ఆత్రేయపురపు వంగ, ముండ్ల వంగ, కస్తూరి వంగ, నీటి వంగ, గుత్తి వంగ ఇలా రకరకాల వంకాయలు మనకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వంకాయలతో ఎన్నో రకాల వంటలు చేస్తారు. అనేక అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. వంకాయలో విటమిన్లు, ఖనిజాలు కీలకమైన ఫైటో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే వంకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. అదే సమయంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అలాగే వంకాయలను వారంలో కనీసం రెండు సార్లు అయినా తింటే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వంకాయల వల్ల మరో ప్రయోజనం ఏంటంటే. శరీరంలో కొవ్వులను కరిగించే శక్తి వీటిలో సమృద్ధిగా ఉంది.బరువు తగ్గాలనుకునేవారు ఖచ్చితంగా వారంలో రెండు సార్లు వంకాయలను తినడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదేవిధంగా, వంకాయలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బీ3, బీ6, యాంటీఆక్సిడెంట్లు తదితర పోషకాలు గుండె జబ్బులు, గుండె పోటు వచ్చే రిస్క్‌ను తగ్గిస్తుంది. అలాగే శరీరంలో షుగర్ లెవల్స్‌ను కూడా వంకాయలు కంట్రోల్ చేయగలవు.
B6
ఈ కాలంలో పొన్నగంటి కూర ఎక్కువగా లభిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ ‘ఎ’, ‘బి6’, ‘సి’, ఫొలేట్, ‘రైబోఫ్లెవిన్’, పొటాషియం, ఇనుము, మెగ్నీషియం దీన్నుంచి సమృద్ధిగా దొరకుతాయి. గోధుమ పిండి, బియ్యం, ఓట్స్‌లో కంటే ముప్ఫై శాతం ఎక్కువగా ప్రొటీన్లు అందుతాయి. అమినో ఆమ్లాలూ శరీరానికి లభిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆకు కూరను తరచూ తింటే మంచిది. ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పొన్నగంటి ఆకుల్లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటుని తగ్గించి, గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా కాపాడతాయి. ఆస్తమా, బ్రాంకైటీస్‌తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది. దీన్లో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ, ఆస్టియోపోరోసిస్ వంటి వాటిని దూరం చేయడానికీ ఉపయోగపడుతుంది. ఈ ఆకుల్లోని కొన్ని పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. గౌట్, మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహాతోనే దీన్ని తీసుకోవాలి. ఒకసారి కూర చేశాక పదే పదే వేడి చేయడం సరికాదు. ఒక్కోసారి వికారానికి దారి తీసే ప్రమాదం ఉంది.




Total views : 150414