ఎక్సైజ్ సీఐ కొడుకు నిర్లక్ష్యం ఒక మహిళ నిండు ప్రాణాలను బలి తీసుకుంది. హనుమకొండ జిల్లా ఖాజీపేటలో ఈ ఘటన జరిగింది. స్థానిక ఫాతిమానగర్‌కు చెందిన మహిళ స్కూటీ ఎక్కుతుండగా వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాద సమయంలో ఎక్సైజ్ సీఐ శరత్ కుమారుడు వంశీ కారును నడుపుతున్నట్లుగా గుర్తించారు పోలీసులు. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆందోళనకు దిగారు. రెండు రోజుల నుంచి తమ ఫిర్యాదును తీసుకోవడం లేదంటూ ఫాతిమానగర్ జంక్షన్లో ధర్నా చేపట్టారు. భారీగా ట్రాఫిక్ జాం కాగా.. పోలీసులు తమకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని వారు తేల్చిచెప్పారు.
Cvr telugu news
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు వైఎస్ భాస్కర్‌రెడ్డికి ఇచ్చిన ఎస్కార్ట్ బెయిల్ గడువు ముగియటంతో ఆయన సీబీఐ కోర్టులో లొంగిపోయారు. అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భాస్కర్‌రెడ్డికి సీబీఐ కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన సెప్టెంబరు 22 నుంచి నవంబరు 30 వరకు ఎస్కార్ట్ బెయిల్‌పై ఉన్నారు. గడువు ముగియడంతో శుక్రవారం సీబీఐ కోర్టులో లొంగిపోయారు. ఈనెల 20 వరకు సీబీఐ కోర్టు రిమాండ్ విధించడంతో సీబీఐ అధికారులు భాస్కర్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
రాజోలులో వేడెక్కిన రాజకీయం, ఎమ్మెల్యే రాపాక వర్సెస్ మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు. యువగళం పాదయాత్ర సందర్భంగా , నారా లోకేష్ రాజోలు ఎమ్మెల్యే రాపాకపై కీలక వ్యాఖ్యలు చేయడంతో మొదలైన వివాదం. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టడంతో నియోజకవర్గంలో ప్రస్తుతం ఈ ఇరువురి గొడవ హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మాట్లాడుతూ, గొల్లపల్లి అవినీతి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని, 20 ఎకరాలలో ఆదుర్రు గ్రామంలో అక్రమ సొమ్ముతో కాలేజీ నిర్మించారని ఆరోపణలు చేశారు, సొంత పార్టీ నేతలపైనే కేసులు పెట్టించిన ఏకైక వ్యక్తి గొల్లపల్లి సూర్యరావు అని, గొల్లపల్లి అవినీతి తెలిసే చంద్రబాబు మంత్రిగా అవకాశం ఇవ్వలేదని రాపాక వరప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు మాట్లాడుతూ, నారా లోకేష్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని, లోకేష్ ను విమర్శించే స్థాయి రాపాక లేదని గొల్లపల్లి అన్నారు. పవన్ కళ్యాణ్ సంస్కారం ఉన్న వ్యక్తి అని అందుకే పవన్ కళ్యాణ్ , రాజోలు నియోజకవర్గనికి వచ్చిన రాపాకపై మాట్లాడలేదని గొల్లపల్లి సూర్యరావు అన్నారు.
ఈ రోజు పుట్టిన రోజు సందర్బంగా శ్రీకాళహస్తేశ్వరుడిని దర్శించుకున్న మాజీ మంత్రి వర్యులు గంటా శ్రీనివాసులు వారికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేసిన శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బొజ్జల సుధీర్ రెడ్డి దర్శన అనంతరం వారు ఊరందూరు లో సుధీర్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన విందు లో పాల్గొని కేక్ కట్ చేసారు. పత్రిక సమావేశం నిర్వహించి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు ఆలోచన ని ప్రజలకు వివరించారు. గంటా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన నాలుగున్నర సంవత్సరం అభివృద్ధి చేయకుండా మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి అనగా ఉత్తరాంధ్రలో రాజధాని అని లేనిపోని అపోహలు కల్పిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు, ఋషికొండ కి గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి లేకపోయినా కూడా అందులో కట్టడాలు నిర్మిస్తూ ప్రజా ఆస్తిని ధ్వంసం చేస్తున్న ఈ వైసిపి ప్రభుత్వం త్వరలోనే ఇంటికి పోవడం ఖాయమని ధ్వజమెత్తారు, రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర ని ద్వంసం చేయడానికి చూస్తున్నారు. బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గోపాల కృష్ణారెడ్డి గారితో కలిసి గంటా శ్రీనివాసరావు విద్యాసంస్థలకు అభివృద్ధి పథంలో నడపడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా గంటా శ్రీనివాసరావు సహకారం తో శ్రీకాళహస్తిలో మరింత అభివృద్ధి పథంలో నడపటానికి కృషి చేస్తానని, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కాయమని ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దిగజారి పనిచేయడం చూస్తుంటే నారా చంద్రబాబునాయుడు తిరుమలకు రావడంతో వారు బస చేస్తున్న అతిథి గృహం వద్ద నేను వెళ్తే అక్కడున్న సిఐ, డిఎస్పి విచక్షణరహితంగా మాట్లాడుతూ ఒక ప్రజా ప్రతినిధి అని కూడా లేకుండా ఏకవచనంతో సంబోధించడం దారుణమని వారిపై ప్రివిలేజ్ కమిటీకి కంప్లైంట్ ఇస్తానని తెలిపిన కంచర్ల శ్రీకాంత్.
అల్లూరి జిల్లా ఏవోబీ లో డిసెంబర్ 2 నుంచి 8 వరకు మావోయిస్టు PLGA వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అడుగడుగునా అనుమానితులను సోదా చేస్తున్నారు. ప్రత్యేక దళాలతో మావోల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
అనుమానాస్పద స్థితి లో ఒక వ్యక్తి మృతి. గణపవరం మండలం కాల్చుపల్లి గ్రామానికి చెందిన ఈదుపల్లి వెంకటరామారావు(60) అనే వ్యవసాయ కూలీ మృతి. అదే గ్రామానికి చెందిన విశ్వనాథరాజు అనే రైతుకు ఇంటిదగ్గర చెట్లు పెరిగినవని నరకడానికి వెళ్లిన మృతుడు. గంట తర్వాత వెంకట రామారావు చనిపోయిన విషయాన్ని దాచిపెట్టి యాక్సిడెంట్ అయిందని ఇంటికి ఫోన్ చేసి తెలియపరిచిన విశ్వనాథరాజు. మృతుని బంధువులు వచ్చేసరికి శవాన్ని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో పెట్టి చనిపోయినాడు అని తెలియజేసిన విశ్వనాథరాజు. విశ్వనాథరాజు చెప్పే మాటలకు సంబంధం లేదని ఒకసారి ముందుకు పడిపోయారని ఒకసారి వెనకకు పడిపోయాడని ఒకసారి ఆక్సిడెంట్ అయిందని చెప్పడం ఈ కేసు అనుమానాస్పద మృతిగా గుర్తించారు. మృతుడికి ముగ్గురు మగ పిల్లలు భార్య ఉన్నారు. తరచుగా రాజుగారి దగ్గర పనికి వెళుతూ వస్తూ ఉంటారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా పట్టను పోలీసులు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తిరుమల శ్రీవారి దర్శనం నిమిత్తం నిన్న సాయంత్రం రేణిగుంట చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి చంద్రబాబు ప్రత్యేక విమానంలో రేణిగుంట వచ్చారు. రేణిగుంట ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. చంద్రబాబు రోడ్డు మార్గం ద్వారా తిరుమల చేరుకున్నారు. రాత్రికి తిరుమలలో బస చేసి, ఈ ఉదయం సతీసమేతంగా చంద్రబాబునాయుడు వెంకటేశ్వరస్వామి దర్శనం.
బీఆర్ఎస్ నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి కుమారుడు వాకిటి శశిధర్ రెడ్డి పై దాడి జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు కారు అద్దాలు ధ్వంసం చేశారు. మెదక్ జిల్లా బిట్ల తండాలో పోలింగ్ కేంద్రం ఉందని అక్కడకు శశిధర్ రెడ్డి వెళ్లారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులను మభ్యపెట్టడానికే వచ్చారన్న అక్కసుతో బండరాళ్లతో కారుపై దాడి చేశారు. కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు శశిధర్ రెడ్డిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
Read Also..
Read Also..
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ BRS అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పోలింగ్ బూత్‌లోకి పార్టీ కండువాతో వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎల్లపల్లి గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌కు కండువాతో వెళ్లడం ఏంటని, ఇది ఓటర్లను ప్రభావితం చేసినట్లు అవుతుందని. విమర్శలు వస్తున్నాయి. మరి దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.





Total views : 90577