నేడు తిరుమలలో ధార్మిక సదస్సు, దాదాపు 57 మంది పాల్గోననున్న మఠాది పతులు, పీఠాధిపతులు. హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి టీటీడీ నిర్వహిస్తున్న సదస్సు. గతంలో టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు ఒకసారి సదస్సు నిర్వహణ. మరలా భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా రెండవసారి ఈ సదస్సు నిర్వహణ. తిరుమల లోని ఆస్థాన మండపం లో సదస్సు నిర్వహణ. సదస్సులో పాల్గొని మాట్లాడనున్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి.
crime news
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి ఈరోజు అనగా న విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి వారు శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారు శ్రీ అమ్మవారి ఆలయంనకు విచ్చేయగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామీజీ వారితో పాటుగా గౌరవనీయులైన రాష్ట్ర దేవాదాయశాఖ సలహాదారు శ్రీ జ్వాలాపురం శ్రీకాంత్ గారు విచ్చేశారు. అనంతరం స్వామిజి వారు శ్రీ అమ్మవారిని దర్శనము చేసుకొని, పూజలు నిర్వహించారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరము ఆలయ వేద పండితులు, అర్చకుల వారు స్వామీజీ వారికి వేదస్వస్తి పలికారు. అనంతరం ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు గారు, అధికారులు స్వామీజీ వారికి శ్రీ అమ్మవారి ప్రసాదములు, పండ్లు సమర్పించగా, స్వామీజీ వారు అందరికీ అనుగ్రహభాషణము చేశారు.
కృష్ణాజిల్లా, పామర్రు నియోజకవర్గం, కోడి పందాల నిర్వహించే వారిపై కూచిపూడి పోలీసులు దాడి. చిన్నముతేవి గ్రామం నుండి అయ్యంకి గ్రామం వైపు వెళ్ళు కాలువ గట్టుపై కొంతమంది వ్యక్తులు కోడిపందాలు నిర్వహిస్తున్నారని రాబడిన సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు. 15 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 2 కోళ్ళు, 23,200/-రూపాయల నగదు, 6 మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కూచిపూడి ఎస్సై సందీప్. కూచిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా జూద క్రీడలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, పెనమలూరు మండలం చోడవరంలో అర్ధరాత్రి అక్రమ ఇసుక క్వారీల తవ్వకాలు అడ్డుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్. ఇది మంత్రి జోగి రమేష్ అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారు అంటూ క్వారీలో బైఠాయించిన బోడె. నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల్లోనే మంత్రి జోగి రమేష్ ఇసుక దందా చేస్తున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదని అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చోడవరం క్వారీలో ఆందోళనకు దిగారు. పెనమలూరు నియోజకవర్గం చోడవరం క్వారీ లో జరుగుతున్న అక్రమ ఇసుక దందాను బయటపెట్టేందుకు పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శుక్రవారం అర్ధరాత్రి క్వారీలో పరిశీలనకు వెళ్లారు. అయితే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన జెసి కేసి కంపెనీ కాకుండా అక్రమంగా మరో రెండు చోట్ల ఇసుకను లోడ్ చేస్తున్నారు. ఒకటి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ది కాగా, మరొకటి వైసీపీ పార్టీకి చెందిన రెడ్డిదని స్థానికులు చెప్పారు. బోడె ప్రసాద్ రాకను గమనించిన జోగి రమేష్ అనుచరులు పరారయ్యారు వారితో పాటు పొక్లైన్ ఆపరేటర్లు ఇతర సిబ్బంది కూడా పరారయ్యారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు తెలియజేసిన ఎవరు స్పందించలేదని, పొంతన లేని సమాధానం చెబుతున్నారని బోడె ప్రసాద్ మీడియాకు తెలిపారు. మంత్రి జోగి రమేష్ పెనమలూరు సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించి వారం గడవకముందే ఇసుక దందాకు తెర లేపారని ఇలాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని బోడె ప్రసాద్ కోరారు. అక్రమ మైనింగ్ అడ్డుకోవలసిన అధికారులే అండగా నిలబడటం దారుణమని ఇక్కడ అక్రమ మైనింగ్ ను నివారించే వరకు వారిని విడిచిపెట్టేది లేదని బోడె ప్రసాద్ స్పష్టం చేశారు.
విశాఖ, మధురవాడలో కొమ్మాదిలో mro దారుణం హత్య. కొమ్మది చరణ్ క్యాస్టల్ లో సంచలన రేపిన ఘటన. రూరల్ తహశీల్దార్ సనపల రమణయ్య పై హత్య చేసిన దుండగులు. గుర్తు తెలియని నలుగురు ఇంట్లో చొరబడి రాడ్ లతో దాడి. అక్కడక్కడే కుప్పకూలిన తహసీల్దార్ రమణయ్య. ప్రాణప్రాయం స్థితిలో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తహశీల్దార్ మృతి. ఘటన స్థలానికి క్షుణ్ణంగా పరిశీలించిన సిపి రవిశంకర్ ఆయన్నర్. నిందితులు కోసం పోలీసులు గాలింపు. ఘటన పై జిల్లా కలెక్టర్ సీరియస్…
కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి…నిద్రపోతున్న మున్సిపాలిటీ అధికారులు
వీధికుక్కల దాడిలో చిన్నారి ప్రాణాలు విడిచాడు. 20 కుక్కలు ఒకేసారి దాడి చేయడంతో ఆ చిన్నారి అక్కడిక్కడే మృతిచెందాడు. కుక్క కాట్లకు గురైన ఓ చిన్నారి ఏడాది వయసులోనే కన్నుమూశాడు. ఇంటి వద్ద నిద్రపోతున్న చిన్నారిని కుక్కలు రోడ్డుపైకి లాక్కేలి మరీ చంపేశాయి. ఆ బాలుని మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అప్పటివరకూ తమతో ఆడుకుంటున్న చిన్నారి ఒక్కసారిగా విగతజీవిగా పడి ఉండడం చూసిన చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ హృదయ విదారకర సంఘటన మహబూబ్ నగర్ దేవరకద్ర నాగారం గ్రామానికి చెందిన సూర్యకుమార్ కుటుంబంలో జరిగింది. సూర్యకుమార్ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి సమా ఎన్ క్లూ కాలనీలో జీవితం సాగిస్తున్నాడు. పెద్దకుమారుడి పేరు నాగరాజు ఆ బాలుని వయస్సు ఏడాది. అయితే గురువారం అర్ధరాత్రి సూర్యకుమార్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో నాగరాజును 20 కుక్కలు ఒకేసారి దాడి చేసి రోడ్డుపైకి ఈడ్చుకెళ్లాయి. ఈ విషయాన్ని ఇంట్లో నిద్రిస్తున్న సూర్యకుమార్ గానీ ఆ బాలుని తల్లిగానీ గమనించలేదు పడుకొని లేచి చూసిన సూర్య కుమార్ కు నాగరాజు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఇద్దరు కంగారు పడ్డారు. తన కొడుకు నాగరాజు కోసం చుట్టుపక్కన వెతికిన ఎక్కడ కనిపించలేదు చివరకు రోడ్డుపై వచ్చి చూసేసరికి కుక్కలు లాక్కెళ్ళి చంపేసాయని గుర్తించారు. గతంలో మున్సిపాలిటీ పరిధిలో అనేకసార్లు కుక్కలు చిన్నారులపై దాడి చేసిన మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదు.
ఎన్టీఆర్ జిల్లా, రేపటి దెందులూరు సీఎం సభకు ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల ఏర్పాట్లు. సీఎం సభకు దూరంగా మైలవరం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీరుపై పార్టీ నేతల్లో గందరగోళం. మైలవరం కేడర్ ను సీఎం సభకు తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తున్న ఎంపీ కేశినేని నాని, నియోజకవర్గం పరిశీలకుడు పడమట సురేష్ బాబు. ఈ నెల 4 లేదా 5 న ప్రెస్ మీట్ పెట్టి తన మనోభావాలు చెబుతానని ప్రకటించిన వసంత కృష్ణ ప్రసాద్. ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారని ఇప్పటికే జోరుగా ప్రచారం.
విజయనగరం జిల్లా, ఎస్.కోట లో వైసీపీలో ముసలం.. ఈ ఎమ్మెల్యే మాకొద్దు..అంటూ అసమ్మతి నేతల నిరసన.. శృంగవరపుకోట నియోజకవర్గం ఎల్.కోట మండలంలో శ్రావణి ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే అసమ్మతి వర్గం సమావేశం. శృంగవరపుకోట నియోజకవర్గం లో ఐదు మండలాల లో ఉన్న ఎంపీటీసీలు,జడ్పీటీసీలు,సర్పంచ్ లు స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావును మార్చాలని స్థానిక నాయకులకు టిక్కెటు కేటాయించాలని కోరారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో స్థానికులకు టికెట్ కేటాయించకుండా మళ్ళీ కడుబండి శ్రీనివాసరావుకి టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని అందుకని స్థానికులకి అవకాశం ఇవ్వాలని అందరూ నాయకులు ముక్తకంఠంతో కోరారు. మా మాట వినకుండా టికెట్ ఇస్తే ముకుమ్ముడు అందరం పార్టీకి రాజీనామాలకు సిద్ధమని తెలిపారు. ఎల్ కోట సీనియర్ నాయకులు సూర్యారావు మాట్లాడుతూ.. మాకు స్థానికుడు తప్ప ఈ ఎన్.ఆర్.ఐ లు మనకి వద్దు కచ్చితంగా అభ్యర్థిని మార్చకపోతే అందరం ముకుమ్ముడి రాజీనామాకైనా సిద్ధం అని ముఖ్తకంఠంతో తెలిపారు.
NTR జిల్లా, జగ్గయ్యపేట పెనుగంచిప్రోలు రంగుల మహోత్సవంలో అధికారులు వైఫల్యం. అర్థరాత్రి 12గంటలు దాటిన గ్రామ మండపానికి చేరుకొని ఎంపిక చేసిన ఎద్దుల బండ్లు, ఆలస్యంగా మండపానికి చేరుకున్న రెండు బండ్లు. అమ్మవారిని జగ్గయ్యపేట సాగనంపేందుకు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న మహిళలు, భక్తులు. తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు. సమయపాలన పాటించకపోవడంతో అధికారులు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మహిళ భక్తులు.
కృష్ణాజిల్లా, పామర్రు నియోజకవర్గం విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై కురుమద్దాలి వద్ద దగ్ధమవుతున్న కారు, కారులో ఉన్న వ్యక్తులు దిగి పారిపోయినట్లు సమాచారం. భీమవరం నుంచి హైదరాబాద్ వెళుతున్న ముగ్గురు యువకులు. ఇంజన్లో నుంచి మంటలు రావడంతో కారు దిగి పారిపోయిన యువకులు, టాటా హేరియర్ డీజిల్ కారు పూర్తిగా దగ్ధం అయినట్టు సమాచారం.