తెలంగాణ చీఫ్ ఎలక్షన్ అధికారి వికాస్‌రాజ్‌ను తెలంగాణ కాంగ్రెస్ నేతలు కలువనున్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతు బంధు నిధులను కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపునకు మళ్లిస్తున్నారని కాంగ్రెస్ ఫిర్యాదు చేయనుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ మెంట్ భూములను ఇతరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసే కుట్ర జరుగుతోందని ఫిర్యాదు చేయనున్నట్లు కాంగ్రెస్ వెల్లడించింది. ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్ నిఘా పెట్టాలని ఇటు హైదరాబాద్‌లో అటు ఢిల్లీలో ఎన్నికల సంఘం, ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేయనున్నారు. నేడు ఈసీని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలతో పాటు పలువురు ముఖ్య నాయకులు కలువనున్నారు.
cvr telugu
ప్రస్తుత కాలంలో ఎవరిని పలకరించినా కూడా నొప్పులు ఉన్నాయని బాధపడుతూనే ఉంటారు. చిన్నా, పెద్దా అని వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ ఈ నడుము నొప్పి అనేది ఎక్కువ బాధ కలిగిస్తుంది. ఈ పోటీ ప్రపంచంలో అసలే గంటల తరబడి కూర్చుని పనులు చేయడం ద్వారా ఎక్కువ శాతం నడుము నొప్పికి గురవుతున్నారు. ఎన్ని రకాల మందులు వాడినా అప్పటికీ మాత్రమే ఉపశమనం కలుగుతుంది. మరి నడుము నొప్పిని ఎలా నివారించాలో ఇక్కడ తెలుసుకుందాం. కొద్దిగా అల్లంను తీసుకుని దానిని మెత్తగా రుబ్బి నొప్పి ఉన్నచోట అప్లై చేయాలి. ఒక ఇరవై నిమిషాలు ఆగిన తర్వాత మీకు నడుము నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే కొన్ని అల్లం ముక్కలను బాగా మరిగించి, ఆ నీటిని చల్లార్చిన తర్వాత ఒక రెండు స్పూన్ల తేనెను కలుపుకుని తాగడం ద్వారా తొందరగా నడుము నొప్పి తగ్గు ముఖం పడుతుంది. ఇది పరగడుపున తాగడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. కొద్దిగా ఆవ నూనె, నువ్వుల నూనె రెండు సమపాళ్లలో కలుపుకుని, గోరువెచ్చగా నూనెను వేడిచేసి నొప్పి ఉన్న చోట బాగా మర్దన చేయడం ద్వారా నడుము నొప్పితో పాటు ఇంకా ఏ రకమైన కీళ్ల నొప్పులు ఉన్నా కూడా తొందరగా తగ్గిపోతాయి. శొంఠి బాగా నూరి ఒక మిశ్రమంలా తయారు చేసుకొని నొప్పి ఉన్నచోట పట్టాలా వేసుకోవాలి. దీనిపై తెల్ల జిల్లేడు ఆకులను పెట్టి కట్టు కట్టడం ద్వారా నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. ఇలా తరచూ చేస్తూ ఉండటం ద్వారా నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు నిటారుగా కూర్చొని నడపడం, ఆఫీసులో వర్క్ చేసేవారు రెండు కాళ్లు సమాంతరంగా నేలకు ఉండేలా చూసుకోవాలి. వెన్నును వంచకుండా నిటారుగా ఉండేలా కూర్చోవాలి. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకుండా గంటకు ఒక సారైనా లేచి అటూ ఇటూ నడుస్తూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా నడుము నొప్పి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వీటితోపాటు బలమైన ఆహారం తీసుకోవడం ద్వారా నడుము నొప్పి రాకుండా నివారించుకోవచ్చు. అందులో మినప్పప్పు చాలా ముఖ్యమైనది. ఇందులో ఉన్న ఫైబర్, విటమిన్స్, ప్రొటీన్లు, శరీరానికి మంచి పోషణ కలిగిస్తాయి. ఈ పప్పు ఎముకల్లో బలాన్ని చేకూరుస్తుంది. వీటితో పాటు పండ్లు, క్యాల్షియం అధికంగా ఉన్న పదార్థాలు తీసుకోవడం ద్వారా నడుము నొప్పి నుంచి నివారణ పొందవచ్చు.
బఠానీలు ఒక రకమైన గింజ ధాన్యాలు. వీటిని పచ్చిగానూ, ఎండబెట్టి కూడా ఆహారపదార్ధాలుగా వాడతారు. అయితే పచ్చి బఠానీలను కూరల్లోనూ, ఎండు బఠానీలను చిరుతిండి గానూ ఉపయోగిస్తారు. అయితే ఈ పచ్చి బఠానీలను వాడే సమయంలో కొన్ని చిట్కాలు పాటించాలి. అవి తొక్కలు ముదిరి ముడతలు పడకూడదు, తొక్కలపై నల్లటి పసుపు రంగు మరకలుండకూడదు. అటువంటి వాటినే కూరల్లోకి ఉపయోగించాలి. శీతాకాలంలో ఎక్కువగా దొరికే వీటిని వెజ్ బిర్యానీ, బంగాళ దుంప, పన్నీర్ వంటి వాటికీ జత చేసి వాడతారు. ఈ పచ్చిబఠాల్లో అనేక ఆరోగ్య ప్రయాజనాలున్నాయి. అందుకనే వీటిని వింటర్ డైట్ కు ఫర్ ఫెక్ట్ వెజిటబుల్ గా అభివర్ణిస్తారు. పచ్చిబఠానిల్లో ఫ్లేవనాయిడ్స్ , కెరోటినాయిడ్స్ , ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ , విటమిన్- A , C , K లు పుష్కలంగా ఉన్నాయి. కనుక వీటిని తరచుగా తినడం వల్ల గుండెకు మంచిది. గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. రక్తనాళాలను సంరక్షిస్తాయి. విటమిన్ కె అత్యధికంగా ఉంటుంది. పచ్చిబఠానీల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటంతో మలబద్దకాన్ని అరికడుతుంది. పచ్చిబఠానీల్లో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు ఉన్నాయి. రోజుకు ఒక కప్పు బఠాణీలు తింటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని పరిశోధకులు తెలిపారు. ఇన్సులినను నియంత్రిస్తుంది. కనుక డయాబెటిస్తో బాధపడుతున్న వారికి పచ్చి బఠాణీలు చక్కని ఆహారం. వీటిలో ఫైబర్ అధికంగా ఉండడంతో రక్తంలో గ్లూకోజ్ త్వరగా చేరదు. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి పచ్చి బఠాణీ చక్కటి ఆహారం. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తుంది . ఎముకలకు బలం చేకూర్చుతుంది. ఆర్థరైటిస్, ఆస్టియోపారోసిన్లను అరికడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కనుక పచ్చిబఠానీలు దొరికే సమయంలో తప్పనిసరిగా ఆహారంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులుసూచిస్తున్నారు.
నాగార్జునసాగర్ వివాదం నేపథ్యంలో వివిధ ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి కేంద్రం సిద్ధమైంది. నాగార్జునసాగర్, శ్రీశైలం డ్యాముల నిర్వహణను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కు అప్పగించేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. కేంద్ర జలశక్తి శాఖ ఉదయం 11 గంటలకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరు కావాలని ఏపీ, తెలంగాణ సీఎస్ లకు సూచించింది. సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ డీజీలు, సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ చైర్మన్లకు కూడా దీనిపై సమాచారం అందించింది. సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ చైర్మన్లు ఈ సమావేశానికి నేరుగా హాజరు కావాలని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశంలో నాగార్జునసాగర్ డ్యామ్ భద్రతను సీఆర్పీఎఫ్ బలగాలకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో సీఆర్పీఎఫ్ బలగాలు సాగర్ డ్యామ్ వద్దకు చేరుకున్నాయి. సాగర్ డ్యామ్ ను తమ అధీనంలోకి తీసుకోనున్నాయి. ప్రస్తుతం ఉద్రిక్తతల నేపథ్యంలో సాగర్ డ్యామ్ కు ఇరువైపులా రెండు రాష్ట్రాల పోలీసులు మోహరించి ఉన్నారు. నాగార్జునసాగర్ డ్యామ్ పరిసరాలు పోలీసుల వలయంలో ఉన్నాయి.
మల్దకల్, తెలంగాణ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందినది. ఇది డివిజన్ కేంద్రమైన గద్వాల నుంచి రాయిచూరు వెళ్ళు మార్గములో గద్వాల నుంచి 14 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి స్వయం భూస్వామి దేవాలయం స్థానిక పర్యాటకులను ఆకర్షిస్తుంది. ప్రతియేటా ఈ దేవాలయానికి రథోత్సవం మరియు జాతర అతి వైభవంగా జరుగుతుంది. ద్వాపరయుగాంతం కలియుగ ఆరంభంలో తిరుమల తిరుపతి దేవునికి ముందు విష్ణుమూర్తి ఇక్కడ ఆదిశిలపై పాదం పెట్టి ప్రవేశించడంతో దీనికి ఆదిశిల అనే పేరు ఉన్నట్లు బ్రహ్మాండ పురాణంలోని నాలుగవ అధ్యాయంలో ఆధారాలున్నాయి. ఈ గ్రామంలో ఎవరు కూడా ఇండ్లను రెండో అంతస్తు కట్టకపోవడం ఇక్కడి ప్రత్యేకత. స్వామివారి గోపురం కంటే ఎత్తు ఇళ్ళు ఉండరాదని, ఇదివరకు ఈ విధంగా చేసినవారికి అరిష్టాలు జరిగాయని ప్రచారంలో ఉంది. ఇతర మతస్థులు కూడా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. రెండవ తిరుపతిగా వెలుగొందుతున్న మొదలకల్ క్షేత్రం గురించి బ్రహ్మాండ పురాణంలో ఆది శిలా క్షేత్రాన్ని గురించి వివరించారు. మొదలు అనగా ‘ఆది’ అని, కల్లు అనగా ‘రాయి’ అని అర్థము. బ్రహ్మ దేవుడు ఒక శిలను సృష్టించి ‘ఆదిశిల’ అని పేరు పెట్టాడని, అక్కడే పరమ శివుడు తపస్సు నాచరించాడని, అట్టి శిలపై శ్రీనివాసుడు, లక్ష్మీదేవి, అనంతశయన మూర్తి, వరాహస్వామి, ఆంజనేయుడు, ఒకే శిలపై ఉద్భవించారు. క్షేత్ర పాలకుడు అయిన పరమేశ్వరుడు ఇచ్చట సతీసమేతంగా వెలిసి యున్నాడు. ఈ ప్రాంతమంతా ఒకప్పుడు అరణ్యంగా ఉండేది. ఒక రోజు గద్వాల సంస్థానాధీశుడు అయిన నలసోమనాద్రి రాజు గుర్రము పైన వేటకై మల్దకల్ ప్రాంతానికి రాగా ఒక చోట అతని గుర్రము అకస్మాత్తుగా ఆగిపోగా, రాజు ఈ ప్రాంతములో ఏదో మహాత్యము ఉందని భావించి, దగ్గరలో ఉన్న పశువుల కాపరిని పిలిచి విచారించగా అక్కడే పొదలలో కల విగ్రహాన్ని చూపాడు. నా గుర్రం పరిగెత్తితే నీకు గుడి కట్టిస్తానని మొక్కి తన గుర్రం ఎక్కగానే అది రెట్టించిన వేగంతో పరిగెత్తి తన ప్రయాణాన్ని పూర్తి చేసిందని చరిత్ర చెబుతుంది. అప్పుడు రాజు గారు దేవాలయాన్ని కట్టించి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి, అడవిలో విగ్రహాన్ని చూపిన పశువుల కాపరి అయిన బోయవాడిని పూజారిగా నియమించాడు. నేటికీ ఈ దేవాలయంలో అతని సంతతి వారే పూజాధికాలు నిర్వహిస్తుంటారు. స్థానికులు దేవాలయంలోని భగవంతుణ్ణి మల్డకల్ తిమ్మప్ప దేవునిగా పిలుస్తుంటారు. ఈయన చుట్టుప్రక్కల గ్రామాలలో ఫెమస్. ప్రతి ఏటా డిసెంబర్ నెల పౌర్ణమి నాడు భక్తులు ఆనందోత్సాహాల మధ్య జాతర ( తిరునాళ్ల) జరుపుకుంటారు. కర్నాటక, మహారాష్ట్ర మరియు ఆంధ్రా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఏటా 20 లక్షల మంది పైగా దేవాలయాన్ని దర్శిస్తుంటారని అంచనా.
Read Also..
Real Also..
నేటి నుంచి ఎనిమిదవ తేదీ వరకు మావోయిస్టు 23వPLGO వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో. తెలంగాణ -చత్తీస్గడ్ రాష్ట్ర సరిహద్దులోని దండకారణ్య ప్రాంతంలో హై అలర్ట్. వెంకటాపురం ఏజెన్సీని జల్లెడ పడుతున్న పోలీసు బలగాలు. ఏజెన్సీలో ఉనికిని చాటుకోవడం కోసం మావోయిస్టులు, సమర్థవంతంగా తిప్పుకుంటే ప్రయత్నంలో పోలీసులు. అటవీ ప్రాంత గిరిజన గ్రామాలపై డ్రోన్ కెమెరా, హెలికాప్టర్లతో, నిఘ వ్యవస్థను పటిష్టం చేసిన పోలీసులు. గోదావరి తీర ప్రాంతం పై డేగ కన్ను వేసిన పోలీసులు. వెంకటాపురం-వాజేడు, భద్రాచలం -వెంకటాపురం రహదారులపై వాహనాలను తనిఖీ చేస్తూ, అనుమానితుల వద్ద వివరాలు సేకరిస్తూ, గ్రామాలకు కొత్త వ్యక్తులు గాని అపరిచిత వ్యక్తులుగా కనపడితే పోలీసులకు సమాచారం తెలపాలని ప్రజలకు సూచిస్తున్నారు పోలీసులు.
కాకినాడ తీరంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం జరిగింది. నడి సంద్రంలో ఉండగా అందులోని గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో మంటలు వ్యాపించాయి. 11 మంది మత్స్యకారులు బోటులో చిక్కుకున్నారు. నిమిషాల్లో బోటు మొత్తం అగ్నికి ఆహుతయింది. లైఫ్ జాకెట్ల సహాయంతో మత్స్యకారులు బోటు నుండి సముద్రంలోకి దూకి, సుమారు గంట వరకు సముద్రంలోనే ఉన్నారు. మత్స్యకారులు జగన్నాథపురం , ఏటిమొగ ప్రాంతానికి చెందినవారు. కాకినాడ తీరంలో గస్తీ నిర్వహిస్తున్న కోస్ట్‌గార్డు సిబ్బందికి సమాచారం చేరవేయడంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి మత్స్యకారులను కాపాడారు.
Read Also..
Read Also..
జనసేన పార్టీకి యువతే పెద్ద బలం అని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఏపీలో జనసేనకు ఆరున్నర లక్షల క్యాడర్ ఉందన్నారు. మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడారు. యువత ఆదరణ చూసే తెలంగాణలో 8 చోట్ల పోటీ చేశామన్నారు. నేనేం చేసినా దేశ సమగ్రత గురించే ఆలోచిస్తానని స్పష్టం చేశారు. కార్యకర్తల చిత్తశుద్ధి వల్లే జనసేనకు ఢిల్లీలోనూ గుర్తింపు వచ్చిందని తెలిపారు. నన్ను, నా భావజాలాన్ని నమ్మే యువత జనసేన వెంట వస్తున్నారని చెప్పారు. భావజాలం ఏమీ లేని పార్టీ వైసీపీ అని పవన్ ఎద్దేవా చేశారు.
ఈనెల 4వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ కానున్నది. సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన 4వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు కేబినెట్ సమావేశానికి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. గెలుపుపై సీఎం కేసీఆర్ ధీమాతో ఉన్నారు. రెండు రోజులు ఎలాంటి ఆందోళన లేకుండా ఉండాలని తనను కలిసిన నేతలతో సీఎం కేసీఆర్ అన్నారు. ఎగ్జాక్ట్ ఫలితాలు కళ్లముందు ఉంటాయని కేసీఆర్ వారికి వివరించారు.
Read Also..
Read Also..





Total views : 90991