ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పటమట లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, మరియు టిడిపి నాయకుడు కేశినేని చిన్ని. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన అందరి ఆరాధ్య దైవం ఎన్టీఆర్. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉన్నత స్థానానికి ఎదిగారు. ఏ రంగం లో ఉన్న ఆయన అగ్రగామిగా నిలిచారు. అలాంటి ఉన్నతమైన వ్యక్తికి వారసులు అయినందుకు గర్వపడుతున్నాం.
cvr telugu
పల్నాడు జిల్లా, నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్బంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో భారీగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు ఈ సందర్భంగా మాజీ మంత్రి ,టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి గొప్ప మహానుభావుడు ఎన్టీఆర్. ప్రపంచ దేశాల్లోనే తెలుగుజాతికి గౌరవం తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీఆర్. నటనలో కానీ, రాజకీయాల్లో కానీ తనకు సాటి లేదనిపించుకొన్న వ్యక్తి ఎన్టీఆర్. పేద బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టి, వెనుకబడిన వర్గాల వారికి గుర్తింపు తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్బంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో భారీగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నందమూరి తారకరామారావు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
అమరావతి, ఈనెల 22న రామ మందిరం లో బాలరామని విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకొని దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ.. 22వ తేదీన ఒక అద్భుతమైన ఘట్టం అయోధ్య లో ఆవిష్కృతం అవుతుంది. రామ మందిరం ప్రారంభం భారతీయుల శతాబ్దాల కల, దశాబ్దాల పోరాటం. ఈనెల 22న బాలరామని విగ్రహ ప్రతిష్ట నిర్వహించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21వ తేదీ వరకు మాత్రమే సెలవు ప్రకటించారు. 22వ తేదీన దేశం మొత్తం విద్యాసంస్థలు సెలవు ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా ఆ రోజు సెలవు ప్రకటించలేదు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహావిష్కరణ వల్ల 21 వరకు సెలవు ఇవ్వడాన్ని బీజేపీ పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నాం. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అన్ని వర్గాల వారికి మోడీ చేయూతను ఇచ్చారు. 22న బాలరాముని ప్రతిష్ట కార్యక్రమం వీక్షించేందుకు దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. 21 వరకు మాత్రమే జగన్ ప్రభుత్వం సెలవులు ఇవ్వడం వెనక ప్రభుత్వం దురుద్దేశం ఉందని అర్థం అవుతుంది. 22వ తేదీన కూడా సెలవు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే ఆరోజు సెలవు ఇవ్వలేదు. ఇప్పటికే ప్రైవేటు విద్యా సంస్థలు సెలవులు ప్రకటించాయి. అయోధ్య ఘట్టం అందరూ తిలకించేలా ఎపి ప్రభుత్వం 22న సెలవు ప్రకటించాలి అని అన్నారు.
అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్న ఐఏఎస్ అధికారి గిరీష. ఉపఎన్నికల ఆర్వో రాజకీయ భజన. గిరిషా పై ఈసి సస్పెన్షన్ వేటు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో నకిలీ ఓటర్లు, కార్డులపై చర్యలకు ఈసీ ఆదేశం. అప్పటి తిరుపతి ఆర్వోపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశం. నకిలీ ఓటర్లు, ఓటరు కార్డుల జారీకి ఆర్వో లాగిన్ వాడటంపై ఈసీ ఆగ్రహం. అప్పటి తిరుపతి ఆర్వో, ఏఆర్వో, బీఆర్వోపై చర్యలకు ఈసీ ఆదేశం. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్న ఐఏఎస్ అధికారి గిరీషా. ఉపఎన్నికల సమయంలో తిరుపతి మున్సిపల్ కమిషనర్గా, ఆర్వోగా ఉన్న గిరీషా. అప్పట్లో 30 వేలకు పైగా బోగస్ ఓట్లు,ఎపిక్ కార్డులు జారీ అయ్యాయని ఆరోపణలు.
పోలిసులను నిలదీసిన సీఐటీయూ, సీపీఎం నాయకులు. పెండింగ్ లో ఉన్న జీతాల కోసం శాంతియుతంగా సమ్మె చేస్తున్న శ్రీ రామి రెడ్డి తాగునీటి పథకం కార్మికుల పై R.W.S అధికారులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని సీఐటీయూ నాయకులు తెలిపారు. తాము సమ్మె లో ఉండటం తో పై అధికారులతో పాటు కనేకల్ మండలం సోల్లాపురం గ్రామ సర్పంచ్ భర్త అవగాహన లేకుండా మోటార్లు అన్ చెయ్యడం తో కౌకుంట్ల గ్రామం వద్ద పైప్ లైన్ పగిలిపోయిందన్నారు, వారి పై చర్యలు తీసుకోకుండా సమ్మె లో ఉన్న తమ పై కేసులు పెట్టడం ఎంటని ప్రశ్నించారు. సమ్మె చేస్తున్న దళిత కార్మికులను చులకనగా చూసిన అధికారుల పై SC,ST కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
కళ్యాణదుర్గం మండలం గూబనపల్లి సమీపంలో గురువారం తెల్లవారుజామున గొర్రెల మందపైకి బొలెరో వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 26 గొర్రెలు మృతి చెందగా మరో 30 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. కంబదూరు మండలం కర్తనపర్తి గ్రామానికి చెందిన గొర్రెల యజమాని మారెప్పకు చెందిన 500 వందల గొర్రెలు మేత కోసం కర్ణాటకలోని బళ్లారి ప్రాంతానికి వెళ్తున్నాయి. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో గూబనపల్లి సమీపంలో ప్రధాన రహదారిపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. 26 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 30 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే బొలెరో డ్రైవర్ బండి రోడ్డు పక్కన వదిలి పరారయ్యారు. సుమారు 6 లక్షల వరకు నష్టం జరిగినట్లు గొర్రెల కాపరి మాధవయ్య తెలిపారు. తమకు జరిగిన నష్టాన్ని వాహన యజమాని నుండి చెల్లించేలా చొరవ తీసుకోవాలని బాధిత గొర్రెల యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు వచ్చి ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా గొర్రెలను రహదారిపై లేకుండా పక్కకు తొలగించారు.
డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం లో ప్రమాదవశాత్తు కారు దగ్ధం. తప్పిన పెను ప్రమాదం. మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది. రామచంద్రపురం పట్టణానికి చెందిన ఆర్ ఎస్ వి వి దుర్గాప్రసాద్ కాకినాడ నుంచి రామచంద్రపురం వస్తుండగా స్థానిక ప్రాఫిట్ షూ మార్ట్ వద్దకు వచ్చేసరికి తన మారుతి – 800 కారు షార్ట్ సర్కూట్ కారణంగా ఇంజన్ నుంచి మంటలు చెలరేగాయి. దుర్గా ప్రసాద్ కారులో నుంచి బయటపడడం తో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
పటమట ఎన్టీఆర్ సర్కిల్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ. నందమూరి తారకరామారావు ఒక వ్యక్తి కాదు ఒక ప్రభంజనం. తెలుగు కళామ్మతల్లి ఆశీర్వాదం పొందారు. సంక్షేమం అన్న పదానికి మారు పేరు ఎన్టీఆర్. ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదల్ని రూపాయికి బియ్యం తో ఆదుకొని వారి కడుపు నింపారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. తెలుగు వారు ఆత్మగౌరవంతో తలెత్తుకోగలుతున్నామంటే దానికి కారకులైన వారిలో ఎన్టీఆర్ కూడా ఒకరు. అందుకే తెలుగు ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు అన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం రుస్తుంబాద కబడి స్టేడియంలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్త్రీ , పురుషుల జాతీయస్థాయి కబడ్డీ పోటీలను మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తో కలిసి ఆర్డీవో అంబరీష్ ప్రారంభించారు. క్రీడాజ్యోతిని వెలిగించి శాంతి కపోతాలను గాల్లో విడిచిపెట్టారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ గ్రామీణ క్రీడలను ప్రోత్సహించటం వల్ల ప్రతిభ కలిగిన ఎంతో మంది క్రీడాకారులు వెలుగులోకి వస్తారన్నారు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ కబడ్డీ వంటి గ్రామీణ క్రీడను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో 30 ఏళ్లుగా పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఐదు రోజులు పాటు జరిగే ఈ పోటీలలో 18 రాష్ట్రాల జట్టు తలపడనున్నాయి. విజేతలకు ఐదు లక్షలు ప్రైజ్ మనీ అందించనున్నారు. ఈనెల 21న ఫైనల్స్ జరగనున్నాయి.
ప. గో. జిల్లా, పెనుగొండ జగన్నన్న కాలనీలో ఒక కుటుంబం పై మరొక కుటుంబ సభ్యుల దాడి. పక్కింటి నుంచి పొగ వస్తుందనే కారణంతో తల్లీ కొడుకులపై నలుగురు దాడి. విచక్షణ రహితంగా సుత్తి తో దాడి చేయడంతో తల్లి కొడుకులకు తీవ్ర గాయాలు. ఇరు కుటుంబాలు పరస్పర దాడి కి దిగటం తో పరిస్థితి తీవ్రంగా మారింది. తల్లీ కొడుకులు ని చికిత్స నిమిత్తం ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులకు పిర్యాదు చేసిన బాధితులు.