బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మంత్రి ధనసరి సీతక్క ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కవిత అనవసరంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మహిళలను కాంగ్రెస్ నుంచి దూరం చేయాలని కవిత ప్రయత్నిస్తున్నారని, జీవో నెం 3కి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ జీవో ఇచ్చింది కేసీఆరేనన్న విషయాన్ని కవిత గుర్తించాలని హితవు పలికారు. ఇకనైనా బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం ఆపి, ప్రజల కోసం ఆలోచించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సీఎం అవ్వాలని కవిత భావించారని సీతక్క ఆరోపించారు. కానీ బీఆర్ఎస్ ఓడిపోవడంతో కవిత ఆశలు అడియాసలయ్యాయని ఎద్దేవా చేశారు. మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తోందని అన్నారు.
Brs
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నుంచి నేతల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మహబూబాబాద్, ఆదిలాబాద్ మాజీ ఎంపీలు సీతారాం నాయక్, గోడం నగేశ్, హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో వీరు నలుగురు బీజేపీలో చేరారు. బీజేపీ కండువాలను కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ నాయకులు లక్ష్మణ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. కాగా ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరారు. దీంతో లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి.
బిఎస్పి, బీఆర్ఎస్ పొత్తు ఏర్పడిన తర్వాత మొదటిసారి నాగర్ కర్నూల్ కి విచ్చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రివర్యులు నాగం జనార్దన్ రెడ్డి గారి నివాసానికి చేరుకున్నారు. అక్కడ నాగం జనార్దన్ రెడ్డి గారి కుమారుడు నాగం శశిధర్ రెడ్డిని కలిసి బిఆర్ఎస్ కార్యకర్తలతో ముచ్చటించారు. అలాగే మాజీ మంత్రి బిఆర్ఎస్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి గారితో కూడా ఫోన్లో మాట్లాడారు. ఆయన కూడా ఈ పొత్తును స్వాగతించాడని పూర్తిస్థాయిలో పార్లమెంటు స్థానానికి నిలబడే వ్యక్తికి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారని అన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర పాలన సరైన దిశలో తీసుకు వెళ్లడానికి బిఎస్పి జాతీయ అధ్యక్షులు మాయావతి గారు, మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ గారు ఈ పొత్తు ఏర్పాటు చేశారని ఇది చాలా శుభసూచికమని ఆయన అన్నారు. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు ఇంకా జరగలేదని మరో రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానానికి తానే శుభవార్త చెప్తానని అన్నారు.
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి కి నిరసనగా కొల్లాపూర్ ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నాలతో ఆర్డీవో కు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎన్నికల హామీలలో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఎల్ ఆర్ ఎస్ ని పూర్తిగా పైసా ఖర్చు లేకుండా రద్దు చేస్తామని బూటకపు వాగ్దానంతో ప్రజలను మభ్య పెట్టి ఈ రోజు అధికారంలో రాగానే సామాన్య ప్రజలను నడ్డి విరిచే విధంగా ఎల్ ఆర్ ఎస్ పైన సుమారు 20 వేల కోట్ల రూపాయల వసూలు చేసే విధంగా ఉండడానికి తప్పు పట్టి ఈనాడు ప్రజల పక్షాన ప్రజల తరఫునుండి బిఆర్ఎస్ పార్టీ పోరాటానికి సిద్ధమైందని గతంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం 25 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఎల్ ఆర్ ఎస్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇచ్చిన హామీ ని నెరవేర్చాలని కొల్లాపూర్ ఆర్డీవో కార్యాలయంలో ఆర్డిఓ వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
నిరసన చేపట్టిన బీఆర్ఎస్(BRS):
ఎల్ఆర్ఎస్(LRS) విషయంలో కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్త ధర్నాలకు బీఆర్ఎస్ పార్టీ(BRS party) పిలుపునిచ్చింది. ఆ మేరకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలకు దిగాయి. అదేవిధంగా హెచ్ఎండీఏ(HMDA), జీహెచ్ఎంసీ(GHMC) కార్యాలయాల ముందు కూడా బీఆర్ఎస్ నిరసన(BRS protest) చేపట్టింది. ఎల్ఆర్ఎస్(LRS) పేరిట ఫీజుల వసూలును నిలిపివేయాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలకు రేపు వినతిపత్రాలు సమర్పించనున్నారు.
ఇది చదవండి: కాంగ్రెస్ పార్టీ లోకి వాళ్లొద్దు..!
అమీర్‌పేట(Ameerpet)లోని మైత్రివనం దగ్గర సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS పార్టీ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్(Sai Kiran Yadav) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సనత్ నగర్, సికింద్రాబాద్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలకు చెందిన MLA లు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మాధవరం కృష్ణారావు, KP వివేకానంద్‌తోపాటు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరవద్దని అలా వస్తే తాము ఒప్పుకోమని కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలంలో బిఆర్ఎస్ పార్టీ నుండి కొంత మంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. చేరిక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు బిఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దు అంటూ గొడవకు దిగారు . ఒక కార్యకర్త పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటాను అంటూ… పెట్రోల్ డబ్బాలో హల్చల్ చేశాడు. అంతేకాదు పార్టీ చేరికలకు ఏర్పాటుచేసిన కుర్చీలను విరగ్గొట్టారు. ఈ హఠాత్పరిణామానికి నాయకులు కంగు తిన్నారు. పార్టీని బలోపేతం చేస్తుంటే ఇలా అడ్డుకోవడం ఏమిటని కంగారు పడుతున్నారు. మండలంలోని ఇనుముల్ నర్వతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన నాయకులను పార్టీలోకి తీసుకోవద్దని ప్రస్తుతం గొడవ జరుగింది.. సంఘటన స్థలంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తదితరులు ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు.
BRS: 12న కరీంనగర్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ
భారత రాష్ట్ర సమితి లోక్‌సభ ఎన్నికలకు శంఖారావాన్ని పూరించింది. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 12న కరీంనగర్(Karimnagar)లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ డిగ్రీ కళాశాల మైదానంలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ భవన్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో బీఆర్ఎస్ అధినేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఎన్నికల కోసం భాగంగా రోడ్‌షోలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో ఆయన స్వయంగా పాల్గొనున్నట్లు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 12న కరీంనగర్లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. మండల స్థాయిలోనూ పార్టీ సమావేశాలు పెట్టాలని నేతలకు సూచించారు. బస్సు యాత్రలు చేద్దామని నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
పోలీసుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం..
వరంగల్(Warangal) జిల్లా పరకాల ఘటనలో గాయపడిన కార్యకర్తలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. పోలీసుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జై తెలంగాణ అని నినాదం చేస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టడమే కాకుండా పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారన్నారు.
ఇది చదవండి: ఉదారత చాటిన మహంకాళి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్….
కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. స్వయంగా వరంగల్(Warangal) ఎస్పీ అంబర్ కిషోర్ ఝాతో ఆయన ఫోన్లో మాట్లాడారు. న్యాయస్థానాలు, మానవహక్కుల సంఘాలను ఆశ్రయిస్తామని స్పష్టీకరించారు. గులాబీ సైనికులు ఆందోళన చెందవద్దని వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
లాస్య కారును ఢీకొన్న టిప్పర్‌ను పోలీసులు తాజాగా గుర్తించారు. పోలీసులు సదరు టిప్పర్ లారీని సీజ్ చేశారు. యాక్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత టిప్పర్‌ను కర్ణాటకలో పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో టిప్పర్ డ్రైవర్ కీలక విషయాలు వెల్లడించారు. అతి వేగంతో వచ్చిన ఎమ్మెల్యే కారు టిప్పర్ ను ఢీకొట్టడంతోనే యాక్సిడెంట్ జరిగిందని డ్రైవర్ తెలిపారు. మొదట కారు టిప్పర్ ను ఢీకొన్న తర్వాత వేగంగా వెళ్లి రెయిలింగ్ ను ఢీకొట్టిందని డ్రైవర్ వెల్లడించారు. లాస్య ప్రయాణిస్తున్న కారు వేగంగా టిప్పర్ ను ఢీకొనడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు. ఈ రోజు సాయంత్రం రంగారెడ్డి జిల్లా పోలీసులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కీలక విషయాలు వెల్లడించే చాన్స్ ఉంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: నేడు బీఆర్ఎస్ ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమం
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
పి.వి నర్సింహారావు లాంటి గొప్ప వ్యక్తికి కేంద్రంలో ఉన్న బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీ భారత రత్న ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని ఎంపి బండి సంజయ్ అన్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని మాజీ ప్రధాని, భారత రత్నపి.వి నర్సింహారావు నివాసానికి వెళ్లిన బండి సంజయ్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పి.వి వల్లే కాంగ్రెస్ పార్టీకి ఇంకా మనుగడ ఉందని, కానీ పి.వి కి అంత్యక్రియలు కూడా జరపకుండా అవమానించడానికి కారణం ఇప్పటి వరకు తెలియడం లేదన్నారు. ఇప్పటి వరకు కూడా పి వి విషయంలో దుర్మార్గపు ఆలోచనలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. ఒక్క పి.వి విషయంలో మాత్రమే కాదు, డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ తీరు అంతేనన్నారు. మొన్నటి దాకా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ది కూడా అదే ధోరణి అని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా మహనీయులను, వాళ్ళ పేర్లను వాడుకొని రాజకీయం చేయడం తప్ప.. వాళ్ళను గుర్తించి చేసింది ఏమి లేదని విమర్శించారు.



Total views : 92539