Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Telangana తెలంగాణలో రెండో విడత రుణమాఫీ

తెలంగాణలో రెండో విడత రుణమాఫీ

by Satya
తెలంగాణలో రెండో విడత రుణమాఫీ

తెలంగాణలోని రైతులకు మరోసారి గుడ్ న్యూస్ అందించింది. నేడుతెలంగాణలో రెండో విడత రుణమాఫీ ప్రారంభించనుంది. లక్షన్నర రూపాయల వరకు రుణాల మాఫీని అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరుకానున్నారు. రెండో విడతలో సుమారు 7 లక్షల మంది రైతులకు దాదాపు రూ. 7వేల కోట్ల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం రెడీగా ఉంది. మూడు విడతల్లో రుణమాఫీ పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక చేసింది. ఈనెల 19న మొదటి విడత ప్రారంభించింది. మొదటి విడతలో సుమారు 10 లక్షల 83 వేల కుటుంబాలకు చెందిన వారి ఖాతాల్లో 6వేల కోట్లు జమ అయ్యాయి. ఆధార్ నెంబర్, ఇతర వివరాలు సరిగ్గా లేకపోవడం వంటి కారణాలతో సుమారు 17వేల మందికి రుణమాఫీ డబ్బులు జమ కాలేదు. మూడో విడతలో లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు రుణాలను ఆగస్టు 15వ తేదీలోగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక లోసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2లక్షల్లోపు పంటరుణాలన్నీ మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేవలం పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..
    క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ రియాల్టీ షోలో తెలుగు లయన్స్, హిందీ హాక్స్, తమిళ్ టైగర్స్, మావెరిక్స్, కన్నడ పాంతర్స్…ఇలా ఐదు టీమ్స్ పాల్గొననున్నాయి. ఈ…
  • చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..
    నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన , ఆలోచింపజేసే కథలను చూపడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్ మరోసారి తనదైన శైలిలో ఈసారి కూడా…
  • తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్
    తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి వెల్లడించారు. SIR ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జూన్‌ 25 నుంచి జులై 24 వరకు అధికారులు,…
  • విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!
    విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్…
  • తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..
    తమిళనాట చారిత్రాత్మక విజయంతో రికార్డ్‌ సృష్టించిన సీఎం విజయ్‌..తనదైన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే తన క్రమశిక్షణ, సమయపాలన అధికారుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగిలా సచివాలయంలో విధులకు హాజరవుతుండటంపై హర్షం వ్యక్తం…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014173
Total views : 79462

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.