బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం సాయంత్రం తిరుమలకు చేరుకొని మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ…ప్రపంచ వ్యాప్తంగా సనాతన ధర్మం పట్ల ఆదరణ పెరుగుతుందన్నారు. సనాతన ధర్మ వ్యాప్తి కోసం మరింత కృషి చేయాలని కోరారు. ఈ ఏడాది జనవరి 22 సువర్ణ అక్షరాలతో లికించబడుతుందన్నారు. 500ఏళ్ల నాటి కల రామమందిర నిర్మాణం జరిగిందని…22వ తేది రామ మందిరాన్ని ప్రారంభించడం శుభదాయకమన్నారు. సనాతన ధర్మాన్ని వినాశనం చేయడానికి పూనుకున్న వారే నాశనం అయ్యారని. ఇందుకు చరిత్రే నిదర్శనమన్నారు.
Bjp
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బీఆర్ఎస్ సహా ఎవరితోనూ పొత్తు ఉండదని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో శక్తి వందన్ వర్క్ షాప్ నిర్వహించారు. కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. భారతీయులు అంటే గతంలో విదేశాల్లో లెక్కచేయకపోయే వారని కానీ ఇప్పుడు భారత పాస్‌పోర్ట్ ఉంటేనే ప్రపంచవ్యాప్తంగా మంచి గౌరవం దక్కుతోందన్నారు. కానీ కేసీఆర్ కుటుంబం తమ పార్టీపై, పార్టీ నేతలపై అహంకారంతో ఇష్టారీతిన మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏ నాయకులు కూడా కేసీఆర్ కుటుంబం మాదిరి మాట్లాడరన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. తెలంగాణలో 32 జిల్లాలకు జాతీయ రహదారులను కేంద్రం అనుసంధానం చేసిందన్నారు. కేంద్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా బీజేపీ పాలన చేస్తోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రంపై భారం మోపిందని ఆరోపించారు. ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముందన్నారు. గతంలో తెలంగాణలో ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరిగాయని ఇప్పుడు వారం అటు ఇటుగా ఉండవచ్చునని… అందరు సిద్ధంగా ఉండాలని కేడర్‌కు పిలుపునిచ్చారు.
సీఎం జగన్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎంగా ఉన్నా కడపలోని స్టీల్ ప్లాంట్ ను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కడపలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. జగనన్న సొంత జిల్లానే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీజేపీకి బానిసలై వారికి మద్దతు ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ ముగ్గురు వస్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు. జగన్ కు ఓటేసినా బీజేపీ ఖాతాలోకి వెళ్లుందన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మారిపోయారన్నారు. వైసీపీ కోసం నిస్వార్ధంగా పని చేస్తే ఇప్పుడు తనపైనే వ్యక్తిగత దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా తన మార్క్ రాజకీయం, సంక్షేమ పాలన అందించారన్నారు. అదిప్పుడు జగనన్న పాలనలో ఎక్కడుంది అని ప్రశ్నించారు
బీహార్‌లో ఏర్పాడిన జనతాదళ్ యునైటెడ్, బీజేపీ కూటమి ఎక్కువ కాలం కొనసాగదని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బిహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి అదే సింహాసనాన్ని దక్కించుకున్నారు నితీష్ కుమార్. దీనిపై సర్వత్రా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో పార్టీ నేత ఒక్కోవిధంగా స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, బీహార్ వాసి అయిన ప్రశాంత్ కిషోర్ మాత్రం సరికొత్త విషయాన్ని వెల్లడించారు. బీహార్ లో కొత్తగా ఏర్పాటైన కూటమి 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగదని జోస్యం చెప్పారు ప్రశాంత్ కిషోర్. బీజేపీ అధ్వర్యంలోని జేడీయూ ప్రభుత్వానికి ఏడాది లేదా అంతకంటే తక్కువ కాలం ఉండవచ్చని కిషోర్ తెలిపారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామాపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఘాటుగా స్పందించారు. దేశంలో ఆయా రామ్, గయా రామ్‌లాంటి రాజకీయ నేతలు ఎక్కువైపోయారని పరోక్షంగా నితీశ్‌ని ఉద్దేశించి అన్నారు. మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తనతో నితీశ్ వెళ్లిపోతున్నారని చెప్పారు. ఈ విషయం తనకు ముందే తెలుసన్నారు. ఇండియా కూటమికి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ విషయాన్ని బయటకి చెప్పలేదన్నారు. అలా చెబితే ప్రత్యర్థులు ప్రజల్లోకి తప్పుడు సంకేతాన్ని పంపుతారని ఖర్గే అన్నారు. కాగా, జనతాదళ్ జాతీయ అధ్యక్షుడు, సీఎం నితీశ్ కుమార్ రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు తన రాజీనామాను అందజేశారు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశం పట్నాలోని పార్టీ కార్యాలయంలో జరుగుతోంది. జేడీయూ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఇవాళ రాష్ట్రానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తదితర అగ్రనేతలు రానున్నారు. కూటమి ఏర్పాటు అనంతరం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వీరు చర్చించనున్నారు.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. స్పీకర్ సమక్షంలో ఆయన ప్రమాణం చేస్తారు. గజ్వేల్ నుంచి గెలిచిన కేసీఆర్ ఆసుపత్రిలో చేరడంతో ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేయలేదు. కేసీఆర్ గత ఏడాది డిసెంబర్ 7న తన ఫాంహౌస్ బాత్రూంలో కాలు జారిపడ్డారు. దీంతో ఆయన కాలుకు తీవ్ర గాయమై ఆసుపత్రిలో చేరారు. ఇటీవల ఆయన కోలుకున్నారు. దీంతో ప్రమాణం చేయనున్నారు. గత ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ వరుసగా మూడోసారి విజయం సాధించారు. ఇటీవలి ఎన్నికల్లో సమీప బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై 45 వేల మెజార్టీతో విజయం సాధించారు. కామారెడ్డి నుంచి కూడా పోటీ చేసినప్పటికీ బీజేపీ నుంచి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎన్నికల్లో గెలిచిన వారిలో చాలామంది గత డిసెంబర్ నెలలోనే ప్రమాణం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులచే ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించిన మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రమాణం చేయించారు. బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ అయ్యాకే ప్రమాణం చేశారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది. ఈ మేరకు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. అత్యవసర పనుల కారణంగా అమిత్ షా పర్యటన రద్దయిందని తెలిపారు. ఆదివారం మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్‌లలో నిర్వహించాల్సిన సమావేశాలు రద్దయ్యాయి. బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా పర్యటన రద్దయినట్లుగా వార్తలు వస్తున్నాయి. బీహార్‌లో నితీష్ కుమార్ I.N.D.I.A. కూటమికి గుడ్‌బై చెప్పి బీజేపీ వైపు అడుగులు వేస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది.
మిత్రపక్షాల మధ్య విభేదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇండియా కూటమికే చెందిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఐక్యంగా ఉండాలని కూటమి నాయకులను స్టాలిన్ కోరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని మళ్లీ అధికారంలోకి రానివ్వకూడదన్న లక్ష్యంతో అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని అన్నారు. ప్రతి ఒక్కరికి ఒకే ఒక్క లక్ష్యం ఉండాలి. బీజేపీని తిరిగి అధికారంలోకి రానివ్వకూడదు. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకూడదు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం, ఫెడరలిజం ఉండవు అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం తిరుచిరాపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
హుకుంపేట మండలం డోంకిన వలస జంక్షన్ నుంచీ గేదెల పాడు వరకు 5 కిలోమీటర్లు మేరా తారు రోడ్డు నీ నాసిరకం గా నిర్మించిన కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర మేధావుల కన్వినర్ కురుస పార్వతమ్మ డిమాండ్ చేశారు. హుకుంపేట మండలం లోని జెర్రకొండ పంచాయతీ గేదెల పాడు గ్రామాన్ని స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తల తో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నాసిరకంగా నిర్మించిన తారు రోడ్డును పరిశీలించాలని అన్నారు. గ్రామస్తుల పిర్యాదు మేరకు గేదెల పాడు గ్రామం లో నిర్మించిన తారు రోడ్డును పరిశీలించినట్లు తెలిపారు. ఎన్ ఆర్ ఈ జి ఎస్ కేంద్ర ప్రభుత్వ నిధులు సుమారు 2 కోట్ల రూపాయల తో నిర్మించిన తారు రోడ్డు మున్నాళ్ళ ముచ్చటగా మిగిలిందన్నారు. రోడ్డు నిర్మించిన 10 రోజుల్లోనే రోడ్డు మధ్యలో గడ్డి మొక్కలు మొలిచాయని, కాలి తో గట్టిగ కెలికితే ముక్కలు ముక్కలు గా రోడ్డు ఊడి వస్తుందన్నారు. 75 సంవత్సరాల తరువాత గ్రామానికి రోడ్డు మంజూరు ఐతే ఈ విధంగా గుత్తేదారు నిర్లక్ష్యం తో రోడ్డు నిర్మించడం శోచనీయం అన్నారు. సంబంధిత జిల్లా ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపం కారణం గానే ఈ విధంగా రోడ్డు నిర్మాణం జరిగిందని ఆరోపించారు. ఇంత జరిగిన స్థానిక గ్రామాల గిరిజన ప్రజలు ఆందోళన చేస్తున్నారు తప్ప, వీరి ఓట్ల తో గెలిచినా స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ సమస్య పై మాట్లాడక పోవటం పై పలు అనుమానాలకు దారి తీస్తుందన్నారు. నాసిరకం గా రోడ్డు నిర్మించి 2 కోట్ల ప్రజా ధనం వృధా చేసిన కాంట్రాక్టర్ పై జిల్లా కలెక్టర్ కి బీజేపీ తరుపున పిర్యాదు చేస్తామని తెలిపారు. మిగతా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న పధకాలైన నాణ్యతతో నిర్మించేలా జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మఠం శాంత కుమారి మాట్లాడుతూ.. నాసిరకం నిర్మాణం చేసిన కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టి, ఇతర ప్రభుత్వ పనులు అతనికి కాంట్రాక్టు ఇవ్వకుండా చూడాలని జిల్లా కలెక్టర్ గారిని కోరారు. రోడ్డు నిర్మాణం జరుగుతున్నప్పుడు క్వాలిటి కంట్రోల్ అధికారులు పర్యవేక్షణ చెయ్యాల్సిన అవసరం ఉన్న, అసలు ఆ డిపార్ట్మెంట్ ఉందొ లేదో ప్రజలకు తెలియటం లేదన్నారు. వాళ్ళ పరిశీలన గనక ఉంటే ఈ విధంగా 2 కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా కాకుండా ఉండేదన్నారు. తక్షణమే సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పాంగి మత్స్య కొండ బాబు, బీజేపీ మండల నాయకులు సింహ చలం, సింహాద్రి, గేదెల పాడు గ్రామ ప్రజలు, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Read Also..
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ రహస్యమైత్రి మరోసారి బయటపడిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్టబయలైందన్నారు. బీజేపీ అజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్‌కు మేలు చేసే విధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడాన్ని గవర్నర్ నిరాకరించారని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా రాజకీయ పార్టీ అధ్యక్షుడినే సిఫారసు చేస్తే గవర్నర్ ఎందుకు ఆమోదించారని ప్రశ్నించారు. ఇది ద్వంద్వ నీతి కాదా అంటూ హరీష్‌రావు నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్ను అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నాయని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్రలో గవర్నర్ స్వయంగా భాగస్వామి కావడం అత్యంత దురదృష్టకరమంటూ హరీష్‌రావు ట్వీట్ చేశారు.