విశాఖ మిధిలాపురీ కాలనీలో యదేచ్చగా అక్రమ కట్టడాల నిర్మాణాలు జరుగుతున్నాయి. రెవెన్యూ లేఔట్ లో అర్దరాత్రి అక్రమ గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. పరదాల చాటున భారీ అక్రమ నిర్మాణం జరుపుతున్నారు. gvmc అధికారులు అక్రమ నిర్మాణానికి కొమ్ముకాస్తున్నారు. gvmc జోన్ 2 లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ గ్రావెల్ తవ్వకాలు సాగిస్తున్నారు.. ఇంత జరుగుతున్న టౌన్ ప్లానింగ్ విభాగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది. అక్రమ గ్రావెల్ తవ్వకాలతో సమీప భవనాలు కూలిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా చోద్యం చూస్తున్న ACP శాస్త్రి కాసులకు కక్కుర్తిపడి అడ్డగోలుగా తవ్వకాలకు సహకరిస్తున్నాడు. ఈ తతంగంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Breaking News
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గుంతకల్ రోడ్డులో గురువారం తెల్లవారుజామున వరుసగా ఆరు దుకాణాలలో గుర్తుతెలియని దుండగులు చోరీ చేయగా మరో మూడు దుకాణాలలో చోరీకి యత్నించారు. ఈ సందర్భంగా దుకాణాల యజమానులు మాట్లాడుతూ గత నెల 6 షాపుల్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడి రూ.10 వేలు నగదును ఎత్తుకెళ్లారన్నారు. అయితే మరోసారి సుమారు 6 దుకాణాలలో దుండగులు చోరీ చేసి రూ. 15,000 నగదును ఎత్తుకెళ్లినట్లు షాప్ యజమానులు వెల్లడించారు. అయితే ఇప్పటికైనా పోలీసులు రాత్రి సమయాలలో గస్తీ తిరిగి చోరీల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని షాపు యజమానులు సంబంధిత పోలీసు అధికారులకు విన్నవించారు.సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మీదకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత మజీ సీఎం, ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ తొలిసారి ప్రజలను కలిశారు. చింతమడక గ్రామానికి చెందిన ప్రజలు ఆయనను కలిసేందుకు ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి వారికి అభివాదం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైన తర్వాత ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన అక్కడి నుంచి బయటకు రాలేదు. బయట కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆయన ఫామ్ హౌస్ లోనే సమావేశమయ్యారు. మరోవైపు, ఆయన స్వగ్రామమైన చింతమడక గ్రామస్తులు కేసీఆర్ ను కలిసేందుకు ఫామ్ హౌస్ కు వెళ్లారు. దాదాపు 540 మంది గ్రామస్తులు 9 బస్సులు, 10 కార్లలో ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. అయితే, వీరిని పోలీసులు చెక్ పోస్ట్ వద్దే ఆపేశారు. అనుమతి ఉంటేనే లోపలకు అనుమతిస్తామని వారికి స్పష్టం చేశారు. దాదాపు 2 గంటల సేపు వేచి ఉన్న తర్వాత వారికి ఫామ్ హౌస్ లోకి వెళ్లేందుకు అనుమతి వచ్చింది. అనంతరం కేసీఆర్ తో చింతమడక గ్రామస్తులు మాట్లాడి వెనుదిరిగారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన విద్యుత్ ను పునరుద్ధరించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏపీలో తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్ప్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా తుపాను ఎఫెక్ట్, పునరావాస చర్యలు, నష్టం అంచనాలు తదితర అంశాలపై సీఎం జగన్ చర్చించారు. ప్రతి రైతునూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సబ్సిడీపై విత్తనాల సరఫరాకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు.
చెట్టుకూలి చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ.30 లక్షల సహాయాన్ని అందిస్తామన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందిని హామీ ఇచ్చారు. పంట పొలాల్లో ఉన్న వరదనీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు.
ఎంపిపి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో లక్కిరెడ్డిపల్లెలో ఘనంగా జరిగిన అయ్యప్ప స్వామి అంబులం పూజలో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి. అయ్యప్ప మాలధారణం నియమాల తోరణమని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి ఎంపిపి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో లక్కిరెడ్డిపల్లెలో ని వారి స్వగృహంలో ఘనంగా జరిగిన అయ్యప్ప స్వామి అంబలం పూజలో శ్రీకాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు గావించారు. అంబులం పూజ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 18 మెట్ల మండపం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అయ్యప్ప మాలధారణ స్వాములు, గురుస్వాముల భక్తి పాటలతో ఈ ప్రాంతం పులకరించింది. పూజ అనంతరం సుదర్శన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున భిక్ష ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప దీక్ష ఆరోగ్య రక్ష అని అన్నారు.చిన్నా పెద్ద అని తేడా లేకుండా ప్రతి వ్యక్తిని దైవ స్వరూపంగా భావించడమే దీక్ష పరమార్థమన్నారు. ఆధ్యాత్మిక చింతన పెరగడమే కాకుండా దురలవాట్లకు దూరమై సంపూర్ణ ఆరోగ్యం క్రమశిక్షణతో కూడినజీవన విధానం , ధార్మిక భావాలు అలవడు తున్నాయన్నారు. కార్తీక మాసంచాలా విశిష్టమైనదని, నియోజకవర్గంలో కార్తీక మాస శోభ సంతరించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
మాజీ ఎంపిపి అంపాబత్తిన రెడ్డెయ్య,వైస్ ఎంపిపి సుబ్బరాయుడు, సర్పంచులు వెంకట నారాయణరెడ్డి , జనార్దన్ రెడ్డి, ఎంపిటిసి లు లక్ష్మీ నారాయణ,జగన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం, యర్రగొండపాలెంలో ఓ కేసు విషయమై మోజేశ్ అనే యువకున్ని పొలీస్ స్టేషన్ కి తరలించి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు. కౌన్సెలింగ్ ఇచ్చారనే అవమానంతో యర్రగొండపాలెం పోలీసు స్టేషన్ లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేసిన మోజేశ్ అనే యువకుడు. మంటలు అర్పిన పోలీసులు గాయపడ్డ యువకుడు మోజేశ్ ను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మార్కాపురంలోని ఓబుల్ రెడ్డి ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. ఆత్మహత్య యత్నం చేసుకున్న యువకుడి బంధువులు యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. రోడ్లపై టైర్లు కాల్చి ధర్నా చేస్తున్న యువకుడి బంధువులు, యర్రగొండపాలెం లో ఉద్రిక్త వాతావరణం….
పామర్రు (మ) శ్యామలపురం, కంచర్లవానిపురం గ్రామాల్లో పనల పై వున్నా వరి పనలను పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పరిశీలించారు. మొవ్వ (మ) అయ్యంకి గ్రామంలో జాయింట్ కలెక్టర్ అపరంజిత సింగ్ తో నీట మునిగిన వరి పొలాలను ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పరిశీలించారు. .పంట చేతికి వచ్చే టైం లో తుఫాన్ రావడం దురదృష్టం. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుంది. రైతులు నష్టపోకుండా ప్రతి ధాన్యం కొనుగోలుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. మిషన్తో కోసిన ధాన్యమంతా మిల్లులకు చేరిపోయింది. సబ్సిడీపై మినుము విత్తనాలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రతిపక్షాలు దీని రాజకీయం చేయవద్దని మీడియా ద్వారా కోరుతున్నాను. జాయింట్ కలెక్టర్ అపరంజిత సింగ్ మాట్లాడుతూ ప్రజలకు నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ధాన్యాన్ని కైకలూరు, గుంటూరు, పల్నాడు పంపించాం మేజర్, మైనర్ డ్రైన్స్ మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నాం. రైతులకు నష్టం జరగకూడదు అనేది ముఖ్యమంత్రి రెడ్డి ఆలోచన.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీవోకే పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్ సభలో కీలక ప్రకటన చేశారు. పీవోకే మనదే అన్నారు. భారత్లో అంతర్భాగమైన పీవోకేకు 24 అసెంబ్లీ సీట్లు రిజర్వ్ చేసినట్లు స్పష్టం చేశారు. రెండు నయా కాశ్మీర్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది. జమ్ముకశ్మీర్ రిజర్వేషన్- సవరణ బిల్లు 2023, జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ- సవరణ బిల్లు 2023లను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. కశ్మీర్లో హక్కులు కోల్పోయిన కశ్మీరీ పండిట్లకు ఈ బిల్లుల ద్వారా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కశ్మీర్లో గతంలో 46 సీట్లు ఉండగా ఆ సంఖ్యను 47కు పెంచామని, అలాగే జమ్ములో గతంలో 37 సీట్లు ఉండగా ఆ సంఖ్యను 43కు పెంచామని తెలిపారు. పీవోకే కూడా మనదేనని, అందుకే ఆ ప్రాంతానికి 24 సీట్లు రిజర్వ్ చేశామన్నారు. భారత తొలి ప్రధాని జనహర్ లాల్ నెహ్రూ చేసిన రెండు పొరపాట్ల కారణంగా జమ్ముకశ్మీర్ దశాబ్దాలుగా బాధపడుతోందని వ్యాఖ్యానించారు. ముందుగా కాల్పుల విరమణ ప్రకటించి, ఆ తర్వాత కశ్మీర్ సమస్యను ఐక్య రాజ్య సమితికి తీసుకెళ్లారని చెప్పారు. ఇది తన తప్పేనని నెహ్రూ చెప్పారని గుర్తు చేశారు. కానీ మన దేశం చాలా భూమిని కోల్పోవడం పెద్ద తప్పు అన్నారు. నెహ్రూపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. వారు లోక్ సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం జమ్ముకశ్మీర్ రిజర్వేషన్- సవరణ బిల్లు 2023, జమ్ము, కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2023 లోక్ సభలో ఆమోదం పొందాయి.






Total views : 197106