుత్వానికి చెప్పినాయి. భారతమ్మ పత్రిక సాక్షికి, కూలీ మీడియా కి ఇచ్చే యాడ్స్ డబ్బులు కార్పోరేట్ హాస్పిటల్స్ కు బిల్ చెల్లిస్తే పేద ప్రజలకు వైద్యం అన్నా అందేది అని అన్నారు. 25 లక్షలు ఉచిత వైద్యం “పేరుగొప్ప – ఊరుదిబ్బ” చందాన వుంది.
మాజీ ఎమ్మెల్యే ,ఇంఛార్జి అర్ రమేష్ రెడ్డి అధ్వర్యంలో రాయచోటి నియోజకవర్గంలో ముస్లింల ఆత్మీయ సదస్సు, విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ షరీఫ్ హాజరైనారు. కాబోయే రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి సుగావాసి సుబ్రమణ్యం, కడప అమీర్ బాబు, ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన ముక్తియార్, మాజీ టిటిడి పాలకవర్గ సభ్యులు సుగావాసి ప్రసాద్ బాబు,ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి అధిక సంఖ్యలో మైనార్టీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరైనారు.
కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, ఉయ్యూరు మార్కెట్ యార్డ్ లో రూ.71 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ కి ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి శంకుస్థాపన చేసారు. ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ఈ షాపింగ్ కాంప్లెక్స్ వలన వ్యాపారులకు వ్యాపార సముదాయం గా మారుతుంది అన్నారు. చుట్టుపక్కల ప్రజలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, కూడా అలాగే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. మార్కెట్ యార్డ్ చైర్మన్, డైరెక్టర్లు అందరూ సమిష్టిగా పనిచేసి మార్కెట్ యాడ్ బలోపేతానికి కృషి చేయాలి అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు మొదలు పెడుతోంది.. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనికోసం ఏర్పాట్లను ప్రారంభించనుంది. 2019లో ఏపీ అసెంబ్లీతో పాటు లోక్ సభకు ఎన్నికలు జరిగాయి. వచ్చే ఏడాది జూన్ 10వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంట్లో భాగంగా ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల జాబితాలు, పోలింగ్ స్టేషన్లు, సిబ్బంది వంటి అంశాలపై చర్చించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు రాష్ట్రానికి రానున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం రామన్నపాలెం గ్రామంలో రూ.6 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగు రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజుతో కలిసి గ్రామంలో నూతనంగా నిర్మించిన రహదారులు, భవనాలను ప్రారంభించారు. గతంలో చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చారని ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. సీఎం జగన్ అక్క చెల్లెమ్మలకు అండగా నిలుస్తూ కోట్లాది రూపాయలు ఖాతాల్లో వేశారన్నారు.
ఈరోజు మధ్యాహ్నం ఎమ్మార్వో కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జారీ చేసిన 35/2023 చట్టమును అనుసరించి మరియు గ్రామ రెవెన్యూ రికార్డులు ప్రకారం ఆసైన్మెంట్ చేసిన భూమిని అన్యక్రాంతం చేసే హక్కు తో పాటు సంపూర్ణ భూమి హక్కులు కల్పించి అసైన్డ్ భూములు క్రమబద్ధీకరణ చేసి మరియు డీకేటి భూములను శాశ్వత హక్కు పత్రం కల్పిస్తూ తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో నేడు నియోజకవర్గ వ్యాప్తంగా ఐదు మండలాలకు సంబంధించి అసైన్డ్ భూములు 8583 ఎకరాలకు గాను,3783 లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసి అనంతరం ఎమ్మెల్యే ప్రసంగిస్తూ అసైన్డ్ భూముల విషయంలో వాటిని అమ్ముకునే హక్కు కూడా లబ్ధిదారులకు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అని ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ భూ బదలాయింపు చట్టం-1977 ని సవరిస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. గత మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా ఇప్పుడు ఆర్డినెన్స్ రూపంలో అది అమలులోకి రావడంతో అసైన్డ్ భూమల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అని ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇచ్చే భూముల విషయంలో ఇప్పటి వరకూ కఠిన నిబంధనలు ఉండేవి. ప్రభుత్వం అసైన్ చేసిన భూముల క్రయ విక్రయాలకు అధికారికంగా అవకాశం లేదు. వాటిపై ఎప్పటికైనా వారసులకే హక్కు ఉంటుంది. అందుకే అత్యవసరమైనా వాటిని అమ్ముకోలేరు యజమానులు. ఒకవేళ అమ్మినా, అసైన్డ్ భూములకు రేటు ఉండేది కాదు, న్యాయపరమైన చిక్కులుంటాయనే ఉద్దేశంతో తక్కువ రేటుకే వాటిని కొనేవారు కాదు అని భూములు రిజిస్ట్రేషన్లు కూడా కావు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త చట్టం తెస్తోంది. అందులో భాగంగానే ఆర్డినెన్స్ ని తీసుకొచ్చింది అని ప్రభుత్వం భూములు అసైన్ చేసి 20ఏళ్లు దాటితే వాటిని అమ్ముకునే అవకాశాన్ని యజమానులకు కల్పిస్తూ ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అని ఈ నిర్ణయాన్ని కూడా తాజా ఆర్డినెన్స్ లో పేర్కొంది అని ఇలా చిత్తశుద్ధితో పనిచేసే ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రభుత్వ విప్ శాసనసభ్యుల కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, వైస్‌ఎంపీపీ ధ్వజా రెడ్డి, ఓబులవారిపల్లి మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి, చిట్వేల్ మండల కన్వినర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బారామరాజు, జిల్లా టూరిజం డైరెక్టర్ సుధాకర్ రాజు, సినియర్ నాయకులు ఎల్వి మోహన్, ప్రతాప్ రెడ్డి, రాజారెడ్డి,రెడ్డి, చిట్వేల్ ఎంపీపీ చంద్ర, మరియు సర్పంచులు, రమణ, వినోద్, పెంచల్ రెడ్డి, శైలజ, మండలాల ఎమ్మార్వోలు, లబ్ధిదారులు తదితరులు భారీగా పాల్గొన్నారు.
అంగన్వాడి వర్కర్స్ సమస్యలు పరిష్కారం కోసం సెంటర్స్ క్లోజ్ చేసి సమ్మె చేశారు. రేపల్లె ప్రాజెక్ట్ ఆఫీస్ వద్ద శిబిరం ఏర్పాటు చేసుకొని ఏపి అంగన్వాడి వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ సిఐటియు ధర్నా చేశారు. ఈ సదర్భంగా అంగన్వాడీ వర్కర్స్, అండ్ హెల్పర్స్, యూనియన్ సీఐటీయూ ప్రాజెక్టు గౌరవాధ్యక్షులు సిహెచ్.మణిలాల్ లు మాట్లాడుతూ సమ్మెలోకి వెళుతున్నట్లు సమ్మె నోటీసులు పలుదపాలు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం స్పదించకపోవటంతో తప్పని పరిస్థితుల్లో సమ్మె చేయాల్సినా పరిస్థితి వచ్చిందని, రోజువారి పని ఒత్తిడి పెరగటం మరియు యాప్స్ పేరుతో తీవ్రమైన ఇబ్బందులు అంగన్వాడి వర్కర్స్ పడుతున్నారు అని అన్నారు. రోజువారీ ధరలు పెద్ద ఎత్తున పెరుగుతున్నవి, అయినప్పటికీ వేతనాలు పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణా కన్నా 1000 ఎక్కవ వేతనం ఇస్తామన్నా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేస్తుందన్నారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం, లబ్ధిదారులకు అవసరమైన నాణ్యమైన ఫుడ్ సరఫరా చేయటం లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక పలుదఫాలు ఆందోళన చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో సెంటర్స్ క్లోజ్ చేసి సమ్మెలో చేయలిసినా పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలకు పిలిచి అంగన్వాడీలా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.





Total views : 91183