ఈ నెల 21న రాష్ట్ర పర్యటనలో భాగంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి నంద్యాలకు విచ్చేస్తున్నారని బిజెపి నంద్యాల కన్వీనర్ అభిరుచి మధు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురందేశ్వరి మేడం నంద్యాలకు రాగానే బిజెపి కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో మొదలై రాష్ట్రవ్యాప్తంగా వాలంటరీ కార్యక్రమం జరుగుతుందని ఇక్కడి నుంచి బూత్ కమిటీ సభ్యులను, పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్లతో, నాయకులతో, అభిమానులతో, కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి పట్టణంలోని పలు కూడళ్లలో తిరిగి చివరగా సౌజన్య కన్వెన్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Crime news*
వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం యోగి వేమారెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రెసిడెంట్ చెంగారెడ్డి మాట్లాడుతూ యోగి వేమన పద్యాలు సులువుగా నేర్చుకోవచ్చు దాని తాత్పర్యం అర్థం అవుతుంది. వేమన అంటే ఒక మహాకవి ఒక జ్ఞాని అని తెలిపారు. వేమన పద్యాలు అంటే అందరికీ ఇష్టమే అంటూ ఆయన తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ రెడ్డి మాట్లాడుతూ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము ఎన్నో సంక్షేమ పనులు చేశామని మేము రెడ్డి కులస్తులనే కాదు ఆదుకునేది అన్నీ కులస్తులను మేము ఆదుకుంటామని ఆయన తెలిపారు. స్కూల్ పిల్లలకు విజయ సాధన అనే బుక్స్ పంపిణీ చేశారు. పేదలకు, ముసలి వాళ్లకు రగ్గులు, బెడ్ షీట్లను ఉచితంగానే అందజేశారు.
అన్నమయ్య జిల్లా పీలేరు లో జరగబోయే చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు త్వరగతిన పనులు పూర్తిచేయాలని ఆపార్టీ నాయకులతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ బాధ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన పీలేరు పట్టణ పరిసరాల్లో జరిగే రా కదలిరా చంద్రబాబు బహిరంగ సభ ప్రాంగణం, హెలిఫ్యాడ్ స్థల పరిశీలన, వాహనాల కోసం పార్కింగ్, బహిరంగ సభా స్థలం పరిశీలించారు. నియోజకవర్గాల వారీగా వచ్చే వాహనాలు, నాయకులు, ప్రజలు, అభిమానులకు అసౌకర్యం కలగకుండా చూడాలని అన్నారు.
ఇవాళ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో పవన్ తో మర్యాదపూర్వకంగా కలవనున్న బాలశౌరి. సాయంత్రం 5.30 నుంచి 6 గంటల ప్రాంతంలో సంబరాలు చేయనున్న పార్టీ శ్రేణులు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు ఇవాళ ఉదయం 11 గంటలకు కలవనున్నారు. ఈ సందర్బంగా ఈరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల ప్రాంతంలో కృష్ణా, గుంటూరు జిల్లాలోని అన్ని మండలాల్లో బాణసంచా కాల్చి సంబరాలు చేయనున్న జనసేన నాయకులు, కార్యకర్తలు, బాలశౌరి గారి అభిమానులు, అనుచరులు. గుంటూరు పట్టణంలోని లాడ్జి సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సాయంత్రం 6 గంటలకు దాదాపు 20 డివిజన్లకు చెందిన నాయకులు కలిసి పెద్దఎత్తున ఎంపీ బాలశౌరి గారికి మద్దతుగా బాణసంచా కాల్చనున్నారు.
తెలుగుదేశం పార్టీ రా కదలిరా కార్యక్రమంలో భాగంగా నేడు వెంకటగిరి పట్టణానికి రానున్న టిడిపి అధినేత చంద్రబాబు. ఈ ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా విజయవాడ నుంచి వెంకటగిరి కి రానున్న బాబు. చంద్రబాబు బహిరంగ సభకు సర్వం సిద్ధం చేసిన ఆ పార్టీ శ్రేణులు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి భారీగా తరలిరానున్న, టిడిపి, జనసేన పార్టీ శ్రేణులు.
పల్నాడు జిల్లా, నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్బంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో భారీగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు ఈ సందర్భంగా మాజీ మంత్రి ,టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి గొప్ప మహానుభావుడు ఎన్టీఆర్. ప్రపంచ దేశాల్లోనే తెలుగుజాతికి గౌరవం తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీఆర్. నటనలో కానీ, రాజకీయాల్లో కానీ తనకు సాటి లేదనిపించుకొన్న వ్యక్తి ఎన్టీఆర్. పేద బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టి, వెనుకబడిన వర్గాల వారికి గుర్తింపు తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్బంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో భారీగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నందమూరి తారకరామారావు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
పటమట ఎన్టీఆర్ సర్కిల్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ. నందమూరి తారకరామారావు ఒక వ్యక్తి కాదు ఒక ప్రభంజనం. తెలుగు కళామ్మతల్లి ఆశీర్వాదం పొందారు. సంక్షేమం అన్న పదానికి మారు పేరు ఎన్టీఆర్. ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదల్ని రూపాయికి బియ్యం తో ఆదుకొని వారి కడుపు నింపారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. తెలుగు వారు ఆత్మగౌరవంతో తలెత్తుకోగలుతున్నామంటే దానికి కారకులైన వారిలో ఎన్టీఆర్ కూడా ఒకరు. అందుకే తెలుగు ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు అన్నారు.
తమిళనాడు. శివగంగై జిల్లా కారైకుడి సమీపంలోని జల్లికట్టు లో ఒక బాలుడు సహా ఇద్దరు వ్యక్తులు మరణించారు. శివగంగై జిల్లా కారైకుడి సమీపంలోని సిరవాయల్లో జల్లికట్టు పోటీ జరుగుతోంది. ఈ పోటీలను సహకార శాఖ మంత్రి కెఆర్ పెరియ కరుప్పన్ ప్రారంభించారు. ఈ పోటీలో ఆన్లైన్లో నమోదైన 271 ఎద్దులను గేటు నుండి ఒకదాని తర్వాత ఒకటి విప్పుతున్నారు. గెలుపొందిన క్రీడాకారులకు, ఆవుల యజమానులకు బహుమతులు అందజేయనున్నారు. అంతకుముందు మంజువిరాటు ఉత్సవ సమన్వయకర్త వేలుచ్చామి ఆధ్వర్యంలో పెరియనాయకి, తేనాక్షి అమ్మన్ ఆలయంలో శమీ దర్శనం ముగించుకుని ఊరేగింపుగా ఆలయానికి వచ్చారు. అక్కడి నుంచి ఎద్దులను ఒకదానికొకటి విడిచిపెట్టి. 800 మంది వరకు పోలీసుల రక్షణలో పాల్గొంటున్నారు. పెరియకరుప్పన్, జిల్లా కలెక్టర్ ఆశా అజిత్ పోటీలను ప్రారంభించారు. బృంగటికి చెందిన భాస్కరన్ (13) అనే బాలుడు ఎద్దును పట్టుకోవడానికి వెళ్లి ఢీకొని మృతి చెందాడు. అలాగే 35 ఏళ్ల యువకుడు మృతి చెందినట్లు సమాచారం.
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో అంగన్వాడీ వర్కర్స్ సమ్మె 37వ రోజు చేరుకున్న నేపథ్యంలో మట్టి తింటూ నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడి మహిళలు. అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 36 రోజులుగా చేస్తున్న నిరవదిక సమ్మె బుధవారం 37వ రోజుకు చేరింది. అందులో భాగంగా అనంతపురం జిల్లా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడి టీచర్ల దీక్షా శిబిరంలో మట్టిని తింటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడి టీచర్లు మాట్లాడుతూ గత 36 రోజులుగా అంగన్వాడి టీచర్లు నిరవదిక సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని జగన్ సర్కార్ పై మండిపడ్డారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల సంఘాలతో చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ సమ్మె మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. అంగన్వాడి యూనియన్ నాయకులతో ఐదు సార్లు చర్చలు జరిపి విఫలం చేయడం చాలా విడ్డూరమన్నారు. ఇచ్చిన హామీలను జీవో రూపంలో ఇస్తే తక్షణమే నిరవధిక సమ్మెను విరమింప చేస్తామని అంగన్వాడి టీచర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లలు, ఆయాలు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.
ములుగు జిల్లా కేంద్రంలోని మొదటి మొక్కుల గట్టమ్మ తల్లికి మొక్కులు సమర్పించిన తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్, స్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, దేవాదాయ, ఆటవి శాఖ మంత్రి కొండా సురేఖలు. మేడారం జాతర నిర్వహణ పనులను పరిశీలించడానికి వెళ్తున్న క్రమంలో జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి వద్ద నాయకపోడ్ గిరిజన పూజారులు మంత్రి సీతక్క, కొండా సురేఖ లకు ఘన స్వాగతం పలికారు. ఘట్టమ్మ తల్లికి మంత్రులు చీరే, సారె లను సమర్పంచారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రులు సీతక్క, సురేఖ లను ఆశీర్వదించారు. అనంతరం గట్టమ్మ దేవాలయం పరిసరాలను మంత్రి సీతక్క పరీశీలించారు. ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.





Total views : 90590