పశ్చిమగోదావరి మిచౌoగ్ తుఫాన్ కారణంగా 15 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, నష్టపోయిన ప్రతి రైతుని ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు తో కలిసి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఇప్పటికే మిల్లర్ల ను ఆదేశించామన్నారు . ఎక్కడైనా మిల్లర్లు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని , రైతుల నుంచి చివరు గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వాన్ని దేనిని స్పష్టం చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి మాట్లాడుతూ రైతులకు గోనే సంచులను కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తుందన్నారు
ap politics
జగన్ కి ఓటు వేస్తే నడి రోడ్డుకు తెచ్చేశాడు. జగనన్న ఇళ్లు అని మోసం చేశాడు. తుఫానులో ఇళ్లు అన్ని కొట్టుకుని పోయాయి. కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వలేదు, అన్నం పెట్టలేదు. శ్రీకాళహస్తిలో బీసీ హాస్టల్ లో పెట్టిన తుఫాను బాధితులు జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా గారితో ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీకాళహస్తి జనసేన పార్టీ కార్యాలయంలో ఇంఛార్జి వినుత కోటా, వీరమహిళలు, జనసైనికులతో 2,000 మంది తుఫాను బాధితులకు బోజన ఏర్పాట్లు చేసారు.
ప్రధాని మోడీ, సీఎం జగన్ ఇద్దరు ఒక్కటే అని ప్రజలు గమనించాలి. ప్రభుత్వం మైనారిటీల కార్పొరేషన్ రద్దు చేసి హక్కులను కాలరాసింది. ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమావేశానికి టిడిపి నేతలు హాజరు అయ్యారు. చంద్ర బాబు హయాంలో ముస్లిం ల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టింది. జగన్ హయాంలో అన్ని వర్గాల కు అన్యాయం చేశారు. సమాజంలో ముస్లిం ల పాత్ర కి ఒక గుర్తింపు ఉంది. రానున్న ఎన్నికల్లో టిడిపి విజయ కేతనం కి ముస్లింలు సహకారం అందించాలి.
తుఫాన్ నేపద్యంలో రామచంద్రపురం నియోజకవర్గంలో పలు గ్రామాలు పర్యటించి పంట పొలాలను రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు పరిశిలించారు. కె. గంగవరం మండలం కుందూరు గ్రామంలో తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షం వల్ల తడిసిన ధాన్యపు రాశులను మంత్రి వేణు పరిశీలించి అధికారులతో మాట్లాడి తడిసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు మంత్రి వేణు తరలించారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు. తడిసిన ధాన్యాన్ని
ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి వేణు రైతులకు భరోసా ఇచ్చారు. మంత్రి వేణు వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైసీపీ నాయకులు ఉన్నారు.
ప్రభుత్వ భూములపై ఆధారపడి 20 సంవత్సరాల పంటలు వేసుకొని రైతులు అనుభవిస్తున్న భూములకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశంతో ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుపాడు, కొనకలమిట్ల, పొదిలి, మార్కాపురం నాలుగు మండలాలలో 1210 మంది రైతులకు మరియు కొత్తగా 19 మంది రైతు లబ్ధిదారులకు పట్టణంలోని యస్.సి.బి.సి కాలనీలోని వెలుగు కార్యాలయంలో అసైన్డ్ ల్యాండ్ పట్టాలను ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఎంపీపీలు, తాసిల్దార్లు, పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ జెసి అస్మిత్ రెడ్డి సోమవారం భారీ ర్యాలీ చేపట్టారు. టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించడంలో జాప్యం జరుగుతుందని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి జేసీ నివాసం నుంచి అశోక్ పిల్లర్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ చేరుకొని ఎన్టీఆర్ కు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆర్డీటీ కాలనీలోని టిడ్కో గృహాలు వద్దకు తరలివెళ్లారు.
అవుకు పట్టణం బలిజ సంఘం అధ్యక్షుడు రామన్న ఆధ్వర్యంలో కార్తీక వనమహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి తనయుడు కాటసాని ఓబుల్ రెడ్డి హాజరయ్యారు. గజమాలలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.అవుకు మండల బలిజ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కాటసాని ఓబుల్ రెడ్డిని గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ అవుకు మండలంలో అత్యధిక ఓట్ల శాతం కలిగి ఉన్న బలిజ సంఘం రాజకీయాల్లోకి రావాలని వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. బలిజ సంఘాల కొరకు ఒక కోటి 20 లక్షల రూపాయలతో కళ్యాణమండపం ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే అత్యధికంగా ఇంటి స్థలాలు భూ పంపిణీ కార్యక్రమంలో వారికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చానని చెప్పారు. త్వరలోనే ఇంటి స్థలాలతో పాటు భూ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని చెప్పారు. నిత్యం ప్రజల కోసం కష్టపడే నాయకుడు ఎవరని ప్రజలు గుర్తించాలని అలాంటి వ్యక్తులకే 2024 లో మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, శాసనసభ్యుడిగా తనను గెలిపించాలని చెప్పారు.
భారతీయ జనతా పార్టీ గన్నవరం నియోజకవర్గ కన్వీనర్ (ఇంచార్జ్) కురుమద్దాలి ఫణి కుమార్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు, సంబరాల్లో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి మట్టా ప్రసాదు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాదెండ్ల మోహన్, రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యులు కానూరు శేషు మాధవి బిజెపి నాయకులు, ఈ సందర్భంగా కురుమద్దాలి ఫణి కుమార్ మాట్లాడుతూ దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేసింది చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా గతంలో కంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఓటు శాతం పెరిగినందుకు సంతోషిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయానికి కృషి చేస్తాం. భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నంతకాలం మనదేశానికి ఏ విధమైన ఆటంకం గాని కీడులుగాని జరగవని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. ప్రజలు కూడా తెలుసుకోవాలని మనవి చేస్తున్నాం.
తెలంగాణ రాష్ట్ర లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గేలుపు పోందటం తో అవనిగడ్డ నియోజకవర్గంలోని, చల్లపల్లి, కోడూరు, అవనిగడ్డ ,మోపిదేవి, ఘంటసాల, మండల లో కాంగ్రెస్ నేతలు విజయోత్సవ వేడుకలుఘనంగా నిర్వహించారు. సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణను పదేళ్లపాటు దోచుకున్న కేసీఆర్ కుటుంబ అవినీతి పరిపాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మీర్ రిజ్వాన్ ,కాగితాల సుదర్శన్ ,అది రామ్మోహన్ రావు పలువురు నాయకులుఅన్నారు. ఆదివారం సాయంత్రం చల్లపల్లి,కోడూరులో రాజీవ్ గాంధీ,ఇందిరా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు టపాసులు పేల్చి, రాజీవ్ గాంధీ,ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈసందర్భంగా రిజ్వాన్ మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న వనరులు, సంపద మొత్తం దోచుకుని కెసిఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు కలసి తెలంగాణ ప్రజల భవిష్యత్తును అంధకారంగా మార్చారన్నారు. అలాంటి దోపిడీ పరిపాలనను తెలంగాణ ప్రజలు అంతమొందించి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వటం అత్యంత హర్షించదగ్గ పరిణామం అన్నారు.
శ్రీకాకుళం జిల్లాకేంద్రంలోని ఏడు రోడ్ల జంక్షన్ లో బిజేపి శ్రేణులు సంభరాలు జరుపుకున్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లో విజయం
సాదించడంతో పాటు తెలంగాణాలో మెరుగైన ఫలితాలు సాదించామన్నారు. జిల్లా అద్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు .. ఈ ఏన్నికల ఫలితాలతో మరో సారి మోడి ప్రదాని కావడం తద్యమన్నారు. తెలంగాణాలో అసేంబ్లీ స్థానాలను పెంచుకోవడంతో పాటు ఇద్దరు ముఖ్యమంత్రి అబ్యర్దులను సైతం
ఓడించామన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విజయం తథ్యం అని పేర్కొన్నారు…





Total views : 91209