సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడా వెంకటరెడ్డి మాట్లాడారు. బీజేపీ హటావో దేశ్ కి బచావో నినాదంతో ఇండియా కూటమిలో భాగస్వామ్యమయి ఉన్నామని తెలిపారు. బీజేపీ అక్షింతల పేరిట రాముడిని రాజకీయం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి అన్నారు. శ్రీరాముడు మంచివాడు కాదని ఎవరు కూడా అనరని, కానీ రాముని పేరుతో రాజకీయం చేయడం ఏమాత్రం సరికాదన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ అహంకారమే బీఆర్ఎస్ ను ఓడించిందన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో స్వీకరించిన దరఖాస్తులను, త్వరితగతిన పరిశీలించి ప్రజలకు లబ్ధి చేకూరేలా చూడాలన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై న్యాయ విచారణ చేపట్టడం మంచి పరిణామమని పేర్కొన్నారు.
Bjp
ప్రకాశం మార్కాపురం వెలుగొండ ప్రాజెక్ట్ ను త్వరితగతిన పూర్తి చేయాలని, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని, నల్గొండ ప్రాజెక్ట్ కాలువలకు బీజేపీ నాయకులు కీర్తిశేషులు రాములు పేరు పెట్టాలంటూ, బీజేపీ రాష్ట్ర నాయకులు శిరసనగండ్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్థానిక గడియార స్తంభం నుండి ర్యాలీగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ కన్వీనర్ చిన్నయ్య, ఎర్రగొండపాలెం మాజీ కన్వీనర్ ప్రసాద్, బీజేపీ సీనియర్ నాయకురాలు శాసనాల సరోజినీ, న్యాయవాది, కడియం రామయ్య, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలన్ని అస్త్రశ్రస్తాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కదన రంగంలోకి దూకబోతున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిసింది. మొట్టమొదటి బహిరంగ సభను బిహార్‌లో నిర్వహించబోతున్నారు. బిహార్‌లోని చంపారన్ జిల్లా బేటియా సిటీలో భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారని బీజేపీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. అదేవిధంగా బిహార్‌లో పలు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారని తెలిపాయి. బిహార్‌లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అన్ని స్థానాలను గెలుచుకొనేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బిహార్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. జనవరి, ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో బేటియా, బెగూసరాయ్, ఔరంగాబాద్ సభల్లో మోదీ ప్రసంగించనున్నారు. బిహార్‌లో గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 39 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క స్థానం లభించింది.
ఏలూరు జిల్లాలో రాష్ట్ర మోర్చా సంయుక్త సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. రెండు, మూడు నెలల్లో ఎన్నికలకు వెళ్ళబోతున్నామన్నారు. ఇప్పటికే వికసిత భారత్ కార్యక్రమంతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళామన్నారు. బీజేపీ ఏమీ చేయలేదన్న అపవాదు తొలగించేందుకే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కేంద్రం చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు మోర్చాల సంయుక్త సమావేశం జరిగిందన్నారు. ప్రతి వర్గానికి న్యాయం చేస్తున్న పార్టీ బీజేపీ అన్నారు. ప్రస్తుతం తమ పొత్తు జనసేనతో కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో ఇతర పార్టీలతో పొత్తులను అధిష్ఠానం నిర్ణయిస్తుందని పురందేశ్వరి తేల్చి చెప్పారు.
Read Also..
ఏలూరు లో రాష్ట్ర మోర్చా సంయుక్త సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. రెండు మూడు నెలల్లో ఎన్నికలకు వెళ్ళబోతున్నమని ఇప్పటికే వికసిత భారత్ కార్యక్రమం ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళామని ఆవిడ అన్నారు. భాజపా ఏమీ చేయలేదన్న అపవాదు తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నమని కేంద్రం చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు మోర్చాల సంయుక్త సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి వర్గానికి భాజపా పార్టీ న్యాయం చేస్తుందన్నారు. ప్రస్తుతం మా పొత్తు జనసేనతో కొనసాగుతోందని రాష్ట్రంలో ఇతర పార్టీలతో పొత్తులను అధిష్ఠానం నిర్ణయిస్తుందని అన్నారు.
బెల్లంపల్లిలో మొత్తం 34 వార్డులు ఉండగా..ప్రస్తుతం కాంగ్రెస్ కు 11 మంది కౌన్సిలర్లు మద్దతు ఇస్తున్నారు. ప్రస్తుత చైర్ పర్సన్ శ్వేత తో కలిపి ఈ సంఖ్య 12 కు చేరింది. భారాసకు 21 మంది కౌన్సిలర్లు ఉండగా, భాజపాకు ఒక కౌన్సిలర్ ఉన్నారు. ఈ క్రమంలో భారాస కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ నెల 12న అవిశ్వాసానికి సంబంధించిన సమావేశం నిర్వహించడానికి కౌన్సిలర్లకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, భారాస తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. భారాసకు చెందిన కౌన్సిలర్లు బస్సులో ప్రత్యేక శిబిరానికి తరలివెళ్లారు. ఈ బస్సులో సుమారు 20 మంది భారాస కౌన్సిలర్లు శిబిరానికి వెళ్లారు.
కరీంనగర్- హసన్‌పర్తి రైల్వే లైన్‌కు సంబంధించి సర్వే పనులు పూర్తయ్యాయని, అతి త్వరలోనే రైల్వే లేన్ నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయని బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. నగరంలోని ఆర్టీసీ వర్క్ షాప్ ఎదురుగా వున్న పద్మశాలి భవన్ లో ఆ సంఘం అఫీషియల్స్, ప్రొఫెషనల్స్, యూత్ అసోసియేషన్స్ వేర్వేరుగా రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్లను బండి సంజయ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ గత ఎంపీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చానన్నారు. ప్రజల కోరిక మేరకు కరీంనగర్ .. హసన్ పర్తి కొత్త రైల్వే లేన్ కు సంబంధించి సర్వే పనులు కూడా పూర్తయ్యాయని, అతి త్వరలోనే రైల్వే పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు. కొంతమంది ఏమీ చేయకపోయినా తామే తెచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని, వాటిని నమ్మి మోసపోవద్దని సూచించారు. ఒక వర్గం ఓట్ల కోసం పాకులాడితే 2014, 18, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలిచి వాడమన్నారు. కానీ తనకు ధర్మమే ముఖ్యమని, హిందూ ధర్మ రక్షణ కోసం ఎంతవరకైనా వెళతానే తప్ప ఓట్ల కోసం పాకులాడబోనని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో కుల వృత్తులకు, కుల సంఘాల అభ్యున్నతికి పైసలిచ్చేందుకు వెనుకాడే రాష్ట్ర ప్రభుత్వం ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న, మత మార్పిడులను ప్రోత్సహిస్తున్న తబ్లిగ్ జమాతే వంటి సంస్థలు నిర్వహించే సభలు, సమావేశాలకు రూ.3 కోట్ల నిధులు కేటాయించడం సిగ్గు చేటన్నారు. ఇకనైనా హిందూ సమాజం సంఘటితం కావాల్సిన అవసరం ఉందని, రాబోయే రోజుల్లో జరగబోయే అనర్ధాన్ని అర్ధం చేసుకోవాలని కోరారు. దేశం సురక్షితంగా ఉండాలంటే, ప్రజలకు ఉపయోగపడే అనేక చట్టాలు కార్యరూపం దాల్చాలంటే బీజేపీ గెలుపు అనివార్యమని అన్నారు. భారత పౌరులంతా దేశంలో ఎక్కడికైనా వెళ్ళి స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుని నివసించే అవకాశం ఉంటుందని, వివాహాలు చేసుకునే అవకాశం ఉందని చెప్పిన బండి సంజయ్ కాశ్మీర్ లో మాత్రం ఆ అవకాశం లేకుండా కాంగ్రెస్ పాలకులు చేశారన్నారు. భారతీయులందరికీ ఒకే చట్టం ఉండాలన్నదే మోదీ అభిమతమన్నారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ప్రభావం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని ఎంపీ ఎన్నికల్లో బీజేపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేయడంతోపాటు గ్రామ, మండల స్థాయిలో వచ్చే ఫలితాల ఆధారంగా కార్యకర్తలు, నాయకులకు స్థానిక సంస్థల్లో బీజేపీ టిక్కెట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ లోని శుభ మంగళ గార్డెన్స్ లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీజేపీ మండలాధ్యక్షులు, ఇంఛార్జీల సమావేశానికి బండి సంజయ్‌తో పాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి, కార్యదర్శి బొమ్మ జయశ్రీ, అధికార ప్రతినిధి సీహెచ్.విఠల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు జి.క్రిష్ణారెడ్డి, ప్రతాప రామక్రిష్ణ, ఇంఛార్జీలు మీసాల చంద్రయ్య, మోహన్ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ పార్లమెంట్ ఎన్నికల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి ఇంత క్యాడర్ లేదు. అయినా దాదాపు 90 వేల ఓట్ల మెజారిటీతో బీజేపీని గెలిపించారు. ఈసారి క్యాడర్ పెరిగింది. రెట్టింపు మెజారిటీతో పార్టీ అభ్యర్ధిని గెలిపించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఎన్నికల్లో మండలాధ్యక్షులు, ఇంఛార్జీలు సమన్వయంతో పనిచేయాలి. ఎన్నికల ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుంది. ఎన్నికల్లో కష్టపడి పనిచేసే వాళ్లకు, మెరుగైన ఫలితాలు తెచ్చిన వాళ్లకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు ఇస్తాం. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా పోటీ చేసే అవకాశం కల్పిస్తాం. ఎంపీ సీటు గెలిపిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా సీట్లు గెలిచే బాధ్యత నేను తీసుకుంటా. పార్టీలో ఉంటూ ఒకరిద్దరు నాయకులు పార్టీకి నష్టం చేస్తున్నారనే విషయం నా ద్రుష్టికి వచ్చింది. అట్లా చేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్లే. అట్లాంటి వాళ్లను ఉపేక్షించే ప్రసక్తే లేదు. కొందరు నేతలు కావాలనే విష ప్రచారం చేస్తున్నారు. వారి సంగతి అధిష్టానం చూసుకుంటుంది. మీరంతా కలిసి కట్టుగా బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయండి. గల్లీలో, ఢిల్లీలో అధికారంలో లేని బీఆర్ఎస్ కు ఓట్లేస్తే డ్రైనేజీలో వేసినట్లే. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను కూకటి వేళ్లతో పెకిలించి వేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
డాక్టర్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ….
కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు పనిచేయాలి. బండి సంజయ్ ఈసారి గెలిస్తే కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలున్నాయి. గ్రామాల్లోనూ బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరో కూడా తేల్చుకోలేని పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ కు అభ్యర్ధి ఉన్నా ఆ పార్టీకి ఓటేయడం దండుగ అనే భావనలో ప్రజలున్నారు. పోరాటాలతో రాష్ట్రంలో ప్రభంజనం స్రుస్టించి కేసీఆర్ సర్కార్ ను గద్దె దించడంలో బండి సంజయ్ చేసిన క్రుషి అమోఘం. ఈ నేపథ్యంలో బండి సంజయ్ గెలుపు అనివార్యమనే భావనలో కార్యకర్తలతోపాటు సామాన్యులు కూడా ఉన్నారు. మీరు చేయాల్సిందల్లా ఇంటింటికీ వెళ్లి బీజేపీకి ఓటేయాలని కోరండి.
సీహెచ్.విఠల్ మాట్లాడుతూ….
బండి సంజయ్ ను ఈసారి కూడా ఓడించేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయి. గత ఎన్నికల్లో కేసీఆర్ వందలు కోట్లు ఖర్చు పెట్టాడు. ప్రజల కోసం, పార్టీ కోసం నిరంతరం పనిచేసే సంజయ్ ను గెలిపించుకోవాల్సిన చారిత్రాత్మక అవసరం మనందరిపైనా ఉంది. సంజయ్ గెలిస్తే కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలున్నాయి. కరీంనగర్ ప్రజలకు, కార్యకర్తలకు మేలు జరిగే అవకాశాలున్నాయనే విషయాన్ని మర్చిపోవద్దు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలలో భాగంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి నాలుగు సంవత్సరాలు గడుస్తున్న విడుదల చేయకపోవడం దారుణమని రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ చదిపిరాళ్ళ రాజేష్ రెడ్డి అన్నారు. జమ్మలమడుగు లోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యవస్థలను నిర్వీర్యం చేశాడని కడప ఉక్కు పేరుతో, గండికోటలో ఫైవ్ స్టార్ హోటల్ పేరుతో భూములను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. గాలివాటంగా వచ్చిన జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గాలి మాటలు మానుకోవాలని హితవు పలికారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏమీ చేయకపోగా తన సొంత జిల్లా కడపకు కూడా ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు. జగన్ పోతేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ఈ సందర్భంగా రాజేష్ తెలిపారు. వచ్చే ఎన్నికలలో మీరు ఏ పార్టీలో ఉంటారని విలేకరులు ప్రశ్నించగా… ఇప్పుడు ఏ పార్టీ తరపున ప్రెస్ మీట్ నిర్వహించామో అదే పార్టీ నుంచి పోటీ చేస్తామని తెలిపారు. జమ్మలమడుగు బరిలో వైయస్ కుటుంబ సభ్యులు ఉండాలని తాము కోరుకుంటున్నామని ఆ ఎన్నికలలో వారిని ఓడించి తీరుతామని ఈ సందర్భంగా రాజేష్ రెడ్డి మీడియాకు తెలిపారు.
Read Also..
లోకసభ ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఎదుర్కొనేందుకు బీజేపీ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, నల్లగొండ జిల్లా కేంద్రంలోని బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 10 లోకసభ స్థానాలు, 30 శాతం ఓట్లే బిజెపి లక్ష్యం అని ఆయన అన్నారు. తెలంగాణ లో బీఆర్ఎస్ కనుమరుగయ్యే పార్టీ అని, కాంగ్రెస్ అమలు చేయలేని హామీలను ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టే ప్రయత్నం చేస్తుందని ఆయన విమర్శించారు, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే తెలిపోయిందని డాక్టర్ లక్ష్మణ్ ఎద్దేవ చేశారు, అప్పులు లేకుండా సుభిక్ష పాలన అందించాలంటే అది కేవలం బిజేపి పార్టీకి డబుల్ ఇంజన్ సర్కారుకు మాత్రమే సాధ్యమని ఆయన గుర్తుచేశారు, కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను గ్రామ, గ్రామాన విస్తృతంగా ప్రచారం చేయాలని కార్యకర్తలకు డాక్టర్ లక్ష్మణ్ సూచించారు.