తెలుగుదేశం అధినేత చంద్రబాబు మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన తర్వాత ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. మధ్యంతర బెయిల్ పై విడుదలయిన తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. ఆ తర్వాత ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరయింది. హైకోర్టుతో పాటు, సుప్రీంకోర్టు కూడా ఆయన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి పర్మిషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన జనం బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 10 నుంచి జిల్లాల పర్యటనలు చేపట్టాలని నిర్ణయించారు. ఈలోగా ఢిల్లీకి వెళ్లి సీఈసీని కలవాలని బాబు భావిస్తున్నారు. ఏపీలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై సీఈసీకి ఫిర్యాదు చేసేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. డిసెంబర్ 6 నుంచి 8వ తేదీ లోపల కలిసేందుకు తనకు సమయం కేటాయించాలని సీఈసీకి లేఖ రాయనున్నారు.
cvr news channel
తిరుపతి జిల్లాకు తుఫాను ముప్పు పొంచి ఉన్నట్లు ఐ ఎం డి నుండి సమాచారం అందిందని జిల్లా కలెక్టర్ కె .వెంకటరమణా రెడ్డి శనివారం తెలిపారు. ఐఎండి హెచ్చరికల ఆధారంగా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మండల స్థాయి, గ్రామస్థాయిలో ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందని ప్రస్తుత సమాచారం మేరకు డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, 50 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు కూడా ఉన్నాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు . అధికారులందరూ అప్రమత్తమై ఉన్నారని, ప్రజలందరూ అవగాహన కలిగి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని, ముఖ్యంగా 4,5 ఈ రెండు తేదీలలో పిల్లలు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లల తల్లులు, వృద్దులు బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రెవెన్యూ శాఖ అధికారులు అందరూ మునిసిపల్ ఏరియాలలో మరియు రూరల్ ఏరియాలలో రిహాబిలిటేషన్(పునరావాస కేంద్రాలు) సెంటర్లు ఏర్పాటు చేయడం జరగుతుందనీ, అలాగే ఈ సెంటర్లలో 24 గంటలు వసతి, ఫుడ్ మరియు ఇతర మెడికల్ సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.హెల్త్ డిపార్ట్మెంట్ మరియు ఐసిడిఎస్ ముఖ్యంగా 10 రోజుల లోపు డెలివరీ అయ్యే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారిని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హాస్పిటల్స్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. చిన్నపిల్లల తల్లులు కూడా రిహాబిలిటేషన్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని అందులో పిల్లలకు సంబంధించిన పాలు, ఆహారం వంటివి అందేలా చూస్తున్నామన్నారు. ప్రధానంగా దృష్టి గుడిసెలలో ఉన్నవారు, కచ్చా గృహాల్లో నివసిస్తున్న వారు కూడా ఈ పునరావాస కేంద్రాలను వినియోగించుకోవాలని, ఎక్కడా కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులందరూ అప్రమత్తమై వున్నారని, ప్రజల నుంచి కూడా సహకారం కావాలని అందరిని కోరుకుంటున్నానని అన్నారు. ప్రజలందరూ ప్రభుత్వం ఇచ్చేటటువంటి సలహాలను పాటిస్తూ ఉన్నట్లయితే ఈ తుఫానును సునాయాసంగా ఎదుర్కొనవచ్చునని తెలిపారు.
ఈ రోజు పుట్టిన రోజు సందర్బంగా శ్రీకాళహస్తేశ్వరుడిని దర్శించుకున్న మాజీ మంత్రి వర్యులు గంటా శ్రీనివాసులు వారికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేసిన శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బొజ్జల సుధీర్ రెడ్డి దర్శన అనంతరం వారు ఊరందూరు లో సుధీర్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన విందు లో పాల్గొని కేక్ కట్ చేసారు. పత్రిక సమావేశం నిర్వహించి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు ఆలోచన ని ప్రజలకు వివరించారు. గంటా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన నాలుగున్నర సంవత్సరం అభివృద్ధి చేయకుండా మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి అనగా ఉత్తరాంధ్రలో రాజధాని అని లేనిపోని అపోహలు కల్పిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు, ఋషికొండ కి గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి లేకపోయినా కూడా అందులో కట్టడాలు నిర్మిస్తూ ప్రజా ఆస్తిని ధ్వంసం చేస్తున్న ఈ వైసిపి ప్రభుత్వం త్వరలోనే ఇంటికి పోవడం ఖాయమని ధ్వజమెత్తారు, రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర ని ద్వంసం చేయడానికి చూస్తున్నారు. బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గోపాల కృష్ణారెడ్డి గారితో కలిసి గంటా శ్రీనివాసరావు విద్యాసంస్థలకు అభివృద్ధి పథంలో నడపడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా గంటా శ్రీనివాసరావు సహకారం తో శ్రీకాళహస్తిలో మరింత అభివృద్ధి పథంలో నడపటానికి కృషి చేస్తానని, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కాయమని ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దిగజారి పనిచేయడం చూస్తుంటే నారా చంద్రబాబునాయుడు తిరుమలకు రావడంతో వారు బస చేస్తున్న అతిథి గృహం వద్ద నేను వెళ్తే అక్కడున్న సిఐ, డిఎస్పి విచక్షణరహితంగా మాట్లాడుతూ ఒక ప్రజా ప్రతినిధి అని కూడా లేకుండా ఏకవచనంతో సంబోధించడం దారుణమని వారిపై ప్రివిలేజ్ కమిటీకి కంప్లైంట్ ఇస్తానని తెలిపిన కంచర్ల శ్రీకాంత్.
వాట్సాప్ ఒక ప్రముఖ మెసేజింగ్ యాప్. ఇది మనం ఎవరికైనా చాలా సులభంగా మెసేజ్‌లను పంపడానికి అనుమతిస్తుంది. కానీ మనం ఒక నిర్దిష్ట సమయానికి ఒక మెసేజ్‌ను పంపాలనుకుంటే ఏమి చేయాలి?
వాట్సాప్‌లో మెసేజ్‌లను షెడ్యూల్ చేయడానికి అధికారికంగా ఏ ఫీచర్ లేదు. కానీ మనం కొన్ని థర్డ్ పార్టీ యాప్‌లను ఉపయోగించి ఈ పనిని చేయవచ్చు.
SKEdit అనేది వాట్సాప్ కోసం ఒక థర్డ్ పార్టీ యాప్. దీని ద్వారా మనం వాట్సాప్‌లో మెసేజ్‌లను షెడ్యూల్ చేయవచ్చు.
SKEditని ఉపయోగించి మెసేజ్ షెడ్యూల్ చేయడానికి క్రింది దశలను అనుసరించండి:
- మీ ఫోన్లో Google Play Store లేదా App Store నుండి SKEdit యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి.
- యాప్‌ను ఇన్స్టాల్ చేసిన తర్వాత, దాన్ని తెరవండి.
- Sign in with Facebook ఎంపికను ఎంచుకోండి.
- మీ Facebook ఖాతాతో యాప్‌లో సైన్ ఇన్ చేయండి.
- Compose ఎంపికను ఎంచుకోండి.
- మీరు పంపాలనుకుంటున్న మెసేజ్‌ను టైప్ చేయండి.
- Schedule ఎంపికను ఎంచుకోండి.
- మీరు మెసేజ్‌ను పంపాలనుకుంటున్న తేదీ మరియు సమయాన్ని ఎంచుకోండి.
- Save ఎంపికను ఎంచుకోండి.
అనుమానాస్పద స్థితి లో ఒక వ్యక్తి మృతి. గణపవరం మండలం కాల్చుపల్లి గ్రామానికి చెందిన ఈదుపల్లి వెంకటరామారావు(60) అనే వ్యవసాయ కూలీ మృతి. అదే గ్రామానికి చెందిన విశ్వనాథరాజు అనే రైతుకు ఇంటిదగ్గర చెట్లు పెరిగినవని నరకడానికి వెళ్లిన మృతుడు. గంట తర్వాత వెంకట రామారావు చనిపోయిన విషయాన్ని దాచిపెట్టి యాక్సిడెంట్ అయిందని ఇంటికి ఫోన్ చేసి తెలియపరిచిన విశ్వనాథరాజు. మృతుని బంధువులు వచ్చేసరికి శవాన్ని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో పెట్టి చనిపోయినాడు అని తెలియజేసిన విశ్వనాథరాజు. విశ్వనాథరాజు చెప్పే మాటలకు సంబంధం లేదని ఒకసారి ముందుకు పడిపోయారని ఒకసారి వెనకకు పడిపోయాడని ఒకసారి ఆక్సిడెంట్ అయిందని చెప్పడం ఈ కేసు అనుమానాస్పద మృతిగా గుర్తించారు. మృతుడికి ముగ్గురు మగ పిల్లలు భార్య ఉన్నారు. తరచుగా రాజుగారి దగ్గర పనికి వెళుతూ వస్తూ ఉంటారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా పట్టను పోలీసులు.
రామగుండం సింగరేణి ఏరియా వన్ జీడికే లెవెన్ ఇంక్లైన్ బొగ్గు గనికి వెళ్లే పాత రహదారిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉదయం షిఫ్టులో కార్మికులు గని వద్ద నిరసన దిగారు .కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో గనికి చేరుకునే అవకాశం ఉన్న రహదారిని మూసివేయగా 11 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుందని అన్నారు.గతంలో ఫైవింక్లైన్ నుంచి ఉన్న రహదారిని పునరుద్ధరించాలని నినాదాలు చేస్తూ గని వద్ద బైటాయించారు.
నల్గొండ : నాగార్జునసాగర్ వద్ద రెండో రోజు కొనసాగుతున్న హైటెన్షన్. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యాం పై కొనసాగుతున్న రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల పహారా. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ నిబంధనలు పాటించని ఏపీ ప్రభుత్వం. ఏపీ వైపు భారీగా మోహరించిన ఏపీ పోలీసులు. సాగర్ నుంచి మాచర్ల వైపు వచ్చే వాహనాలు అడ్డుకుంటున్న ఏపి పోలీసులు. డ్యాం వద్దకు భారీగా చేరుకుంటున్న టీఎస్ పోలీసు బలగాలు. నిన్న మధ్యాహ్నం దౌర్జన్యంగా కుడి కాల్వకు నీటి విడుదల చేసుకున్న ఏపి అదికారులు. ఇప్పటికే గంటకు 500 క్యూసెక్కుల చొప్పున సుమారు 4 వేల క్యూసెక్కుల నీరు ఏపీకి విడుదల. ప్రస్తుతం 522 అడుగుల చేరువలో సాగర్ నీటి మట్టం. మరో 12 అడుగులకు చేరితే డెడ్ స్టోరోజికి చేరే అవకాశం. పట్టువీడని ఏపి ప్రభుత్వం. ఎన్నికల సమయం కాబట్టి ఎటూ తేల్చుకోలేక పోతున్న తెలంగాణ ప్రభుత్వం.
నగరంలో వరస అగ్ని ప్రమాదం తో ప్రజలు భయభ్రాంతులు. ఫిషింగ్ హార్బర్ గంగలమ్మ గుడి వద్ద ఎగసిపడిన మంటలు. సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై వివరాల ఆరా తీసిన పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్. ఫిషింగ్ హార్బర్ వద్ద గాంధీ విగ్రహం వద్ద బడ్డీలు నుంచి ఎగసిపడుతున్న మంటలు. ప్రమాదం పై ఆరా తీస్తున్న విశాఖ పోలీసులు. వరుస అగ్ని సంఘటనలతో భయబ్రాంతులకు గురవుతున్న విశాఖ వాసులు. చేపల వేటకు సంబంధించినవన్ని బూడిద పాలు అయ్యాయని మత్స్యకారులు ఆవేదన. మంటలను అదుపులోకి తీసుకొచ్చిన అగ్నిమాపక శాఖ.





Total views : 195977