తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. తెలంగాణలో టీడీపీ అధికారానికి దూరమై 20 ఏళ్లు గడిచినా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గకపోగా, రోజురోజుకూ పెరుగుతోందని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లు అని చంద్రబాబు మరోసారి ఉద్ఘాటించారు. నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు తొలిసారి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు విచ్చేశారు. ఏపీ సీఎం చంద్రబాబును టీడీపీ తెలంగాణ నేతలు ఘనంగా సన్మానించారు. అనంతరం టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీని యుగపురుషుడు ఎన్టీఆర్ ఇదే గడ్డపై, ఇక్కడే ఎమ్మెల్యే కాలనీలో ప్రారంభించారని గుర్తుచేశారు. తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పేందుకు టీడీపీ పుట్టుకొచ్చిందని, ప్రపంచంలో తెలుగు జాతి ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని చంద్రబాబు తెలిపారు. రెండు ప్రాంతాల ప్రయోజనాల కోసం ఆలోచించి పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం అని చెప్పారు. తెలుగుజాతి ఐకమత్యంతో ఉండాలని కోరుకుంటా, కలిసిమెలిసి ఉండాలనే నా చివరి రక్తపుబొట్టు వరకు ఆలోచిస్తానని చంద్రబాబు తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పవన్‌కల్యాణ్‌ను పరామర్శించిన ఏపీ గవర్నర్ నజీర్.ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పరామర్శించారు. ఇటీవల ముంబైలో పవన్ కుడి భుజానికి శస్త్ర చికిత్స చేసుకుని… తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. శస్త్ర చికిత్స అనంతరం పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి… గవర్నర్…
- నీట్ పేపర్ లీక్‌పై పోరాడుతున్న సోనమ్ వాంగ్‌చుక్.సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన వైద్య చర్యలన్నీ తీసుకోవాలని ప్రభుత్వానికి…
- పాకిస్తాన్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బన్ను జిల్లాలో ఉన్న మిర్యాన్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ పరిసరాలు ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందగా..డజన్ల సంఖ్యలో భద్రతా సిబ్బంది…
- విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.విశాఖపట్నంలో సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో పెను ప్రమాదం తప్పింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తాపడగా… ఏడుగురు మత్స్యకారులు మృత్యువు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, బోటు, వల పూర్తిగా…
- రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా.రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు.మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కేటీఆర్.. ప్రస్తుతం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 212396