ఓడినందుకు కుంగిపోవద్దని… వచ్చే పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిద్దామన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. సంగారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… 2004లో కాంగ్రెస్ మనతో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసిందని, తెలంగాణపై కేసీఆర్‌కి ఉన్న ప్రేమ ఇతరులకు ఉండదని వ్యాఖ్యానించారు. తెలంగాణాని అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టింది కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశమిచ్చారని, మనకంటే బాగా పని చేయాలని కోరుకుందామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రజలకిచ్చిన హామీల అమలు కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడే వారికి భవిష్యత్తు ఉంటుందని, ఆ అవకాశం మనకు ఉందన్నారు. కార్యకర్తలు ఎవరూ కూడా అధైర్యపడవద్దని, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని, అందరం కలసి పని చేద్దామన్నారు. ఓటమిపై సమీక్ష జరుపుకుందామని, తప్పొప్పులు సరిచేసుకొని ప్రజల పక్షాన నిలబడుదామన్నారు.
Brs
సర్జరీ అనంతరం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆసుపత్రిలోనే కోలుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన్ని పరామర్శించేందుకు ప్రముఖులు ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. అయితే ఇవాళ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేసీఆర్‌ను కలిసేందుకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, ఆయన అభిమానులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆయన్ని చూసేందుకు అనుమతించాలంటూ పోలీసులను కోరారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా అందుకు పోలీసులు కుదరదని చెప్పారు. దీంతో కేసీఆర్.. బీఆర్ఎస్.. కేటీఆర్ నినాదాలతో ఆసుపత్రి ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు చేతులెత్తిసిన క్రమంలో కేటీఆర్ రంగంలోకి దిగారు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన ఆయన క్యాడర్‌ను సముదాయించడంతో కాస్త శాంతించినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఆసుపత్రి బయట పరిస్థితులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టికి వెళ్లాయి. దీంతో బీఆర్ఎస్ కేడర్‌ను, అభిమానుల్ని ఉద్దేశించి ఆయన విజ్ఞప్తి చేశారు. తాను కోలుకుంటున్నానని.. త్వరలో మీ ముందుకు వస్తానని. దయచేసి ఎవరూ ఆస్పత్రికి రావొద్దంటూ ఓ వీడియోను విడుదల చేశారు. తనతో పాటు వందలాది మంది పేషెంట్లు ఇక్కడ ఉన్నారు. వాళ్లకు ఇబ్బంది కలిగించొద్దు. దయచేసి పార్టీ కార్యకర్తలు, తన అభిమానులు సహకరించాలని..తన పట్ల అభిమానం చూపుతున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ కేసీఆర్ విజ్ఞప్తి చేసినట్లు బీఆర్ఎస్ ఒక ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు కావొస్తుంది. రెండు పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసింది. ఈ పర్యాయం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయగా, సీనియర్ నాయకులు మంత్రి పదవులను అలంకరించారు. తనదైన శైలిలో రేవంత్ ముందుకు వెళుతున్నారు. అధికారం అనుభవించి ఒకేసారి కోల్పోయిన ప్రతిపక్షానికి మింగుడు పడడం లేదా..? ప్రభుత్వం ఏర్పడి వారం రోజులైనా కాలేదు. అప్పుడే ప్రతిపక్షాల నుంచి విమర్శలు మొదలయ్యాయి. బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు చేస్తున్నాయి. దీనిలో ఉన్న అంతర్గత మర్మమేంటో…? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడపగలదా..? బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటవుతున్నాయా …? ముందేమైనా ప్రమాదం ముంచుకొస్తుందా…? వీటన్నింటిని రేవంత్ సమర్థవంతంగా ఎదుర్కోగలరా….?
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు రోజుల క్రితం బాత్రూంలో కాలు జారి పడిపోయిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని, త్వరగా కోలుకోవడానికి అనుకూలంగా శరీరం సహకరిస్తోందని వైద్యులు తెలిపారు. మరో మూడు నాలుగు రోజుల్లో డిశ్చార్జ్ అవనున్నారు. కేసీఆర్ ప్రస్తుతం వాకర్ సాయంతో నడుస్తున్నారు. ఈ నేపద్యంలో నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. కేసీఆర్‌ను “మై రాక్ స్టార్” అంటూ వాకర్ సాయంతో నడుస్తున్న వీడియోను పోస్ట్ చేశారు.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి పరామర్శించారు. కేసీఆర్ ప్రస్తుతం సోమాజిగూడలోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. చినజీయర్ స్వామి ఆసుపత్రికి వెళ్ళి బీఆర్ఎస్ అధినేతను పరామర్శించారు. నిన్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో కేసీఆర్‌కు 20 మంది వైద్యుల బృందం సర్జరీ నిర్వహించింది. ఆ తర్వాత ఆయనను పలువురు నాయకులు ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ క్రమంలో చిన్నజీయర్ స్వామి మాజీ సీఎంను పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని చిన్నజీయర్ స్వామి ఆకాక్షించారు. ఆ తర్వాత అక్కడే ఉన్న కేసీఆర్ కుటుంబ సభ్యులతో చిన్నజీయర్ స్వామి కొంతసేపు మాట్లాడారు.
బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ ప్రమాదవశాత్తు ఆయన నివాసంలో కాలు జారి పడి తుంటి ఎముక విరగడంతో శస్త్ర చికిత్స చేయడం జరిగింది. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కేసీఆర్ పేరు మీద అర్చకులు అభిషేకం చేశారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ తో పాటు ఆలయ ధర్మకర్తలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గం, brs నుంచి ఎమ్మెల్యే గా సబితా ఇంద్రారెడ్డి 3వ సారి భారీ మెజార్టీతో గెలిచారు. మహేశ్వరం ప్రజలు భారాస నాయకులు, కార్యకర్తలు తో కలిసి స్థానిక శివ గంగ ఆలయం లో పూజలు చేసి.. స్థానిక పోతర్ల బాబయ్యా హల్ లో కార్యకర్తను, నాయకులతో, స్థానిక ప్రజలతో కలసి మాట్లాడి కృతజ్ఞతలు తెలిపారు. మహేశ్వరం ప్రజలు తమ పట్ల చూపిన అభిమానం, ఆదరణ, మరువ లేనిది, మీ రుణం తీర్చుకుంట అని ఎమోషనల్ గా మాట్లాడారు. కష్ట పడి పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. ఇది విజయోత్సవ సభ కాదు.. కృతజ్ఞత సభ.. బాధ్యత గా పని చేస్తా…ప్రజా సమస్యల గురించి అలుపు లేకుండా కృషి చేస్తా ప్రభుత్వం ఎది అయినా పని తీసుకోవడం లో ముందుంట ఇక మీదట మీలో ఉంటా మీతో కలిసి ఉంటా ప్రతి ఎలక్షన్ లో మిమ్మలి గెలిపించూకుంట… మి గెలుపు నా గెలుపు ప్రతి ఊరు తిరుగుతూ ప్రతి నాయకుడు, కార్యకర్త తో కలుస్తా.. మీ గెలుపుకు కృషి చేస్తా… అని తెలిపారు.
రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజున హైద్రాబాద్ లో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి mla గడ్డం వినోద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన బెల్లంపల్లి మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్వేత, భర్త శ్రీధర్ దంపతులు బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. బెల్లంపల్లి బీఆర్ఎస్ మున్సిపల్ ఛైర్ పర్సన్ జక్కుల శ్వేత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జిల్లాలో చర్చాంశనీయంగా మారింది. చైర్మన్ దంపతులకు పార్టీ కండువా కప్పి పార్టీ లో చేర్చుకున్నారు.
కేసీఅర్ ను కలవడానికి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి లోని వ్యవసాయ క్షేత్రానికి కేసీఅర్ సొంత గ్రామమైన చింతమడక గ్రామస్తులు తొమ్మిది బస్సులలో సుమారు 540 మంది గ్రామస్తులు కేసీఅర్ ఫార్మ్ హౌస్ కు చేరుకున్నారు. కేసీఅర్ ను కలవడానికి వచ్చిన గ్రామస్తులను ఫార్మ్ హౌస్ పోలిస్ సిబ్బంది ఫార్మ్ హౌస్ చెక్ పోస్ట్ వద్ద ఆపేశారు. పర్మిషన్ లేనిది లోనికి అనుమతి లేదని ఫార్మ్ హౌస్ లోపల నుండి మాకు సమాచారం ఇస్తే లోపలకు పంపిస్తామని పోలీసులు గ్రామస్తులకు చెప్పడం తో పర్మిషన్ కోసం గ్రామస్తులు మూడు గంటలు వెయిట్ చేశారు. ఆ తర్వాత కేసీఅర్ ను కలసి వెళ్లిపోయారు
బండి సంజయ్ అధ్యక్షుడుగా ఉంటే మా పార్టీ అధికారంలోకి వచ్చేదని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. ప్రజలు మార్పు కోరుకున్నారని బిఆర్ఎస్ మాకొద్దు అని డిసైడ్ చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడంతో తెలంగాణ ఐదేళ్లు వెనక్కి వెళ్లిపోయిందని తెలిపారు. మరో ముప్పై ఏళ్లు దేశంలో బీజేపీ పాలనే ఉంటుందని దీనికి నిదర్శనం మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయమే అని ధీమా వ్యక్తం చేశారు. నేను నా కొడుకు మిథున్ రెడ్డి ఎల్లప్పుడూ ప్రజాసేవలోనే ఉంటామని స్పష్టం చేశారు.