బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలని, సభకు రాని కేసీఆర్ కు ఇంకా ప్రతిపక్ష హోదా ఎందుకు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేడు ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తోందని మండిపడ్డారు. నష్టాల్లో కూరుకుపోయిన డిస్కంలను లాభాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్న తమను ప్రశంసించకపోగా తిరిగి నిందలు వేయడం సరికాదన్నారు.
విద్యుత్తు శాఖపై గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. అన్నీ సక్రమంగా ఉంటే మరి విద్యుత్తు సంస్థలు నష్టాల్లోకి ఎందుకు వెళ్తాయని ప్రశ్నించారు. రైతులకు అరకొరగా ఉచిత విద్యుత్తు ఇచ్చి బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుందని, నిజానికి నాడు, నేడు ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నది ఒక్క కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఇప్పటికైనా తమపై నిందలు వేయడం మాని, చేసిన తప్పులు ఒప్పుకోవాలని హితవు పలికారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీలు.తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న విజయ్..ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలతో సహా అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి..తాజాగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక…
- ఇరాన్‌పై అమెరికా మళ్లీ క్షిపణి దాడులు.పశ్చిమాసియాలో కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రస్థాయికి చేరాయి. అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో నౌకలను అడ్డుకుంటున్న ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం పూర్తిగా ‘ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్…
- పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన.పశ్చిమాసియాలో తాజా ఉద్రిక్త పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాల మీదుగా వెళ్తున్న వాణిజ్య నౌకలపై దాడులు జరగడం, ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరగడం శాంతి, భద్రత, స్థిరత్వానికి ముప్పుగా మారుతాయని విదేశాంగ శాఖ పేర్కొంది. అన్ని…
- తిరుమలలో జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.తిరుమల శ్రీవారి దర్శనానికి రాబోయే మూడు నెలల్లో ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న భక్తులకు టీటీడీ ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. జులై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో పలు పర్వదినాలు, ప్రత్యేక ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఆయా తేదీలలో వీఐపీ…
- భారత దేశం మరో కొత్త రకం గుర్రం జాతి.భారత దేశం మరో కొత్త రకం గుర్రం జాతికి వేదిక కాబోతుంది. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఎనిమిది రకాల దేశీయ గుర్రాల జాతులను రిజిస్టర్డ్ జాతుల జాబితాలో గుర్తించింది. వీటికి అదనంగా తెల్లటి నుక్రా జాతి గుర్రం భారతదేశపు తొమ్మిదవ రిజిస్టర్డ్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 194366