జయశంకర్ భూపాలపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణరెడ్డికి నిరసన సెగ తగిలింది. కారల్ మార్క్స్ కాలనీకి ప్రచారానికి వచ్చిన గండ్రను సింగరేణి కార్మికుడు నిలదీశాడు. చత్తీస్ గఢ్ లో వలే ఇక్కడ కూడా సింగరేణి కార్మికులకు ఇన్కమ్ టాక్స్ రద్దు, అధిక గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించడం లేదంటూ నిలదీశాడు, వెంటనే స్పందించిన గండ్ర వెంకట రమణారెడ్డి .ఈ సమస్యలు కేంద్ర పరిధిలో ఉంటాయని ఆ కార్మికుడికి నచ్చజెప్పారు. రేగొండ మండలం తిరుమలగిరి లోనూ దళిత బంధు లో అక్రమాలు జరిగాయంటూ బీఆర్ఎస్ అభ్యర్థిని నిలదీశారు. గడ్డిగానిపల్లి గిద్దేముత్తరం తండాలో పర్యటించినపుడు కూడా గండ్ర వెంకటరమణారెడ్డికి నిరసన తెగ తగిలింది.
Brs
కాంగ్రెస్, బీజేపీ లు గాలి కబుర్లు చెప్తూ ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారు – దానం నాగేందర్
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని పార్టీల అభ్యర్ధులు ఇంటింట ప్రచారాన్నితీవ్రం చేశారు. ప్రచారంలో అధికార బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి దానం నాగేందర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతీ కాలనీలోనూ బస్తిలోనూ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. కాంగ్రెస్, బిజెపిలు గాలి కబుర్లు చెప్తూ తప్పుదారి పట్టిస్తున్నాయంటున్న దానం నాగేందర్.
ములుగు జిల్లా
ప్రముఖ పర్యటక కేంద్రమైన రామప్ప గెస్ట్ హౌస్ లో కర్ణాటక కు చెందిన మాజీ కాంగ్రెస్ మంత్రి విడిది. కర్ణాటక నుండి భారీగా డబ్బు సంచులు తీసుకొనివచ్చి కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క కోసం పంచడానికి నిలువ ఉంచారని తప్పుడు సమాచారం. రామప్ప గెస్ట్ హౌస్ లో వద్ద భారీగా చేరుకొన్న బిఆర్ఎస్ నాయకులు మీడియా ప్రతినిధులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్యాడ్ అధికారులు, పోలీసులు. గెస్ట్ హౌస్ లో తెల్లవారుజామున మూడు గంటల నుండి సోదాలు. ఎన్నికలకు సంబంధించిన డబ్బులు ఇతర వస్తువులు దొరకకపోవడంతో ఫేక్ న్యూస్ అంటూ వెనకకు తిరిగిన అధికారులు.
కేసీఆర్‌కు మళ్లీ అవకాశం ఇస్తే ఎప్పటిలాగే ప్రగతి భవన్, ఫామ్ హౌస్‌కే పరిమితమవుతారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీఆర్ఎస్కు వేసినట్లే అన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి వృథా చేసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులకు కూడా మాట్లాడే అవకాశం లేదన్నారు. దళిత ముఖ్యమంత్రి, రేషన్ కార్డులు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం అని చెప్పిన ముఖ్యమంత్రి ఏ హామీలనూ నెరవేర్చలేదని మండిపడ్డారు.
Read Also..
Read Also..
మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం ఇస్రంపల్లి, పుట్టపల్లి, రాజోలి గ్రామాలలో కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ 9 సంవత్సరాలు ఎమ్మెల్యే గా ఉన్న ఆల వెంకటేశ్వర్ రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ, అక్రమంగా ఇసుక మట్టిని దోచుకోవడం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి దేవరకద్ర గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంటు వస్తుందని, సంక్షేమ పథకాలు ఆగిపోతాయాని బిఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కావున ప్రజలు ఎవరు అలాంటివి నమ్మవద్దని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలతో పాటు 1 తులం బంగారం ఇస్తామని, 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తామని, రైతులకు 2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగులకు సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు, పేదవారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే సిలిండర్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేస్తుందని తెలియజేశారు. బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఓటమి భయం పట్టుకున్నది. కావున డబ్బుల తో ఓట్లు కొనాలని బిఆర్ఎస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని, బిఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసిన చేసిన దేవరకద్ర నియోజకవర్గంలో 30 వెల మెజార్టీతో గెలవబోతున్నానని మధుసూదన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇస్రంపల్లి, పుట్టపల్లి, రాజోలి గ్రామాలకు బిఆర్ఎస్ చెందిన కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Read Also..
నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి ప్రచారం జోరందుకుంది. తెలకపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి షాప్ షాపు తిరుగుతూ కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. మరి జనార్దన్ రెడ్డి వెంట బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిందని అందుకే ప్రజల తరఫునుంచి కారు గుర్తుకే ఓటేస్తామని తనను మూడోసారి గెలిపిస్తామని ప్రజలు మద్దతు తెలుపుతున్నట్లు మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. బ్యాలెట్ లో మూడో నెంబర్ గుర్తుపై నొక్కి తనను గెలిపించాలని బ్యాలెట్ నమూనాను ఓటర్లకు చూపిస్తూ మర్రి జనార్దన్ రెడ్డి ప్రచారం కొనసాగించారు. తన ప్రచారంలో ప్రజలు ఇస్తున్న మద్దతుకు మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బిఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ మేనిఫెస్టో పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. బీసీ ముఖ్యమంత్రి హామీ పట్ల తెలంగాణ ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తుందన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ యువత, మహిళలు ప్రధాని మోదీకి అండగా నిలబడుతున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కుటుంబాల నుంచి వచ్చినవారు కూడా బీజేపీకి జైకొడుతున్నట్లు చెప్పారు. ఒక మాట చెబితే దానికి కట్టుబడి ఉండేది బీజేపీ మాత్రమేననే అభిప్రాయం అందరిలోనూ ఉందన్నారు. కాంగ్రెస్,బీజేపీ మాటలు కొటలు దాటుతాయని, కానీ చేసే పని మాత్రం ప్రగతి భవన్, గాంధీ భవన్ కూడా దాటవని ఎద్దేవా చేశారు. ఏడు దశాబ్దాలుగా కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని, కానీ ప్రజలకు విషాదమే మిగిల్చిందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి దాదాపు పదేళ్లవుతోందని, కానీ ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు.
దేవరకొండ నియోజకవర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సుమారు గత తొమ్మిది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న రవీంద్ర కుమార్ నాయక్ ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని నియోజకవర్గ ప్రజలు ఈ ఎన్నికల సందర్భంగా చెబుతున్నారు. తమ గ్రామాల్లో రోడ్లు సరిగ్గా లేవని, ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు సరిగ్గా లేవని, మురికి కాలువలు మరియు మంచి నీటి సౌకర్యాలు కూడా సరిగా లేవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.
కొన్ని కొన్ని మండలాల్లో ప్రచారానికి వెళ్ళిన బీఆరెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్ర కుమార్ ను ప్రజలు అడ్డుకున్న సందర్భాలు కూడా చోటుచేసుకుంటున్నాయి.
Read Also..
ప్రజా సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించి నేను మీకు ఉన్నాను అని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని బిఆర్ఎస్ ప్రభుత్వం కోరుకుంటుందని మంత్రి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్నాయన్నారు. 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి తొమ్మిదిన్నర సంవత్సరాల లో జరిగింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలని, మళ్లీ BRS ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి గా కేసీఆర్ బాధ్యతలు చేపడతారని మంత్రి అన్నారు.
బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఘాటైన ప్రేమ బంధం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ ఆరోపించారు. తొమ్మిదిన్నరేళ్లు కేంద్రంలో బీజేపీ, తెలంగాణ బీఆర్ఎస్ అధికారంలోకి ఉన్నాయన్నారు. ఇన్నాళ్లు ఏం చేయలేదని ఆరోపించారు. ఇప్పుడు కొత్త మేనిఫెస్టోలు విడుదల చేస్తూ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ బీజేపీ కొత్తగా బీసీ సీఎం నినాదాన్ని ఎత్తుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. అసలు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీ వ్యక్తి బండి సంజయ్‌ను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. లిక్కర్ కేసులో ఇరుక్కున్న కవితపై బండి సంజయ్ తీవ్రంగా విమర్శలు చేసినందుకే జీర్ణించుకోలేకనే తొలగించారని అన్నారు. దేశంలో అబద్దాలు చెప్పే వ్యక్తుల్లో ప్రధాని మోడీ నెంబర్ వన్, కేసీఆర్ నెంబర్ టూ అని ఎద్దేవా చేశారు. గతంలో సీఎం కేసీఆర్ తన కొడుకును సీఎం చేస్తానని ఎక్కడా చెప్పలేదని మరి ఇప్పుడు పలు ఇంటర్వ్యూలలో ఆ విషయం చెప్పానని ప్రకటనలు చేస్తూ సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ యువతను దగా చేశారని నారాయణ మండిపడ్డారు. కాంపిటీటివ్ ఎగ్జామ్ పెట్టడంలో, టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహించడంలో, పేపర్ లీకేజీలు, కోర్టు కేసుల పేరిట ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బండారు సురేందర్ రెడ్డి.. బజార్లో ఉల్లిగడ్డలు అమ్మినట్టు ఆ పార్టీ టికెట్లు నమ్ముతున్నారని విమర్శించారు. కొత్తగూడెం టికెట్‌ను జలగం వెంకట్రావుకు 10 లక్షల రూపాయలకు అమ్ముకున్నారని సంచలన ఆరోపణలు చేశారు.