రహదారి భద్రతను ప్రోత్సహించడానికి, వేగ పరిమితులను పాటించడంలో డ్రైవర్లకు సహాయం చేయడానికి గూగుల్ మ్యాప్స్ ఓ ఫీచర్ ను తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వీధుల కోసం నిజ-సమయ వేగ పరిమితి సమాచారాన్ని ప్రదర్శించే కొత్త ఫీచర్‌ను రూపొందించింది. ఈ ఫీచర్ ను డ్రైవర్లకు వేగం, ఇతర సంబంధిత సమాచారాన్ని అందించడం లక్ష్యంగా తీసుకొచ్చారు. ప్రత్యేకించి వాతావరణం లేదా వివిధ ప్రాంతాలలో తెలియని ట్రాఫిక్ చట్టాల కారణంగా తక్కువ దృశ్యమానత వంటి పరిస్థితులలో ఇది ఉపయోగపడనుంది. ముఖ్యంగా ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. మీరు కొత్త ఫీచర్‌ని ఇలా ఉపయోగించుకోవాలి. మీ మొబైల్లోని గూగుల్ మ్యాప్స్ యాప్‌ను ఓపెన్ చేయాలి. పైన కుడివైపున ప్రొఫైల్ ఐకాన్ని ట్యాప్ చేసి సెట్టింగ్ పై క్లిక్ చేయాలి. తర్వాత స్క్రీన్‌ని కిందకు స్క్రోల్ చేసి నేవిగేషన్ సెట్టింగ్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అందులో డ్రైవింగ్ సెక్షన్ కనిపిస్తుంది. అందులో డ్రైవింగ్‌కు సంబంధించిన వివిధ ఫీచర్లు ఉంటాయి. వాటిలో speedometer ఆప్షన్‌ను ఎనేబల్ చేసుకుంటే మీరెంత వేగంతో ప్రయాణిస్తున్నారో రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అలానే పరిమితికి మించి వేగంగా వాహనాన్ని నడుపుతుంటే మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. ఉదాహరణకు డ్రైవర్లు హైవే నుంచి స్థానిక రహదారికి మారడం వంటి పరిస్థితులలో వారు వేగ పరిమితిలో మార్పును వెంటనే గుర్తించలేరు. ఇది అనుకోకుండా అతివేగానికి దారి తీస్తుంది. అందుకే ఈ ఫీచర్ ను తీసుకొచ్చారు. డ్రైవర్లకు సహాయం చేయడానికి, డ్రైవర్లకు మెరుగైన భద్రత, నావిగేషన్ సహాయం అందించడానికి Google Maps ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోడ్ల కోసం నిజ-సమయ వేగ పరిమితి సమాచారాన్ని ప్రదర్శించే స్పీడోమీటర్ ఫీచర్‌ను అభివృద్ధి చేసింది.
cvr telugu
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల నీటి పంచాయితీపై కేంద్ర జలశక్తి శాఖ సమావేశం ముగిసింది. శనివారం శ్రమ శక్తి భవన్లో హైబ్రిడ్ మోడ్‌లో తెలుగు రాష్ట్రాల అధికారులతో దాదాపు గంటకుపైగా కేంద్ర జలశక్తి శాఖ అధికారుల సమావేశం జరిగింది. నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్తతలు, తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపకాల సమస్యలపై కేంద్ర జలశక్తి శాఖ అధికారులు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మినిట్స్ రూపంలో ఏపీ, తెలంగాణ అధికారులు విడుదల చేస్తారని సెంట్రల్ వాటర్ కమీషన్ ఛైర్మన్ వెల్లడించారు
అయోధ్యలో నిర్మించిన రామాలయంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి 6000 మంది ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు శ్రీరాం జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పోస్టు ద్వారా అందరికీ ఆహ్వానాలు పంపింది. జనవరి 22న అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరగనుంది. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకానున్న వారిలో సాధు సంతులు, ప్రధాని నరేంద్రమోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ సహా పలువురు వీవీఐపీలు ఉన్నారు. పోస్టు ద్వారా ఆహ్వానపత్రికలు పంపడంతోపాటు వాట్సాప్ ద్వారా పీడీఎఫ్ ఫైళ్లు కూడా పంపించారు. అతిథులు తమ ఆధార్ కార్డులను విధిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయోధ్య సాధువులు అతిథులను సాదరంగా ఆహ్వానిస్తారు. మెగా ప్రాణ ప్రతిష్ఠకు రాముడి ఆశీర్వాదంతో తనకు తొలి ఆహ్వాన పత్రిక అందిందని మహంత్ విష్ణుదాస్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి సాధుసంతులు వస్తునట్టు తెలిపారు.
ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పిల్లల నుంచి పెద్దల వరకు తినగలిగే ఆహారంలో బాదం పప్పు కూడా ఒకటి. సూపర్ ఫుడ్‌గా పిలవబడే బాదంలో న్యూట్రీషియన్స్ , విటమిన్స్ , ఫైబర్, మెగ్నీషియం, ఓమేగా3 ఫ్యాటీయాసిడ్స్, ప్రోటీన్స్ అత్యధికంగా ఉన్నాయి.ఇవి మంచి ఆరోగ్యానికి తోడ్పడతాయి. బాదంను క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే బాదం ప్రతి రోజు తినడం వల్ల ఇన్సులిన్ స్థాయి అదుపులో ఉంటుంది. ఇవి గ్లూకోజ్ ను శరీరం బాగా శోషించుకొనేలా చేస్తాయి. తద్వారా మధుమేహం అదుపులో ఉంటుంది. అయితే నానబెట్టిన బాదం తినొచ్చా.? అన్నది చాలా మందిలో ఉండే సందేహం. వాస్తవానికి కొందరు నానబెట్టిన బాదం తింటే. మరికొందరు బాదంను డైరెక్ట్‌గా తింటుంటారు. కానీ, నానబెట్టిన బాదాం పప్పులు తినడమే ఆరోగ్యానికి మంచిది. ఎందుకు మంచిది అంటే. బాదం పప్పులు మీద ఉండే తొక్కలో టానిన్ అనే పదార్ధం ఉంటుంది. అది మన శరీరం పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. ఎప్పుడైతే బాదం పప్పులని నానబెట్టామో, అప్పుడు ఆ తొక్క ఊడిపోతుంది. అలా తిన్న బాదం మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందులోనూ ముఖ్యంగా రాత్రి పూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇలా క్రమం తప్పకుండా బాదంను తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఇక బరువు తగ్గాలనుకునే వారికి బాదం ఎంతగానో సహాయపడుతుంది. ఎందుకంటే బాదంలో ఉండే మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ సమయం పొట్ట ఫుల్ గా ఉంచుతుంది. ఈ క్రమంలోనే ఆకలి తగ్గిస్తుంది.తద్వారా బరువు తగ్గొచ్చు. మరియు బాదంలో ఉండే బి17 లో న్యూట్రీషియన్స్ క్యాన్సర్ నివారణలో సహాపడతాయి.
Read Also..
Read Also..
ఏజెన్సీ నివురుగప్పిన నిప్పులా మారింది. గోదావరి పరివాహక ప్రాంతంలో ఖాకీలు డ్రోన్ కెమెరాలతో డేగ కన్ను పెట్టారు. నేటి నుంచి 08 వ తేదీ వరకు జరిగే PLGA వారోత్సవాలను విజయవంతం చేయాలని మావోయిస్ట్ లు పిలుపు నివ్వడంతో ఏజెన్సీలో హై అలెర్ట్ కొనసాగుతుంది. PLGA వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు ఏదైన విధ్వంసానికి పాల్పడవచ్చనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఒకవైపు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు, మరోవైపు కమాండ్ కంట్రోల్ డ్రోన్ కెమెరాలతో మావోయిస్టుల కదలికలను పసిగడుతున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాల్లో భారీ భద్రత చోటు చేసుకుంది. 119 నియోజకవర్గాల వారిగా కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ నిర్వహించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాలో 29 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసుల ఆంక్షలు, 144 సెక్షన్ అమలు చేశారు. కౌంటింగ్ సందర్భంగా రోడ్లపై ర్యాలీలు, టపాసులు కాల్చడం, ఊరేగింపులపై నిషేధం విధించడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా రేపు మద్యం దుకాణాలు బంద్ చేశారు. ఉదయం 5గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు అధికారులు, సిబ్బంది చేరుకోనున్నారు. లెక్కింపునకు ముందు గంటపాటు ఉద్యోగులకు దిశ నిర్దేశం చేశారు. ఆర్వో ధృవీకరించిన తర్వాత 20 నిమిషాల్లో ఒక్కో రౌండ్ ఫలితం వెలువడనుంది. వేగంగా ఫలితాలు ఇచ్చేందుకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూముల వద్ద 40 కేంద్ర కంపెనీల బలగాలతో భద్రత పెంపొందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,290 మంది అభ్యర్ధుల భవితవ్యం తేలనుంది. మొత్తం 1766 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఆదివారం ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెక్షన్ 144 విధించారు. మద్యం అమ్మకాలపై కూడా నిషేధం విధించారు. ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్ల సీపీలు సందీప్ శాండిల్య, స్టీఫెన్ రవీంద్ర, డీఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. కౌంటింగ్ సెంటర్లు, బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఐదుగురి కంటే ఎక్కవ మంది గుమిగూడొద్దని, వీధుల్లో బాణసంచా కాల్చొద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పాదరసంలా కదులుతూ పాయింట్లు కొల్లగొట్టేవాళ్లు ఒకరు చిరుతలా మీదపడి ప్రత్యర్థిని ఒడిపట్టేవాళ్లు ఇంకొకరు. ఎంతమంది చుట్టేసినా బయటకి జారిపోయే డుబ్కీ కింగ్ మరొకరు! వీరంతా ఆడేది ఒకే వేదికలో! 12 జట్లు పోరాడేది ఒకే కప్ కోసం! మొదలుకాబోతోంది ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-10 గత తొమ్మిదేళ్లుగా అశేష అభిమానులను అలరించిన ఈ లీగ్ నేటినుంచి మరో సీజన్‌కు సిద్ధమైంది. ఇక అభిమానులకు పండగే! అహ్మదాబాద్‌లో తెలుగు టైటాన్స్-గుజరాత్ జెయింట్స్‌తో టోర్నీ మొదలు కానుంది. తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్, పుణెరి పల్టాన్, పట్నా పైరేట్స్, జైపుర్ పింక్ పాంథర్స్, హరియాణా స్టీలర్స్, గుజరాత్ జెయింట్స్, దబాంగ్ దిల్లీ, బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్, యూపీ యోధ, యు ముంబా కప్పు వేటలో ఉన్నాయిడిసెంబర్ 2న మొదలయ్యే ఈ టోర్నీలో లీగ్ దశలో మొత్తం 132 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లు 2024 ఫిబ్రవరి 21న ముగుస్తాయి. ప్లేఆఫ్స్, ఫైనల్ తేదీలు తర్వాత ప్రకటిస్తారు. హైదరాబాద్ వేదికగా గచ్చిబౌలి స్టేడియంలో జనవరి 19 నుంచి 24 వరకు 11 మ్యాచ్‌లు జరుగుతాయి. వీటిలో తెలుగు టైటాన్స్ నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది.
ప్రతి వంటింట్లో తప్పకుండా ఉండే తియ్యని ఆహార పదార్ధము బెల్లం. బెల్లంతో ఎన్నో రకాల వంటలు తయారు చేస్తారు. ముఖ్యంగా సంక్రాంతి టైమ్‌లో బెల్లంతో చేసిన అనేక పిండి వంటలు భారతీయుల ఇంట్లో దర్శనమిస్తాయి. ఆయుర్వేద వైద్యశాస్త్రంలో కూడా బెల్లాన్ని రకరకాల మందులలో ఉపయోగిస్తారు. ఇక మనం రోజు వాడే పంచదార కంటే బెల్లం ఆరోగ్యపరంగా చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దాదాపు చాలా మంది బెల్లాన్ని అధికంగా వాడుతున్నారు. అయితే అతి ఆరోగ్యానికే చేటు అని వినే ఉంటారు. అది బెల్లం విషయంలోనూ వర్తిస్తుంది. అవును! అతిగా బెల్లం ఉపయోగిస్తే. అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బెల్లం అతిగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. బెల్లంలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్‌లతోపాటు కొవ్వులు, ప్రోటీన్లు కూడా ఉంటాయి. అయితే బెల్లాన్ని మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. పరిమితిని మించి తీసుకున్నప్పుడే బరువు పెరుగుతారని నిపుణులు అంటున్నారు. ఇక మధుమేహం రోగులు చక్కెరకు ప్రత్యామ్నయంగా బెల్లం తినొచ్చు అని చెబుతుంటారు. కానీ, అతిగా బెల్లాన్ని తీసుకుంటే మాత్రం బ్లడ్ షూగర్ స్థాయిలు పెరిగిపోతాయి. మరియు మధుమేహం లేని వారు కూడా అతిగా బెల్లం తింటే డయబెటీస్ వచ్చే రిస్క్ ఉంది. బెల్లం అతిగా తింటే మలబద్ధక సమస్య కూడా వస్తుందని నిపుణులు అంటున్నారు. ఆరోగ్యానికి మంచిదే కదా అని ఓవర్‌గా మాత్రం బెల్లం తీసుకోకండి. శరీరానికి ఎంత కావాలో అంత మాత్రమే మీ డైలీ డైట్లో చేర్చుకోండి.
కాల్పుల విరమణ ఆగిపోవడంతో గాజా లో మళ్లీ ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. కాల్పుల విరమణ కొనసాగించాలని అంతర్జాతీయ సమాజం ఇరుపక్షాలను కోరినా వైమానిక దాడులు చోటుచేసుకున్నాయి. దీంతో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 178 మంది పాలస్తీనా ప్రజలు మృతిచెందినట్లు గాజా ఆరోగ్యశాఖ పేర్కొంది. మరోవైపు హమాస్ బందీల్లో ఐదుగురు చనిపోయినట్లు మిలిటెంట్ గ్రూప్ ధ్రువీకరించింది. ఈ దాడులతో గాజాలో మళ్లీ ఆసుపత్రుల్లో దారుణపరిస్థితులు ఏర్పడుతాయని యూఎన్ ఏజెన్సీలు హెచ్చరికలు జారీ చేశాయి. కాల్పుల విరమణ ఆగిపోవడంతో గాజా లో మళ్లీ ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. కాల్పుల విరమణ కొనసాగించాలని అంతర్జాతీయ సమాజం ఇరుపక్షాలను కోరినా వైమానిక దాడులు చోటుచేసుకున్నాయి. దీంతో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 178 మంది పాలస్తీనా ప్రజలు మృతిచెందినట్లు గాజా ఆరోగ్యశాఖ పేర్కొంది. మరోవైపు హమాస్ బందీల్లో ఐదుగురు చనిపోయినట్లు మిలిటెంట్ గ్రూప్ ధ్రువీకరించింది. ఈ దాడులతో గాజాలో మళ్లీ ఆసుపత్రుల్లో దారుణపరిస్థితులు ఏర్పడుతాయని యూఎన్ ఏజెన్సీలు హెచ్చరికలు జారీ చేశాయి. మరోవైపు హమాస్ బందీల్లో ఐదుగురు చనిపోయిన విషయాన్ని ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. మృతుల కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంది. ఒకరి మృతదేహాన్ని గుర్తించి ఇజ్రాయెల్‌కు తరలించామని తెలిపింది. ఇంకా హమాస్ బందీల్లో 136 మంది ఉన్నారని, వారిలో 17 మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డానియెల్ హగారీ పేర్కొన్నారు. కాల్పుల విరమణ సమయంలో హమాస్ తమ చెరలో ఉన్న 100 మంది బందీలను విడుదల చేయగా, ఇజ్రాయెల్ తమ దేశ జైళ్లలో ఉన్న 240 మంది పాలస్తీనా వాసులను విడుదల చేసింది. అక్టోబర్ 7న హామాస్ ఇజ్రాయెల్‌పై దాడికి దిగి పెను విధ్వంసం సృష్టించింది. ఈ ఘటనలో 1200 మంది ఇజ్రాయెల్ వాసులు చనిపోయిన విషయం తెలిసిందే. అనంతరం ఇజ్రాయెల్ గాజాలో వైమానిక దాడులకు దిగడంతో సుమారు 15,000 మంది పాలస్తీనా పౌరులు మృతిచెందారు.
ఆదివారం ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెక్షన్ 144 విధించారు. మద్యం అమ్మకాలపై కూడా నిషేధం విధించారు. ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్ల సీపీలు సందీప్ శాండిల్య, స్టీఫెన్ రవీంద్ర, డీఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. కౌంటింగ్ సెంటర్లు, బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఐదుగురి కంటే ఎక్కవ మంది గుమిగూడొద్దని, వీధుల్లో బాణసంచా కాల్చొద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read Also..
Read Also..





Total views : 91085