తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు నిలిచారు. కాంగ్రెస్ తరపున రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్… బీఆర్ఎస్ తరపున వద్దిరాజు రవిచంద్ర ఎన్నికల బరిలోకి దిగారు. వద్దరాజు రవిచంద్ర తన నామినేషన్ దాఖలు చేశారు. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఫామ్ లను అందజేశారు. వీరు తమ నామినేషన్లను సమర్పించనున్నారు. మరోవైపు ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబూరావులు నామినేషన్ వేశారు. తగినంత బలం లేకపోవడంతో రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. దీంతో ముగ్గురు వైసీపీ నేతలు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు.
Brs
కమలం పువ్వు గుర్తు (BJP)కు ఓటేస్తే రాముడికి వేసినట్లేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. హిందువుల 5 వందల ఏళ్ల చిరకాల వాంఛను నెరవేర్చిన నరేంద్రమోదీని మళ్లీ ప్రధానిని చేయాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట కేంద్రంలో నిర్వహించిన ప్రజాహిత యాత్రలో ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు.
కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ బ్రుందం అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి నివేదిక రూపొందించి చర్యలు తీసుకోవాలని కోరినా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు పట్టించుకోవడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని వ్రుధా చేసిన కేసీఆర్ సహా బాధ్యులను ఎందుకు అరెస్ట్ చేయలేదని, వారి ఆస్తులను ఎందుకు జప్తు చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై కేంద్ర, రాష్ట్ర ఇంజనీరింగ్ నిపుణుల బ్రందం నివేదిక ఇచ్చిందని, విజిలెన్స్ సైతం రిపోర్ట్ ఇచ్చిన తరువాత మళ్లీ అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా బీజేపీ గెలుపు ఖాయమని తేలడంతో ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కాళేశ్వరం, క్రిష్ణా నీటి పంపకాల పేరుతో పరస్పరం దూషించుకుంటూ డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపిస్తామని మాట ఎందుకు తప్పుతున్నారో ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
హిందువుల 5 వందల సంవత్సరాల చిరకాల వాంఛ అయోధ్యలో రామ మందిర నిర్మాణమని, ఆ కలను నెరవేర్చిన నరేంద్రమోదీ మళ్లీ ప్రధానిని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయోధ్యలోనే రామ మందిరం ఎందుకు కట్టారని వితండ వాదం చేస్తున్న నేతలంతా చరిత్ర తెలుసుకోవాలన్నారు. ఇంకా మాట్లాడితే ప్రజల కోరిక మేరకు దేశంలో అనేక ఆలయాలను నిర్మిస్తామని అన్నారు.
తెలంగాణలో ప్రజల పక్షాన బీజేపీ కొట్లాడితే కాంగ్రెస్ కు అధికారం ఇవ్వడం న్యాయమా? అని ప్రజలను ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల కోడ్ పేరుతో కాంగ్రెస్ నేతలు తప్పించుకునే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.
టిక్కెట్ కోసం కన్నకొడుకు పేరునే మార్చేసిన ఘనుడు కేసీఆర్ అని విమర్శించారు. కేటీఆర్ అసలు పేరు కల్వకుంట్ల అజయ్ రావు అని ఎన్టీఆర్ పేరు పెట్టుకుని టిక్కెట్ తెచ్చుకున్న మోసగాడు కేసీఆర్ అని దుయ్యబట్టారు. Read Also..
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నల్గొండ జిల్లా మర్రిగూడ సమీపంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. కాగా కేసీఆర్ ఈ సభకు హెలికాప్టర్ లో రానున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత మాజీ సీఎం పాల్గొంటున్న తొలి బహిరంగ సభ ఇది. నదీ జలాలపై రగడ జరుగుతున్న వేళ కేసీఆర్ ఏం మాట్లాడతారన్నది ఆసక్తిగా మారింది.
మరిన్నితాజావార్తలకోసంఇక్కడ క్లిక్ చేయండి.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఆ పార్టీకి చెందిన జగిత్యాల కౌన్సిలర్లు హైదరాబాద్ లో భేటీ అయ్యారు. వైస్ చైర్మన్ పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ నేతృత్వంలో కౌన్సిలర్లు ఎమ్మెల్సీ కవితతో కీలక మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ…. పార్టీ అందరికీ అవకాశాలు ఇచ్చిందని, భవిష్యత్తులోనూ సమానావకాశాలు కల్పిస్తుందని తెలిపారు. రానున్న కాలంలో పార్టీ మరింత బలోపేతం కానుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరని స్పష్టం చేశారు. అధికార పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలపై గట్టిగా పోరాటం చేయవలసిన ఈ తరుణంలో అందరూ కలిసికట్టుగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాబట్టి అవిశ్వాస తీర్మానంపై పునరాలోచన చేయాలని సూచించారు. దాంతో ఎమ్మెల్సీ కవిత సూచనల మేరకు అవిశ్వాస తీర్మానంపై వెనక్కి తగ్గాలని కౌన్సిలర్లు అక్కడికక్కడే నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నాడు అవిశ్వాస తీర్మానంపై జరగబోయే ఓటింగ్ లో పాల్గొనబోమని కౌన్సిలర్లు ప్రకటించారు.
మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ రాష్ట్రం ప్రయోజనాలను కాపాడటంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కృష్ణానది ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. అంతకుముందు కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలు పేరుతో నోట్ విడుదల చేసింది. అనంతరం సభలో తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తెలంగాణ రైతులకు కొన్ని అపోహలు కొందరు కల్పించారు. అందరి అనుమానాలు నివృత్తి చేసేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలనుకుంటున్నామని అన్నారు. గత ప్రభుత్వం నిర్వాకంవల్ల కృష్ణా నీటి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నీటి పంపకాల్లో అన్యాయం జరిగిందనే యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని ఉత్తమ్ అన్నారు. కానీ, గత పదేళ్లలో ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువ అన్యాయం చేశారని బీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు. Go 203 ద్వారా ఏపీ రాయలసీమ ప్రాజెక్టు చేపట్టారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం సైలెంట్ గా ఉందన్నారు. రాయలసీమ ప్రాజెక్టు వల్ల శ్రీశైలం పై ఆధారపడిన తెలంగాణ ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నర్దాకనంగా మారాయని ఉత్తమ్ అన్నారు. 2014 తర్వాత 1200 టీఎంసీల నీరు బయట బేసిన్ లకు తరలించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక నీటి తరలింపు పెరిగిందన్నారు.
మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పలువురు కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే కొందరు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నేతలు ముఖ్యమంత్రితో సమావేశం కాగా, తాజాగా ఆ జాబితాలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన ఆయన, సీఎం రేవంత్ రెడ్డికి శాలువా కప్పి సన్మానించారు. బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో త్వరలో చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్న రామ్మోహన్, ఇదే విషయమై రేవంత్‌ను కలిసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరికొంత మంది జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఒకట్రెండురోజుల్లో సీఎం కలిసే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు భావిస్తున్నాయి. Read Also..
తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే ఆరు గ్యారంటీలను ప్రకటించామని అసెంబ్లీలో మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దుర్భరంగా మార్చేశారని మండిపడ్డారు. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన నష్టాలకు సంబంధించి తమ ప్రభుత్వం మొదట్లోనే శ్వేతపత్రం విడుదల చేసి వాస్తవాలను ప్రజల ముందు పెట్టిందని భట్టి గుర్తుచేశారు. అయితే, ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి ఇవేవీ తమకు అడ్డుకాదని, ఎంత కష్టపడడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలను అమలు చేసి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవదూరంగా ఉందని బీఆర్ఎస్ పై భట్టి విక్రమార్క మండిపడ్డారు. దళిత బంధు పథకానికి బడ్జెట్ లో 17 వేల 700 కోట్లు కేటాయించిన గత ప్రభుత్వం.. వాస్తవంలో ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని భట్టి ఆరోపించారు.
ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు నెలకు 10 వేలు ఇవ్వాలన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కారణంగా… 6.5 లక్షల మంది ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. మరణించిన ఆటో కార్మికుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం అందించాలని కోరారు. ప్లకార్డులను పట్టుకుని అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నల్ల కండువాలు వేసుకుని వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది సభలోకి అనుమతించలేదు. అయితే, కాసేపు వాగ్వాదం తర్వాత వారిని అనుమతించారు. Read Also..
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి ప్రవేశపెట్టారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రవేశపెట్టారు. గతంలో ప్రగతి భవన్ లోకి ప్రజలకు అవకాశం లేదని కంచెలు ఏర్పాటు చేసుకుని పదేళ్ల పాటు పరిపాలించారని వేముల వీరేశం విమర్శించారు. ప్రజల విశ్వాసాలు, ఆకాంక్షలతో ఏర్పడిన ప్రభుత్వం తమదన్నారు. పదేళ్ల దోపిడీ ఒక్కొక్కటిగా బయటకు వస్తోందన్నారు. ఆర్నేళ్లలో ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారు. ఇవేం బిల్డింగ్లు కాదని బీఆర్ఎస్ పార్టీపై వీరేశం సెటైర్లు వేశారు.
కందుకూరు మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని నీళ్ళు, నిధులు, నియామకాలలో, అన్యాయం జరుగుతుందని తెలంగాణా సాధించుకున్నాం, సాధించిన తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో గత పది సంవ్సరాలు రాష్ట్ర హక్కులకు బంగం కలిగించకుండా పాలన చేసిన విధానాన్ని గుర్తుంచుకోవాలని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం నీళ్ళు, నిధులు, పోరాట ప్రటిమాతోని కేసీఆర్ పది సంవత్సరాల పరిపాలనా అందించారు. కేంద్ర ప్రభుత్వాన్ని వరి కొనమని ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఢిల్లీ లో ధర్నా చేశారు. రైతుల వరి ఎందుకు కొనరని కేసిఆర్ చేసిన పోరాటాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్రాన్ని బాగు చేస్తున్న సందర్భంలో కృష్ణా, గోదావరి, రెండూ నదులకు సంబంధించిన నీటి లభ్యతలో ఎక్కడ రాజీ పడకుండా మా రాష్ట్రానికి రావాల్సిన నీళ్ళ వాట ముఖ్యంగా కృష్ణానది జలాలు పది సంత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూ, ఎక్కడ కూడా రాజీ పడకుండా, వాలు ఎంత వత్తిడి చేసినా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కేసీఆర్ చేశారు. కృష్ణా లో నీళ్ళు రావలనాపుడు తెలంగాణా విడిపోయినప్పుడు మా రాష్ట్ర నికీ కావాల్సిన నీళ్ళ ను కేసీఆర్ ఆ రొజు నుండి ఈ రొజు వరుకు ఏపెక్స్ కమిటీ వేసి కమిటీ అధ్వర్యంలో నీటిని అలాట్ చేయమని అడుగుతున్నారు. కృష్ణా రివర్ బోర్డ్ అప్పగించలన కూడా ఒప్పుకోకుండా, సుప్రీం కోర్టులో కేసు వేయడం జరిగింది . దాదాపు ఐదు జిల్లాలకు సంబందించిన సమస్య, ఈ జిల్లాలకు సంబందించిన ప్రజలకు ఇబ్బాంది జరగకుండా ఉండడానికి. సుప్రీం కోర్టు వరుకు వెళ్లడం జరిగింది అన్ని అన్నారు. కేంద్ర మంత్రి అధ్వర్యంలో కోర్టు లో విత్ డ్రా చేసుకోవడం జరిగింది. రెండూ రాష్ట్రల వాళ్ళు బోర్డ్ కు అప్పచేపుతే తెలంగాణా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని, కేసీఆర్ పది సంత్సరాల నుండి కె అర్ ఎంబి అప్పచెప్పకుండ పోరాటం చేస్తున్నా విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రెండు మీటింగ్ లోనే కె అర్ఎంబి కి అప్ప చెప్పారు. దాని వలన కృష్ణానది హక్కులను కోల్పోవడం కాకుండా ప్రతి ఒక్కటీ బోర్డ్ పరిధిలోకి వస్తుంది అని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 92600