కరీంనగర్ లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కేటీఆర్ పై విమర్శలు కురిపించారు. కేటీఆర్ ఇంకా అధికారంలో ఉన్నానని భావిస్తున్నడు…అదే అహంకారం కన్పిస్తోంది. కేసీఆర్ పాలనలోని అరాచకాలను, అవినీతిని బయటపెట్టిందే బీజేపీ అంటు విమర్శించారు. అందుకే జనం ఆ పార్టీని బొందపెట్టారని, అయినా సిగ్గు లేకుండా అరువు జిల్లా నేతను తీసుకొచ్చి మొరుగుతున్నడు అని అన్నారు. బండి సంజయ్ ఏం చేసిండో కేసీఆర్ ను రమ్మను చర్చించేందుకు సిద్ధం అన్నారు. నువ్వెన్ని మొరిగినా నీ కుటుంబ గుత్తాధిపత్యాన్ని నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని అయన తెలిపారు.
కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ది మూడో స్థానమే…బీఆర్ఎస్ కు డిపాజిట్ రాదు. ఇక్కడున్న సోకాల్డ్ మేధావి వినోద్ కుమార్ టిప్పర్ దరఖాస్తులు పంపిండు తప్ప ఒక్క పని చేయలేదు. కేసీఆర్ కుటుంబానికి ఆయన ఉపయోగపడ్డారే తప్ప కరీంనగర్ కు చేసిందేమీ లేదని బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్.. జగిత్యాల, వరంగల్ జాతీయ రహదారి పనులకు నిధులు తెచ్చిందెవరు? అంటూ ప్రశ్నించారు. ఆయన ఎంపీగా ఉన్నన్నాళ్లు కరీంనగర్…వరంగల్ రోడ్డు అధ్వాన్నంగా ఉండేవి… యాక్సిడెంట్స్ అవుతుంటే ఎన్నడైనా నిధులు తెచ్చినవా? నేను ఎంపీగా ఉంటూ కేంద్రంతో మాట్లాడి రిపేర్లకు రూ.41 కోట్లు తెచ్చిన అంటూ ఫేర్ అయ్యారు. ఈనెల 28న ఎస్సారార్ కాలేజీలో వేలాది మంది బీజేపీ కార్యకర్తలతో సమ్మేళనం నిర్వహించనున్నారు. ఇక ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ కర్యక్రమానికి రానున్నారు. సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని బండి సంజయ్ పిలుపు నిచ్చారు.
Bjp
బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు ఆధారంగా చేవెళ్ల ఎంపీ, బీఆర్ఎస్ నేత రంజిత్ రెడ్డిపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తమ పార్టీకి చెందిన నేతలు, సర్పంచ్‌లను ఎందుకు కలుస్తున్నావని, ఎందుకు మాట్లాడుతున్నావంటూ అగౌరవంగా మాట్లాడారని, అసభ్యకరంగా మాట్లాడారని విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు జనవరి 17న రంజిత్ రెడ్డి తనకు కాల్ చేశారని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. రంజిత్‌రెడ్డిపై ఐపీసీ సెక్షన్ 504 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదు విషయంలో న్యాయ సలహా తీసుకున్నామని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ సతీష్ తెలిపారు. నాంపల్లిలోని మూడో ఏసీఎంఎం కోర్టును సంప్రదించగా పోలీసులకు కీలక సూచనలు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు ఉన్న సమయంలో జరిగిన ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా ఇటీవల అసోంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. ప్రజా ఆస్తులకు నష్టం కలిగించడం, ప్రజలను రెచ్చగొట్టడం, పోలీసులపై దాడి వంటి అభియోగాలతో రాహుల్ గాంధీపై అసోంలో కేసు నమోదు చేశారు. రాహుల్ గాంధీపై ఐపీసీ ఆర్/డబ్ల్యూ, పీడీపీపీ యాక్ట్ సెక్షన్ 3 కింద కేసు నమోదు చేసినట్టు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. రాహుల్ తో పాటు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ యువనేత కన్హయ్య కుమార్ లపైనా అసోం ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. అసోంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా సీఎం హిమంత బిశ్వ శర్మ, రాహుల్ గాంధీ మధ్య వాడీవేడి మాటల యుద్ధం జరిగింది. రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని, అతడి యాత్ర నక్సల్ పంథాలో సాగుతోందని బిశ్వ శర్మ తీవ్ర విమర్శలు చేశారు. ఇది అసోంకు ఎంతమాత్రం క్షేమకరం కాదని అన్నారు.
అందుకు రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. తానంటే బిశ్వ శర్మకు ఎందుకంత భయం అని ప్రశ్నించారు. తనను ఎవరూ బెదిరించలేరని స్పష్టం చేశారు. అసోం సీఎం దేశంలోనే అత్యంత అవినీతిపరులైన ముఖ్యమంత్రుల్లో ఒకరన్న విషయం అందరికీ తెలుసని అన్నారు. తన యాత్రకు బీజేపీ ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తోందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలంటూ అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు.
Read Also..
Read Also..
ఏపీ నుండి బీజేపీకి ఒక్క ఎంపీని ప్రజలు గెలిపించలేదన్నారు APCC అధ్యక్షురాలు షర్మిల. కానీ ప్రభుత్వం మొత్తం బీజేపీ గుప్పెట్లో ఉందని ఆరోపణలు చేశారు. ఏపీ ఎంపీలు బిజెపికి బానిసలైపోయారన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం బీజేపీకి అమ్ముడు పోయిందంటూ మండిపడ్డారు. ప్రజలకు కాంగ్రెస్ శ్రేణులు చెప్పాల్సింది ఇదేన్నారు. మీరు ఓట్లు వేసింది ఒకరికి.. కానీ ఇప్పుడు ఏలుతుంది ఇంకొకరు అన్నారు. ఈ ప్రభుత్వం ఒక్క వాగ్ధానం కూడా నిలబెట్టుకోలేదన్నారు. వైసీపీ, టీడీపీలు…. బీజేపీకి ఊడికం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీని బతికించటం కాదు.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వద్దామన్నారు. రాహుల్ గాందీ మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతామని చెప్పారు.
భారత్ న్యాయ్ యాత్రలో భాగంగా అసోంలో పర్యటించిన పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ స్పాన్సర్డ్ గూండాలు దాడి చేశారని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అసోంలో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ బతద్రువ సత్ర ఆలయానికి వెళ్లాలని భావించారని.. అయితే అధికారులు అడ్డుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి పత్రికా ప్రకటనను విడుదల చేశారు. భారత్ న్యాయ్ యాత్రలో భాగంగా అస్సాంలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీపై స్థానిక బీజేపీ స్పాన్సర్డ్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాహుల్ యాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం, గుడి సందర్శనకు అనుమతి ఇవ్వకపోవడం శోచనీయం అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ధోరణి మంచిది కాదని… రాహుల్ భద్రత విషయంలో అసోం రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో ఆయన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్న కుట్రలు ఫలించవని గుర్తుంచుకోవాలన్నారు. మరింత మనోధైర్యంతో రాహుల్ ముందుకు సాగుతారన్నారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు అండగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ దేశ ప్రజల మద్ధతు ఆయనకు ఎప్పుడూ ఉందన్నారు. తెలంగాణ సమాజం కూడా రాహుల్ గాంధీకి అండగా ఉందని.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలకు అండగా నిలవాలని, పేదలకు న్యాయం జరగాలన్న లక్ష్యంతో రాహుల్ గాంధీ తలపెట్టిన యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లా, పుంగనూరు సోమల (మం)లో అయోధ్య శ్రీరామ మందిరంలో శ్రీ బాల రాముని కి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సోమల మండలం లో భక్తులు శోభ యాత్ర నిర్వహించారు. పుంగనూరు బిజెపి ఇంచార్జి మదన్ మోహన్ మాట్లాడుతూ జైశ్రీరామ్ హిందూ బంధువులందరికి ఈ రోజు దీపావళి పండుగ రోజు అని అన్నారు. 450 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న హిందూ బంధువులందరికీ అయోధ్యలో బాల రాముని ప్రతిష్ట శ్రీ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నిర్వహించడము పై యావత్ భారతదేశం గర్వించదగ్గ విషయం అని అన్నారు. ప్రతి ఒక్క హిందువు దేవాలయంలో గాని తన ఇంట్లో ఉన్న పూజ గదిలో గాని అక్షింతలు హోమాలు చేసి శ్రీ.సీతా రాముల కృప పాత్రకు కావాలని కోరారు. సోమల లోని శ్రీరాముని గుడిలో శ్రీ సీతా రాముల కువేద పండితులు చే పూజలు నిర్వహించారు. సోమల బస్ స్టాండ్ నుండి శ్రీ రాముల గుడి దగ్గర నుండి భక్తులు ర్యాలీలో బయలుదేరి జైశ్రీరామ్ అంటూ రామా రామా రఘుపతి రామా అంటూ భక్త పరవశంలో మునిగితేలిన నినాదాలు చేసుకొని వెళ్లిన భక్తులు. అంతే కాకుండా అన్నదానం మరియు రామకోటి ,రాత్రి కి శ్రీ సీతారాముల పల్లకి లో గ్రామోత్సవం నిర్వహిస్తామని తెలిపారు.
తిరుమల శ్రీవారిని తెలంగాణ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వెలుపల కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ….పార్లమెంట్ ఎన్నికలకు కేసీఆర్ నాయకత్వంలో ఒంటరిగానే బిఆర్ఎస్ బరిలో దిగుతుందన్నారు. ప్రజలు ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఇచ్చారు. ప్రజా తీర్పుకు శిరసా వహిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ హక్కుల గురించి, నది జలాల్లో రావాల్సిన వాటాపై పోరాడేది కేవలం బిఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రశ్నించే గొంతుకను మాత్రమే పార్లమెట్ కు పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోలేదన్నారు. కృష్ణానది జల వాటాపై పోరాడే పార్టీ కేవలం బిఆర్ఎస్ పార్టీ మాత్రమేనని తెలిపారు. ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం పెత్తనంపై బిఆర్ఎస్ వ్యతిరేకిస్తుందన్నారు. ఆపరేషన్ మ్యానువల్ ప్రకారమే నీటి విడుదల ఉంటుందని తెలిపిన ఆయన…. నాగార్జున సాగర్., శ్రీశైలం ప్రాజెక్ట్ లను కేంద్రం తమ ఆధీనంలోకి తీసుకోవడం వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలు వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. కేఆర్ఎంబీ ఆధీనంలోకి ప్రాజెక్టులు వెళ్లకుండా బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.
అయోధ్య శ్రీరామచంద్రుడి పాదాల చెంత సిరిసిల్ల నుండి బంగారు చీరను ఉంచనున్నారు. సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తన చేతులతో స్వయంగా తయారు చేసిన బంగారు చీరెను ఈనెల 26న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అందించనున్నారు. ప్రధాని చేతుల మీదుగా రాముడి పాదాల చెంత చీరెను ఉంచనున్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు సాయంత్రం సిరిసిల్లలోని హరిప్రసాద్ నివాసానికి వెళ్లారు. హరి ప్రసాద్ స్వయాన తయారు చేసిన బంగారు చీరెను పరిశీలించారు. శ్రీరాముడి చిత్రంతో పాటు రామాయణ ఇతివ్రుత్తాన్ని తెలియజేసే చిత్రాలను సైతం ఆ చీరెలో పొందుపర్చడం విశేషం. 8 గ్రాాముల బంగారం, 20 గ్రాముల వెండితో తయారు చేసిన చీర అందరినీ అబ్బురపరిచేలా ఉంది. అద్బుతంగా చీరెను తయారు చేసిన హరిప్రసాద్ ను ఈ సందర్భంగా బండి సంజయ్ అభినందించారు. శాలువాతో సత్కరించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ స్వయాన తన చేతులతో తయారు చేసిన బంగారు చీరె చాలా బాగుందన్నారు. ఈనెల 26న ప్రధానికి చీరెను అందించనున్నారని, ప్రధాని చేతుల మీదుగా శ్రీరాముడి పాదాల చెంతను ఉంచేందుకు సిద్ధమవడం సంతోషంగా ఉందన్నారు. గతంలో అగ్గిపెట్టెలా చీరెను ఉంచిన చరిత్ర సిరిసిల్ల జిల్లాదన్నారు. ఇంతిటి గొప్ప నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేనేత కార్మికులను ఆదుకునేందుకు తనవంతు కృషి చేస్తానని హమీ ఇచ్చారు.
బిజెపికి వ్యతిరేకంగా ఉండే నాయకులపై ఎప్పుడూ కత్తులు వేలాడుతూనే ఉంటాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. చంద్రబాబు కేసులో ముమ్మాటికి రాజకీయ జోక్యం ఉందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పై ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A వర్తిస్తుందా, వర్తించదా అనే అంశంపై తీర్పు రావాల్సి ఉన్నా సుప్రీం కోర్టులోనే త్రిసభ్య న్యాయమూర్తులలో భిన్నభిప్రాయాలు వెలువడ్డాయని తెలిపారు. బిజెపికి ఎవరైనా అనుకూలంగా ఉన్నారో, వారిపై కేసులు ఉండవన్నారు. బిజెపికి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులపైనే కేసులు ఉంటాయన్నారు. ఈ తరహాలోనే ఈ కేసులో కూడా 17ఏ వర్తించదా, వర్తిస్తుందా అనే అంశం వేలాడుతూనే ఉంటుంది తప్ప.. ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదన్నారు. ఇందులో న్యాయవ్యవస్థ కూడా ఒక రకమైన గేమ్ ను ఆడుతోందని ఆరోపించారు. ఇది ఒక రాజకీయ బెదిరింపు, ఒత్తిడి తప్ప మరొకటి లేదని నారాయణ అభిప్రాయపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ కి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పార్టీ రాజీనామా చేశారు. పార్టీలో కొత్త వారిని అంటరానివారిగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రమశిక్షణకు మారు పేరు అంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే చోద్యం చూస్తున్నారు. పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పని చేసిన గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ రాజకీయాల్లో ఉంటేనే పార్టీలో మనుగడ ఉంటుందని ప్రజాబలం లేని వారికి పెద్దపీట వేసి వారి కింద పనిచేయాలని చెప్తున్నారు. ఎన్నికల తర్వాత ఎవరు ఓటమికి, అసంతృప్తి పై ఎవరు బాధ్యత తీసుకోలేదని అవేదనతో పార్టీకి రాజీనామా అంటూ కిషన్ రెడ్డికి లేఖ రాసారు.