తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాల అనంతరం కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజల పక్షాన బీజేపీ పోరాడితే కాంగ్రెస్ లబ్ధి పొందిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఓడించాలన్న లక్ష్యంతో ముస్లింల ఇళ్లను కూల్చినోళ్లకు, వక్ఫ్ ఆస్తులను కబ్జా చేసినోళ్లకే ముస్లింలు ఓటు వేయడం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. ఏది ఏమైనా కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల గోసపడుతున్న ప్రజలను చైతన్యం చేసింది బీజేపీ అని, కానీ అంతిమంగా కాంగ్రెస్ ఆ లబ్ధి పొందిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలిచిన తమపై కేసులు పెట్టారని, జైలుకు కూడా పంపారని గుర్తు చేసుకున్నారు. దురదృష్టవశాత్తు ప్రజలు తమను ఆదరించలేదని, అయినప్పటికీ కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందన్నారు. గెలుపోటముల ఆధారంగా తాను పనిచేయనని, తన లక్ష్యం తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమేనని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు తాను, రేవంత్‌రెడ్డి లక్ష్యంగా మారామన్నారు. బీజేపీ కోసం కష్టపడి పనిచేసిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రూ. 200 కోట్లు ఖర్చు చేసి తిరిగి తాను డబ్బులు పంచుతున్నానని అభాండాలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ గ్రాఫ్ తగ్గించేందుకు కుట్ర చేసి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి లాభపడాలని చూసిన బీఆర్ఎస్ చివరికి ఓటమి మూటగట్టుకుందని బండి సంజయ్ పేర్కొన్నారు.
Bandi Sanjay
తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాల అనంతరం కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన. ప్రజల పక్షాన బీజేపీ పోరాడితే కాంగ్రెస్ లబ్ధి పొందిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఓడించాలన్న లక్ష్యంతో ముస్లింల ఇళ్లను కూల్చినోళ్లకు, వక్ఫ్ ఆస్తులను కబ్జా చేసినోళ్లకే ముస్లింలు ఓటు వేయడం తనను ఆశ్చర్యపరిచిందన్నారు.
ఏది ఏమైనా కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల గోసపడుతున్న ప్రజలను చైతన్యం చేసింది బీజేపీ అని, కానీ అంతిమంగా కాంగ్రెస్ ఆ లబ్ధి పొందిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలిచిన తమపై కేసులు పెట్టారని, జైలుకు కూడా పంపారని గుర్తు చేసుకున్నారు. దురదృష్టవశాత్తు ప్రజలు తమను ఆదరించలేదని, అయినప్పటికీ కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందన్నారు.
గెలుపోటముల ఆధారంగా తాను పనిచేయనని, తన లక్ష్యం తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమేనని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు తాను, రేవంత్‌రెడ్డి లక్ష్యంగా మారామన్నారు. బీజేపీ కోసం కష్టపడి పనిచేసిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రూ. 200 కోట్లు ఖర్చు చేసి తిరిగి తాను డబ్బులు పంచుతున్నానని అభాండాలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ గ్రాఫ్ తగ్గించేందుకు కుట్ర చేసి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి లాభపడాలని చూసిన బీఆర్ఎస్ చివరికి ఓటమి మూటగట్టుకుందని బండి సంజయ్ పేర్కొన్నారు.
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని కరీంనగర్ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారనీ, ఓటర్ లిస్టు పట్టుకుని ఒక్కొక్కరికి రూ.10 వేలు ఇస్తూ ఆ లిస్ట్ పై పెయిడ్ అని రాసుకుంటున్నా పోలీసులు పట్టించుకోవడంలేదన్నారు. పోలీస్ కమిషనర్ పూర్తి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నప్పటికీ… కిందిస్థాయి సిబ్బంది మాత్రం బీఆర్ఎస్ తొత్తులుగా మారారు అని అన్నారు.బీజేపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
నిజామాబాద్ ఎంపీ, కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో బీజేపీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌కు హాజరై అర్వింద్ మాట్లాడుతూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కన్నా సీఎం కేసీఆర్ మేలు అని అన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ పదేండ్లు కొట్లాడాడు.. అప్పడు రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నారని అన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు చెప్పినట్లే రేవంత్ రెడ్డి చేస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఓటేస్తే.. ఆంధ్రాలో ఉన్న టీడీపీ చేతిలో తెలంగాణను పెట్టినట్లేనని అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను రేవంత్ రెడ్డి హోల్ సేల్‌గా అమ్మేస్తాడని విమర్శలు చేశారు. చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి సంచులను మోసుకెళ్లాడు.. ఆ కేసును సీఎం కేసీఆర్ కాపాడుతున్నాడని విమర్శించారు.
పార్టీలో టికెట్లు ఇస్తానని చెప్పి కోట్ల రూపాయలు వసూళ్లు చేసిన వ్యక్తి బండి సంజయ్ అని ఆ అవినీతి సొమ్ముతో గెలిచేందుకు మళ్ళీ వస్తున్నాడని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్థులు పెద్ద ఎత్తున డప్పు చప్పుళ్ళు, తెలంగాణ సాంప్రదాయం ఉట్టి పడేలా బతుకమ్మ బోనాలతో ఘన స్వాగతం పలికారు. మంత్రి గంగుల ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ…బీసీ బిడ్డ తుల ఉమ పోటీ చేసేందుకు సిద్ధం కాగా ఆమెకు వ్యతిరేకంగా నిలిచిన వ్యక్తికి 20 కోట్ల రూపాయలకు టికెట్ బండి సంజయ్ అమ్ముకున్నడని ఆరోపించారు. సంజయ్ ఎన్నికలు వచ్చిన ప్రతీ సారి ఎదో ఒక డ్రామా ఆడి ఓట్లు దండుకావాలని చూస్తాడని, ఆయన యాక్టింగ్ బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ లను మించిపోయిందని ఎద్దేవా చేసారు. భు మాఫియాకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని, ఆయన సర్పంచ్ గా అవకాశం ఇస్తే కబ్జాలు చేసిన వ్యక్తి ఎమ్మెల్యే అయితే మీ భూములు, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తాడని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు భూమాఫియా లో భాగస్వాములు అని అన్నారు. తనకు వ్యాపారాల వల్ల డబ్బులు సంపాదిస్తే బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు ఏ వ్యాపారం చేసి కోట్ల రూపాయలు సంపాదించారో చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కబ్జాల వల్ల బొమ్మకల్ గ్రామంలోని భూ రికార్డులు సీబీసీఐడీ వద్ద ఉండే దుస్థితి దాపురించింది అని అన్నారు. 12 ఇళ్లులు కట్టుకున్న కాంగ్రెస్ అభ్యర్థి గ్రామపంచాయతీ భవనం కట్టలేకపోయడని అన్నారు. ఎంపీగా బండి సంజయ్ ను గెలిపిస్తే ఒక్క రోజు ఏ గ్రామానికి రాని వ్యక్తి మళ్ళీ ఓట్ల కోసం ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాడని, మహిళలు నిలదీయాలని కోరారు. రానున్న ఎన్నికలు మీ బిడ్డల భవిష్యత్ ను సూచించే ఎన్నికలు అని, ఒక్క ఓటు తప్పు జరిగితే మీ పిల్లల భవిష్యత్ అంధకారం అవుతుందని అన్నారు.
బీజేపీ మేనిఫెస్టో పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. బీసీ ముఖ్యమంత్రి హామీ పట్ల తెలంగాణ ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తుందన్నారు.నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ…యువత, మహిళలు ప్రధాని మోదీకి అండగా నిలబడుతున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కుటుంబాల నుంచి వచ్చినవారు కూడా బీజేపీకి జైకొడుతున్నట్లు చెప్పారు. ఒక మాట చెబితే దానికి కట్టుబడి ఉండేది బీజేపీ మాత్రమేననే అభిప్రాయం అందరిలోనూ ఉందన్నారు.కాంగ్రెస్,బీఆర్ఎస్, మాటలు కొటలు దాటుతాయని, కానీ చేసే పని మాత్రం ప్రగతి భవన్, గాంధీ భవన్ కూడా దాటవని ఎద్దేవా చేశారు.ఏడు దశాబ్దాలుగా కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని, కానీ ప్రజలకు విషాదమే మిగిల్చిందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి దాదాపు పదేళ్లవుతోందని, కానీ ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కాసేపట్లో మానిఫెస్టో విడుదల చేయనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు. అన్నివర్గాల ప్రజల్ని ఆకట్టుకునేలా దశదిశ పేరుతో కమలం పార్టీ మ్యానిఫెస్టోను రెడీ చేసినట్లు తెలిసింది. ధరణి స్థానంలో మీ భూమి యాప్, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ వంటివాటిని మ్యానిఫెస్టోలో పొందుపర్చినట్లు తెలుస్తోంది. ఇక మేనిఫెస్టోలో ముఖ్యాంశాలను ఓ సారి పరిశీలిస్తే.. ధరణి స్థానంలో మీ భూమి యాప్, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు..
గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ..రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు కమిషన్ ఏర్పాటు, 4 శాతం ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేత..,సబ్సిడీపై విత్తనాలు… వరి పంటకు బోనస్.. ఆడబిడ్డ భరోసా పథకం కింద 21ఏళ్ళు వచ్చేసరికి 2లక్షల రూపాయలు చెల్లించడం..ఉజ్వల లబ్ధిదారులకు ఉచితంగా నాలుగు సిలిండర్లు.. మహిళ రైతు కార్పొరేషన్ ఏర్పాటు..ఫీజుల నియంత్రణ నిరంతర పర్యవేక్షణ..స్కూల్స్ కు పన్ను మనిహాయింపులు..ప్రతి జిల్లా కేంద్రంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లు..నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ..ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు..పీఆర్సీపై రివ్యూ.. ప్రతి ఐదేళ్లకొకసారి పీఆర్సీ, జీఓ 317 పై పునః సమీక్ష, గల్ఫ్ దేశాల్లో తెలంగాణ భవన్ లు, 5 ఏళ్లకు లక్ష కోట్లతో బీసీ అభివృద్ది నిధి, రోహింగ్యాలు, అక్రమ వలస దారులనీ పంపించి వేస్తాంతెలంగాణలో ఉమ్మడి పౌర స్మృతి అమలు, అన్ని పంటలకు పంట భీమా… భీమా సొమ్మును రాష్ట్ర ప్రభుత్వమే అందేచాలని నిర్ణయం, 5 ఏళ్లలో మహిళలకి ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో 10లక్షల ఉద్యోగాలువృద్ధులకు కాశీ, అయోధ్యలకు ఉచిత ప్రయాణం తదితర అంశాలపై బీజేపీ మానిఫెస్టోను ప్రకటించనుంది.
తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇస్తే యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్‌లో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. ప్రవళిక వంటి యువత ఆత్మహత్యలు జరగకుండా చూస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అత్యంత అవినీతిమయ ప్రభుత్వం కేసీఆర్‌దే అన్నారు. అధికారంలోకి రాగానే సెప్టెంబరు 17ను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఓవైసీ ఒత్తిడికి లొంగి కేసీఆర్… రాజ్యాంగానికి విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్లు కల్పిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్లలో ఉమ్మడి ఏపీకి రూ.2 లక్షల కోట్లు ఇస్తే, మోదీ ప్రభుత్వం ఒక్క తెలంగాణకే రూ.2.5 లక్షల కోట్లు ఇచ్చిందని చెప్పారు. ప్రధాని మోదీ ఓబీసీలకు సముచిత స్థానం కల్పించారు. ఎంబీబీఎస్ సీట్లలో బీసీలకు 25శాతం రిజర్వేషన్లు కల్పించామని అమిత్ షా వివరించారు.
తెలంగాణ ఎన్నికలు సందర్బంగా రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. హుస్నాబాద్‌లో ఎన్నికల ప్రచారం లో 70 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులకు కేసీఆర్ పెట్టుబడి పెడుతున్నారని ఎంపీ బండి సంజయ్ కీలకవ్యాఖ్యలు చేశారు. కొంతమంది పోలీసు అధికారులు కేసీఆర్ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు.30 వేల కోట్లతో అయ్యే కాళేశ్వరం ప్రాజెక్టును రూ.లక్ష 30 వేల కోట్లకు పెంచి కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులపై లాఠీచార్జి చేస్తే అర్ధరాత్రి ఢిల్లీ నుంచి వచ్చి వారిని ఆసుపత్రిలో చేర్పించి అండగా నిలిచానన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కి కూడ చురకలంటించారు. కాంగ్రెస్ పార్టీలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ ముఖ్యమంత్రులేనని ఎద్దేవా చేశారు.కరీంనగర్లో చెల్లని రూపాయి పొన్నం ప్రభాకర్ అని అన్నారు.
బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ లో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కరీంనగర్లో బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి సంజయ్ పాల్గొన్నారు. ర్యాలీలో బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్రంలో ప్రశ్నాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా పోరాడితే నాపై 30 దొంగ కేసులు పెట్టారన్నారు. మతతత్వవాది అనే ముద్ర వేసే ప్రయత్నం చేశారన్నారు. ధర్మం కోసం పోరాడేది భాజపా. రాజాసింగ్, నేను.. ధర్మం కోసం పోరాడేవాళ్లం. మేం ఎప్పుడూ కాషాయజెండాను వదిలిపెట్టలేదు. ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్కరు 10 ఓట్లు వేయించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించాక పార్టీని పరుగులెత్తించానని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 150 రోజుల పాటు ప్రజాసంగ్రామ యాత్ర చేసి కాషాయ జెండాను తెలంగాణ అంతటా రెపరెపలాడించానన్నారు.






Total views : 90582