ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియాకు స్వల్ప ఊరట లభించింది. సోమవారం ఢిల్లీ కోర్టు ఆయనకు మూడు రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరుచేసింది. తన తోబుట్టువు కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు కోర్టు నుంచి ఈ ఉపశమనం దక్కింది. మద్యం కుంభకోణం కేసులో సిసోదియా ఏడాదిగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో సీబీఐ, ఈడీ ఆయన్ను విచారిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన కస్టడీపై తిహార్ జైల్లో ఉన్నారు. ఈక్రమంలో ఆయన అభ్యర్థనను అంగీకరించిన న్యాయస్థానం ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మరోవైపు, అనారోగ్యంతో బాధపడుతోన్న తన భార్యను వారానికి ఒకసారి పరామర్శించేందుకు కొద్దిరోజుల క్రితం ఢిల్లీ కోర్టు సిసోదియాకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన భార్య ఆటోఇమ్యూన్ డిజార్డర్, మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే అరుదైన సమస్యలతో బాధపడుతున్నారు.
మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.