రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా బీజేపీ ప్రవర్తిస్తోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు చేపట్టిన మూసీ నిద్ర కార్యక్రమంపై భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. కేవలం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ ప్రక్షాళనను అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మూసీ పరివాహక ప్రాంతంలో నిద్రించి, వారితో భోజనం చేసి, మూసీ ప్రాంత ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకోవాలన్నారు. హైదరాబాద్ నడిబొడ్డు నుండి ప్రవహిస్తున్న మూసీ నది ప్రక్షాళన అవసరం ఉందన్నారు. మూసీ ప్రక్షాళనపై అనవసర రాద్దాంతం చేయకుండా రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని ఆయన కోరారు. ప్రజల సంక్షేమం.. రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని కోరారు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- నీట్ నిరసన సెగ హైదరాబాద్ కు తగిలింది.నీట్ నిరసన సెగ హైదరాబాద్ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు నిరసనలతో హొరెత్తాయి. లోక్‌సభ ప్రతి పక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అరెస్ట్ తో పాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా…
- జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.జనరిక్ ఔషధాల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 1 నుంచి జనరిక్ ఔషధాలపై సుంకాలు ఉండబోవని ప్రకటించారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని జనరిక్ ఔషధాలకు సున్నా శాతం సుంకం వర్తిస్తుందని..రెండేళ్ల పాటు ఇది…
- సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్.ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ ఛానళ్ల ఛైర్మన్ సి.వి.రావును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సీవీఆర్ న్యూస్ కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేష్… తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరారు. చైర్మన్…
- రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న NSUI నాయకులు, విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని మరియు వారికి మద్దతుగా వెళ్లిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. NSUI జాతీయ…
- మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.హిందీ చిత్రం ‘మెయిన్ వాపస్ ఆవుంగా’ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం భారతదేశంలో 450కు పైగా షోలతో పాటు విదేశాల్లోని 10 దేశాల్లో కూడా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 223715