జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ టైకూన్ జంక్షన్ పరిశీలనకు వచ్చిన నాదెండ్ల మనోహర్ ను అక్రమంగా అరెస్టు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రశ్నించిన వారిని పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని అరెస్టులు చేస్తున్నారు. రాష్ట్రంలో క్రిస్టియన్ మైనార్టీ భూములను కూడా ఆక్రమించుకుని దోచేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వలపేక్షతో కాకుండా రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగిందని తెలిపారు. మంగళగిరిలో ఓటమి భయంతోనే బీసీ కార్డును తెరపైకి తెచ్చారని మంగళగిరిలో వైసిపి ఓటమికి జనసేన కచ్చితంగా ప్రభావితం చేస్తుందని రాజకీయ దురుద్దేశంతోనే బీసీలను తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు. రాబోయే రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే మంగళగిరిలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఎన్నికల పోటీ చేసే విషయంలో జనసేన పార్టీ అధిష్టాన నిర్ణయమే మాకు శిరోధార్యమని తెలిపారు.
ap politics
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కోటికలపుడి గోవిందరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తుంది. ఎంపీ స్వార్థానికి రోడ్డు మూసేయటం పై నిరసన తెలపడానికి వెళ్లిన నాదెండ్ల మనోహర్ ను అరెస్టు చేయడం పై తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వారిపై కేసును ఎత్తు వేయకపోతే చలో విశాఖపట్నం చేపడతామన్నారు. రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కులను కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నారని, ప్రభుత్వం అంటే ప్రజలకు అవసరమైన సమస్యలను తీర్చడం కానీ, ఇలా వారి అవసరాల కోసం రోడ్లను సైతం మూసివేసి సైకో పాలన చేస్తున్నారని పద్ధతి మార్చుకోకపోతే 2024లో ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
నాదెండ్ల మనోహర్ అరెస్టు ను పుంగనూరు జనసేన ఇంచార్జి, గంగాధర్ ఖండించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంగాధర్ మాట్లాడుతూ విశాఖపట్నం లో టైక్వాన్ జంక్షన్ మూసివేసిన ప్రభుత్వం, ఈ విదంగా మూసివేయడం వల న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమం లో ఆ జంక్షన్ ను తిరిగి తెరిపించాలనే కోణం లో శాంతియుతంగా సమస్య ను పరిష్కరించడానికి వెళుతున్న నాదెండ్ల మనోహర్ ను అక్రమ అరెస్టు చేశారని వాపోయారు. ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ యొక్క అక్రమ అరెస్టు నియోజకవర్గ స్థాయి లో మా జనసేన కార్యకర్తలు ఖండిస్తూ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న అని జనసేన పార్టీ ఇంచార్జి సి.గంగాధర్ తెలిపారు.
తమ అథినేత నాదెండ్ల మనోహర్ ను విశాఖపట్నం టైకూన్ సెంటర్లో వైజాగ్ పోలీసులు నిర్భందించినందుకు తెనాలిలో జనసైనికులు, వీరనారీమణులు, తెదేపా సభ్యులు ఆందోళనకూ దిగి మార్కెట్ సెంటర్లో రాస్తారోకో చేసి థర్నాకు దిగారు. తర్వాత జనసేన PAC ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ను వదలివేయటం జరిగింది. ఏమిటీ విశాఖ టైకూన్ సెంటర్ వివాదం ? విశాఖపట్నంలోని సిరిపురం జంక్షన్ నుండి విఐపి రోడ్డుకు వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసేసారు. నాలుగు నెలల క్రితమే టైకూన్ సెంటర్ వద్ద రోడ్డును మూసేసారు. అయితే ఇలా హటాత్తుగా ప్రజలు ఉపయోగించే రోడ్డును మూసేయాడానికి, ఇదే రోడ్డులో నిర్మిస్తున్న వైసిపి ఎంపి ఎంవివి సత్యనారాయణకి భవనమే కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ భవనానికి వాస్తు దోషం వుందని ఏకంగా రోడ్డునే మూసేసారని ఆరోపిస్తున్నారు. ప్రజా ప్రతినిధుల ఆస్తులను అధికారులు ప్రజలు ఉపయోగించే రోడ్డును మూసేయడం దారుణమని జనసేన నాయకులు అంటున్నారు.
లంక భూములకు మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పట్టాలు పంపిణీ చేశారు. ఏళ్ళనాటి కల నెరవేరింది అంటు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఐదంమండలాల్లో 1209 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. 19 సొసైటీలకుగాను 793.27ఎకరాలకు గాను 1209 మంది లబ్దిదారులకు లంకపట్టాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే వసంతవెంకటకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నోఎళ్ళనుండి ఎటువంటి ఆదారం లేకుండా లంకభూములను సాగుచేసుకుంటున్న పెదల కల నెరవేరింది అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు రెవిన్యూ యంత్రాంగం అంతా కష్టపడి ఎలాంటి అవకతవకలు లేకుండా నిబద్ధతతో ఎంక్వయిరి చేసి లబ్దిదారుల ఎంపిక చేశారన్నారు. ఇంకా కొన్ని సొసైటీలో చిన్నచిన్న అవకతవకలు ఉంటే వాటిని సరిచేయడానికి కొద్దిగా సమయం పడుతుంది. త్వరలో వారికి కూడా ఖచ్చితంగా పట్టాలు పంపిణీ చేస్తామ న్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ మాట్లాడుతూ అర్హులైన పేదల లంక భూములకు పట్టాలు పంపిణీ లో స్థానిక రెవెన్యూశాఖ సిబ్బంది చాలా బాగా పనిచేశారన్నారు. పంపిణీ విషయంలో ఏవైనా అనర్హులుగా ఉండి పట్టాలు తీసుకుని ఉంటే నా దృష్పికి తీసురావచ్చని ఆమె అన్నారు. ఈకార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికి వెళ్తున్న పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ని అడ్డుకొని అరెస్టు చేయడం అక్రమం అని అన్నారు. వైజాగ్ ఎంపీ లేఅవుట్ వేశారు. దాన్ని కి అన్ని హంగులు సమకూర్చి అమ్ముకోవటానికి, వాస్తు అడ్డు వచ్చినదాని రోడ్డు మూశారు. ఆ రోడ్డు వల్ల ప్రజలు నాలుగైదు కిలోమీటర్లు తిరిగి రావాల్సి వచ్చింది. దాన్ని ప్రశ్నించడానికి వెళ్తున్న నాదెండ్ల మనోహర అడ్డుకొని, అరెస్టు చేయటం హేయమైన చర్య అని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కుని కాలరాయకూడదు. పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అరెస్టు చేయటానికి బోర్ర వెంకట అప్పారావు తీవ్రంగా ఖండించారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా, ప్రకాశం జిల్లా మార్కాపురం లోని మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్ నందు సచివాలయ ఉద్యోగులతో చర్చించి ప్రతి సచివాలయంలో తప్పనిసరిగా ఆంద్రానికి ప్రోగ్రాం సక్సెస్ఫుల్ చేయాలని సచివాలయ సిబ్బందికి క్రికెట్, ఫుట్బాల్, క్రీడలకు సంబంధించిన క్రీడాకిట్లను ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు, కమిషనర్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
ఈ నెల డిసెంబర్ 9 న కొత్త ఓటరు నమోదు ప్రక్రియ చివరి రోజు గడువు కావడంతో శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణం బస్టాండ్ సర్కిల్ వద్ద క్యాంప్ నిర్వహించి విద్యార్థులు, అర్హత ఉన్న ప్రజలకి ఓటరు నమోదు పై అవగాహన కల్పించి జనసేన పార్టీ ఐటీ సభ్యుల ద్వారా ఓటు లేని వారికి ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు. అలాగే ప్రజలకి తమ ఓటు ఉందో లేదో పరిశీలించుకునే అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధంతో ప్రజల తలరాతలు నిర్దేశిస్తుందని , ఓటు విలువ అందరూ గ్రహించాలని , అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ డిసెంబర్ 9 వ తేదీ లోపు ఓట్లు నమోదు చేసుకోవాలని, మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవాలని ,అలాగే ఓటరు లిస్టులో దొంగ ఓట్లు ఉన్నట్లైతే అభ్యతరలు తెలపాలని, గ్రామ, వార్డు స్థాయిలో జనసేన నాయకులు, జనసైనికులు పరిశీలించి ఈ ప్రక్రియ పూర్తి చెయ్యాలని కోరారు.
మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో పిచ్చాటూరు మండలం శివగిరి గ్రామంలో వరద బాధితులకు నిత్యవసర సరుకులు బియ్యం, ఆయిల్, పప్పు లు పంపిణీ చేశారు. ఆర్థిక సహాయం క్రింద ఒక వ్యక్తి ఉన్న కుటుంబానికి 1000 రూపాయలు, ఇద్దరు ఉన్న కుటుంబాలకు 2000 రూపాయలు, ఇద్దరి కన్నా ఎక్కువ ఉన్న కుటుంబాలకు 2500 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో తహాశీల్దార్ మధుసూధన్ రావు, వైఎస్ఆర్సీపీ పార్టీ కన్వీనర్ చలపతి రాజు, రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ నాయుడు, ఎంపీటీసీ రమేష్ రాజు,స ర్పంచ్ కిరణ్ నాయుడు విఆర్ఓ రూపేష్ తదితరులు పాల్గొన్నారు.
డా,, బిఆర్ అంబేద్కర్ ఆశయాలు అమలు కావాలని, విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అన్నారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. దేశంలో ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం జగన్ పాటిస్తున్నారు అని, అందుకే జగన్ అంటే నాకు అత్యంత గౌరవం అన్నారు. పేదల పక్షపాతి సీయం జగన్ అని కొనియాడారు. విద్యావిధానం రాష్ట్రం లో మంచిగా అమలు అవుతుందని, ప్రతి పేదవాడికి విద్యా వైద్యం అందుబాటులో ఇవాళ ఈ రాష్ట్రం లో ఉందని అన్నారు. తెలంగాణ ఎన్నికల పై నారాయణ స్వామి స్పందిస్తు…తెలంగాణలో ఒక మతం పైనే అక్కడి రాజకీయం ఈ ఎన్నికలలో జరిగిందని, కేవలం కేసీఆర్, కేటీఆర్ టార్గెట్ గానే రాజకీయం జరిగిందని కులాన్ని మతాన్ని రెచ్చగొట్టి కాంగ్రెస్ గెలిచిందని అన్నారు. దీనివల్ల పరోక్షంగా చంద్రబాబుకు మేలు, ఆ పార్టీ నాయకులకు ఆనందం జరిగింది అంతే తప్ప వేరే లేది కాదని ఎద్దేవా చేసారు. అభివృద్ధి ని అక్కడ అడ్డకుని కుతంత్రాలతో బీఆర్ ఎస్ ని ఓడించి కాంగ్రెస్ ని గెలిపించారు అని ఆరోపించారు.ఇదంతా ఎల్లో మీడియా, చంద్రబాబు ప్లాన్… రేవంత్ రెడ్డి ఇప్పటి కీ టీడీపీ మనిషే అని ఆరోపించారు. వరద ప్రాంతాలలో సహాయ చర్యలు జరుగుతున్నాయని, తిరుపతి కాళహస్తి, గూడూరు ప్రాంతాలలో నష్టం జరిగిందని వాళ్లకి సహాయ చర్యలు జరుగుతాయని అన్నారు. రైతులకు తీవ్రంగా నష్టం జరిగిందని ఎక్కవుగా పంట నష్టం జరిగిందని వాళ్లకి అంచనా వేసి త్వరలో నష్ట పరిహారం చెల్లిఇస్తాం అన్నారు నారాయణ స్వామి. రైతులను ఆదుకుంటామని 20 రోజుల్లో నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు మంత్రి.





Total views : 91209