బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలని, సభకు రాని కేసీఆర్ కు ఇంకా ప్రతిపక్ష హోదా ఎందుకు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేడు ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తోందని మండిపడ్డారు. నష్టాల్లో కూరుకుపోయిన డిస్కంలను లాభాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్న తమను ప్రశంసించకపోగా తిరిగి నిందలు వేయడం సరికాదన్నారు.
విద్యుత్తు శాఖపై గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని రాజగోపాల్రెడ్డి విమర్శించారు. అన్నీ సక్రమంగా ఉంటే మరి విద్యుత్తు సంస్థలు నష్టాల్లోకి ఎందుకు వెళ్తాయని ప్రశ్నించారు. రైతులకు అరకొరగా ఉచిత విద్యుత్తు ఇచ్చి బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుందని, నిజానికి నాడు, నేడు ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నది ఒక్క కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఇప్పటికైనా తమపై నిందలు వేయడం మాని, చేసిన తప్పులు ఒప్పుకోవాలని హితవు పలికారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ రియాల్టీ షోలో తెలుగు లయన్స్, హిందీ హాక్స్, తమిళ్ టైగర్స్, మావెరిక్స్, కన్నడ పాంతర్స్…ఇలా ఐదు టీమ్స్ పాల్గొననున్నాయి. ఈ…
- చిలకా ప్రొడక్షన్స్ థ్రిల్లర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్గా మూవీ గ్రాండ్ రిలీజ్..నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన , ఆలోచింపజేసే కథలను చూపడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్ మరోసారి తనదైన శైలిలో ఈసారి కూడా…
- తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. SIR ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు అధికారులు,…
- విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్…
- తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్..తమిళనాట చారిత్రాత్మక విజయంతో రికార్డ్ సృష్టించిన సీఎం విజయ్..తనదైన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే తన క్రమశిక్షణ, సమయపాలన అధికారుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగిలా సచివాలయంలో విధులకు హాజరవుతుండటంపై హర్షం వ్యక్తం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 78909