తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల్లో కూలిపోతుందంటూ రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ మండిపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ – వైసీపీ కుట్రలు పన్నుతున్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాల్వ సుజాత ఆరోపించారు. రాజ్యసభలో ఆన్ రికార్డ్ గా ఎంపీ చేసిన వ్యాఖ్యలపై చైర్మన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీ వ్యాఖ్యలపై సీబీఐతో విచారణ చేయించాలని కోరారు. ఎంపీ విజయసాయి రెడ్డిపై ఈమేరకు జూబ్లీహిల్స్ పోలీసులకు సుజాత ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. Read Also..
Brs
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మూడు నెలల తర్వాత అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట్లను సమీక్షించారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రతినిధులతో సమీక్షించి కృష్ణా జలాల అంశంపై నేతలకు దిశా నిర్దేశం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు కీలక నేతలు సైతం తెలంగాణ భవన్‌కు వచ్చారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా పరిధిలోని ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీకి అప్పగించారని భారత్ రాష్ట్ర సమితి భారీ ఉద్యమానికి సిద్ధమవుతోంది. కేఆర్ఎంబీపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, తెలంగాణ ప్రయోజనాలపై ఆ పార్టీ చిత్తశుద్ధిని ప్రజల్లోకి తీసుకపోయే విధంగా ఉద్యమ కార్యాచరణపై చర్చించారు.
వరంగల్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత :
రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన మేరకు 6 నెలల్లో కులగణన చేపట్టడానికి తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఆగమాగం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. మంగళవారం నాడు వరంగల్ లో బీసీ హక్కుల సాధన కోసం భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ…. బిహార్ లో కులగణన చేసినా కోర్టుల్లో ఇబ్బందులు ఎదురయ్యాయని, కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తామని హామీ ఇచ్చి చేయలేదని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని, అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచినా ముందడుగు వేయలేదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే కొత్తగా దాదాపు 24 వేల మంది బీసీలు ఎంపీటీసీలు, సర్పంచ్ లు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు, జడ్పీటీసీలు అవుతాయని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని గుర్తు చేశారు. ఈ రీత్యా పరిపాలనలో బీసీ భాగస్వామ్యం ఉండాలంటే తక్షణమే జనగణన ప్రక్రియను ప్రారంభించాలని పునరుద్ఘాటించారు. అలాగే, బీసీల సంక్షేమ కోసం ప్రతి ఏటా రూ. 20 వేల కోట్లు బడ్జెట్ కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కాబట్టి ఈ 2024-25 బడ్జెట్ లో ప్రభుత్వం రూ. 20 వేల కోట్లు కేటాయించాలని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్ కి చట్టబద్ధత కల్పించాలని, ఎంబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనగామా జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా నామకరణం చేయాలని అన్నారు. అంతేకాకుండా, అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, దీనిపై ఏప్రిల్ 11 లోపు ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇచ్చుకునే సౌలభ్యం కల్పించాలని, తద్వారా జనాభా ఆధారంగా రాష్ట్రాల్లో రిజర్వేషన్లు చేసుకోవచ్చని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రతిపాదించారని గుర్తు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం రిజర్వేషన్లు చేసుకునే అవకాశాన్ని రాష్ట్రాలకు ఇవ్వడం లేదని తప్పుబట్టారు. నిరంతరం సుప్రీం తీర్పును చూపించి కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించడంలేదని చెప్పారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. 2018 నుంచి ఇప్పటి వరకు 4365 మంది సివిల్స్ కు ఎంపికైతే అందులో కేవలం 1195 మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నాయని లేవనెత్తారు. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఉన్నా కూడా కేవలం 15.5 శాతం మందిని మాత్రమే ఎంపిక చేశారని చెప్పారు. ఎస్సీలు 5 శాతం, ఎస్టీలు కేవలం 3 శాతం మాత్రమే ఎంపికయ్యారని వివరించారు. కోల్పోతున్న రిజర్వేషన్లపై ఎవరూ మాట్లాడడం లేదని, కాబట్టి బీసీ మేధావులు ఈ అంశంపై గళమెత్తాలని పిలుపునిచ్చారు.
హక్కుల కోసం పోరాటం చేయాలంటే… తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉద్యమాలకు పెట్టింది పేరైన వరంగల్ తెలంగాణ ఉద్యమంలో ముందువరసలో ఉందని గుర్తు చేశారు. భారత జాగృతిగా రూపాంతరం చెందిన తెలంగాణ జాగృతి అనేక సామాజిక అంశాలపై పోరాటాలు చేసిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతోకొట్లాడి బతుకమ్మకు రాష్ట్ర హోదా, నిరాహార దీక్ష చేసి అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం సాధించామని, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి దాదాపు 20 వేల మంది యువతకు ఉద్యగ కల్పనకు దారిచూపామని, దేశవ్యాప్తంగా మహిళా బిల్లుపై చర్చకు ప్రేరేపించామని వివరించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యే బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను కొమురం భీం ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ రావు, జిల్లా ఇంచార్జ్ శ్యాం నాయక్ తీవ్రంగా ఖండించారు. అనంతరం వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని చచ్చిపోయిన పార్టీని లేపే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను కొమురం భీం ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ రావు, జిల్లా ఇంచార్జ్ శ్యాం నాయక్ తీవ్రంగా ఖండించారు. బిఆర్ఎస్ పార్టీ పాలనలో నాయకులు చేసిన భూదందా, ఇసుక మాఫియా అవినీతి చిట్టా బయట పడుతున్న తరుణంలో సమస్యను పక్కదారి పట్టించే నేపథ్యంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేస్తున్నారని అన్నారు. 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగకపోగా పథకాల, ప్రచారాల పేరుతో హంగు ఆర్భాటలు తప్ప ఏమి చేయలేదని ప్రజలు గమనించి తిరస్కరించారని అన్నారు. కాలేశ్వరం, అన్నారం ప్రాజెక్టులు అవినీతి మయంగా మారి నేడు కొట్టుకపోయే పరిస్థితి నెలకొందని అవినీతి బయట పడుతున్న నేపథ్యంలో పార్టీ మనగడ కష్టమవుతుందని గ్రహించిన నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. మాజీ మంత్రి హరీశ్‌రావు చెబుతున్నవి పచ్చి అబద్ధాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 56 రోజుల్లో అప్పగింతకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన రాలేదని.. అంగీకారం, సంతకాలు జరగలేదని, అందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి మంత్రి విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించేది లేదని ముఖ్యమంత్రితోపాటు తాను స్పష్టంగా తెలియజేశానన్నారు. అయినా బీఆర్ఎస్ నాయకులు పదే పదే పాత ఆరోపణలు చేస్తున్నారని.. కుట్రలు వాళ్లు చేసి.. కాంగ్రెస్‌పై నిందలు మోపేందుకు యత్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నీళ్లలో సరైన వాటా కోసమైతే.. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అన్యాయం జరిగిందన్నారు. 2015లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణకు 551 టీఎంసీలు, ఏపీకి 260 టీఎంసీలు ఇవ్వాలని అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేయాల్సి ఉన్నా.. పట్టించుకోలేదు. అప్పటినుంచి 2019 వరకు ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల కోటాకు అంగీకరించి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు. Read Also..
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రేపు తెలంగాణ భవన్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహకాలపై నేతలతో ఆయన చర్చించనున్నారు. ఇక నల్గొండ జిల్లా కేంద్రంలో ఏదో ఒక నియోజక వర్గంలో మాజీ సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ జరగనుట్టు తెలుస్తోంది. అదీ ఈ నెల మూడో వారంలో కేసీఆర్ సభ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. 2 లక్షల మందితో ఫిబ్రవరి మూడో వారంలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కృష్ణా జలాలు, కేఆర్ఎంబీ పై వాస్తవాలు ప్రజలకు వివరించడమే టార్గెట్‌గా, కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర హక్కుల సాధనే లక్ష్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ భారీ సభ నిర్వహించనుంది. నల్లగొండ జిల్లా నుండే KRMB ఇష్యూ పై పోరాటానికి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోందని తెలిపారు. ఈ భారీ సభపై ఇప్పటికే పార్టీ శ్రేణులకు కేసిఆర్ దిశానిర్దేశం చేశారు.Read Also..
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్..ఈడీ సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 16న విచారిస్తామని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ల ధర్మాసనం తెలిపింది. గత విచారణలో కవిత పిటిషన్ ను నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో కలిపి విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. సోమవారం విచారణ మొదలుకాగా.. ఈ పిటిషన్ పై తుది విచారణ చేపట్టాలని కవిత తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది కపిల్ సిబల్ న్యాయస్థానాన్ని కోరారు. అయితే, గతంలో వేర్వేరు కేసుల్లో ఇచ్చిన ఉత్తర్వులతో పాటు రికార్డులను పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే విచారణను వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత విచారణకు రావడంలేదంటూ ఈడీ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. సమన్లు స్వీకరించడంలేదని చెప్పారు. దీనిపై కపిల్ సిబల్ కల్పించుకుంటూ.. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని అన్నారు. గత విచారణలో కవితకు సమన్లు జారీచేయబోమని కోర్టుకు ఈడీ తెలిపిందని గుర్తుచేశారు. అయితే, అది కేవలం ఒకసారికి మాత్రమేనని, ప్రతిసారీ కాదని ఈడీ న్యాయవాది బదులిచ్చారు. ఈ క్రమంలో అన్ని అంశాలను ఈ నెల 16న జరిగే విచారణలో వింటామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. Read Also..
ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని ఎమ్మెల్సీ కవిత హితవు పలికారు. జ్యోతిరావ్ ఫూలే భవన్లో స్వీకరిస్తున్న అర్జీల ప్రోగ్రామ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే ఒక్క రోజు పాల్గొన్నారని విమర్శించారు. ఇంద్రవెల్లిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి ప్రభుత్వ నిధులు ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని యూటర్న్ ముఖ్యమంత్రి అని పిలుచుకుంటున్నారని తెలిపారు. చెప్పిన ఏ ఒక్క మాట కూడా పాటించకపోవడం వల్లే ఇలా పిలుచుకుంటున్నారని దెప్పి పొడిచారు. కచ్చితంగా వందరోజులు ఓపిక పడుతామని, వందరోజులు పూర్తయ్యాక ఎట్టి పరిస్థితుల్లో వదిలపెట్టబోమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లోని అన్నీ లోపాలను, లొసుగులను తప్పకుండా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. కేసీఆర్‌కు ఉన్న అపారమైన రాజకీయ అనుభవంతో రేవంత్‌కు ఏమాత్రం పోలిక లేదని కవిత తెలిపారు. ప్రజాపాలన పేరుతో ప్రజల వద్దకే పాలన తీసుకురావాలని కెసిఆర్ కోరుకునే వారని… నేడు రేవంత్ రెడ్డి కూడా కెసిఆర్ చూపిన మార్గంలో నడుస్తుండటం సంతోషదాయకమని కవిత అన్నారు.
భద్రాద్రి సీతారామ స్వామిని దర్శించుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. దర్శనం అనంతరం బయటకు వచ్చిన హరీష్ రావుతో ఆటో డ్రైవర్లు తమ గోడు వెల్లబుచ్చుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో నడి రోడ్డున పడ్డామని బాధ పడ్డారు. తమను ఆదుకోవాలని, తమ పక్షాన పోరాటం చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావును కోరారు. దీంతో హరీష్ రావు స్పందించి ఎవరు ఆందోళన చెందవద్దని, న్యాయం జరిగేలా ప్రభుత్వాన్ని నిలదీస్తామని వారికి హామీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించి ప్రతి నెలా ఆర్థిక సహాయం అందేలా చేస్తామన్నారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు బాధాకరమన్నారు. బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం దిగివచ్చి న్యాయం చేసే దాకా పోరాటం చేస్తామన్నారు.
తాజాగా బీఆర్ఎస్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీ కు రాజీనామా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయన స్టేషన్ ఘన్ పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరో సారి కూడా ఆయన అక్కడి నుంచి టికెట్ ఆశించారు. కానీ బీఆర్ఎస్ రాజయ్యకు టికెట్ ఇవ్వలేదు. మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఆ స్థానాన్ని కట్టబెట్టింది. ఈ నిర్ణయంపై రాజయ్య మొదట్లో కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా.. తరువాత పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పని చేశారు. కడియం శ్రీహరిని గెలిపించేందుకు నియోజకవర్గం అంతా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ మొదటి హయంలో డిప్యూటీ సీఎంగా తాటికొండ రాజయ్య సేవలు అందించారు. అయితే కొంత కాలం తరువాత ఆయన పదవిని కోల్పోయారు. ఇది అప్పట్లో రాజకీయంగా చర్చనీయాశం అయ్యింది. కానీ ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండి, సేవలు అందించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాకపోవడం, ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసినప్పటికీ ఇప్పట్లో మరే పదవీ దక్కే అవకాశం లేకపోవడంతో ఆయన పార్టీని వీడేందుకు మొగ్గు చూపారు. వాస్తవానికి టికెట్ నిరాకరించినప్పటి నుంచే ఆయన బీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ దీప్ దాస్ మున్సి మరియు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలసి చర్చలు జరిపారని తెలుస్తోంది. దీంతో రాజయ్య బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.





Total views : 92778