ఏపీ కాంగ్రెస్(Congress) అధ్యక్షురాలు షర్మిల, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరినీ నడిపిస్తున్నది టీడీపీ అధినేత చంద్రబాబునాయుడేనని, వారి రిమోట్ ఆయన వద్దే ఉందని ఆరోపించారు. కడప లోక్సభ స్థానం నుంచి తన సోదరి షర్మిల పోటీ చేస్తుండడంపై తనకు ఎలాంటి బాధా లేదన్న జగన్.. ఆమెకు డిపాజిట్ కూడా రాదేమోనని బాధగా ఉందని చెప్పారు. తనపై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో తన తండ్రి వైఎస్సార్ పేరును చేర్చిన కాంగ్రెస్కు షర్మిల పనిచేస్తుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తన పోరాటం చంద్రబాబుతో మాత్రమే కాదని, కాంగ్రెస్, బీజేపీతో కూడానని జగన్ వివరించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2,540 కోట్ల రూపాయలతో అమరావతిలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. కృష్ణానది ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులతో…
- పల్నాడు జిల్లాలో అవకాడో సాగు పేరుతో అక్రమ దందా ..కాదేది అక్రమాలకు అనర్హం అని నిరూపిస్తున్నారు పల్నాడు జిల్లాలోని కొందరు మోసగాళ్లు. మిగతా ఏవైనా ఇబ్బందికరమని అనుకున్నారో ఏమో.. ఏకంగా పండ్ల తోటలను రియల్ ఎస్టేట్ మోసానికి మార్గంగా ఎంచుకున్నారు. అత్యంత ఖరీదైన అవకాడో పండ్లను పండించి.. లక్షల రూపాయల ఆదాయం…
- ఏపీ టెన్త్ ఫలితాల్లో 85.25 శాతం ఉత్తీర్ణత..ఏపీ పదోతరగతి ఫలితాల్లో మళ్లీ బాలికలే పైచేయి సాధించారు. ఈసారి 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికల ఉత్తీర్ణత శాతం 87.90 శాతంగా ఉండగా..82.68శాతం మంది బాలురు పాసయ్యారు. బాలురితో పోలిస్తే 5.22 శాతం అధికంగా బాలికలు ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 61416