అమరావతి, ఆరోగ్యశ్రీ లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇకపై ఆరోగ్యశ్రీ కార్డుదారులకు 25 లక్షల వరకూ ఉచిత వైద్యం. ఉదయం 11 గంటలకు ఆరోగ్యశ్రీ విస్తరణ కార్యక్రమం ప్రారంభించనున్న సీఎం జగన్. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ. కార్డుల పంపిణీలో పాల్గొనాలని ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఆదేశాలు. కార్డుల పంపిణీ సమయంలో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్ లోడ్ చేసేలా చర్యలు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స ఎలా చేయించుకోవాలో వివరించేలా ప్రత్యేక క్యాంపెయిన్.
Arogya sri
ఖమ్మం జిల్లా కూసుమంచి ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు లక్షల నుంచి 10 లక్షలకు పెంచిన రాజీవ్ ఆరోగ్యశ్రీ ని డెప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లు ప్రారంభించారు. ఈ సందర్భంగా రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మాటల వరకే పరిమితం కాకుండా మొదటి రెండు రోజుల్లో నే ఆరు గ్యారెంటీ ల్లో రెండు గ్యారెంటీ లను అమలు చేసిందన్నారు. రాబోయే రోజుల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ లను అమలు చేసే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టభోతోందని శ్రీనివాస రెడ్డి తెలిపారు.
Read Also..
ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పటల్స్ కు గత ఆరునెలలుగా జగన్ సర్కారు రూ.1000కోట్లరూపాయలు బకాయిలు పెట్టినందున ఈనెల 27వతేదీ నుంచి వైద్యసేవలు నిలిపివేస్తామని ఎపి స్పెషాలిటీ హాస్పటల్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి లేఖ రాయడం రాష్ట్రంలో నెలకొన్న దుస్థితికి అద్దం పడుతోంది. కరోనా విపత్తు సమయంలో సాక్షాత్తు సిఎం సొంత జిల్లా కడపలో ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలు అందించబడవని బోర్డులు పెట్టినపుడే జగన్ రెడ్డి పనితనమేమిటో రాష్ట్రప్రజలకు అర్థమైంది. చేతగానిపాలనతో ఖజానాను దివాలా తీయించిన ముఖ్యమంత్రి ముఖం చూసి కాంట్రాక్టర్లు పరారు కావడం చూశాం. స్కూలు పిల్లలకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ నిర్వహించడానికి పేపర్లకు దిక్కులేక వాట్సాప్ లో ప్రశ్నాపత్రాలను పంపించిన విచిత్రమైన పరిస్థితిని కూడా చూశాం. నాలుగున్నరేళ్లుగా అస్తవ్యస్తమైన ఆర్థిక విధానాలతో ట్రిపుల్ ఎ ప్లస్ గా ఉన్న రాష్ట్ర పరపతిని ట్రిపుల్ బి ప్లస్ కు దిగజార్చారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు కేటాయించకుండా లక్షలాది నిరుపేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నెట్ వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేసి పేదలకు ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను.…నారా లోకేష్
Read Also..



Total views : 78852