తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలల్లో 70.74 శాతం ఓటింగ్ నమోదైందన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్. హైదరాబాదులో అత్యల్పంగా 46.68 శాతం ఓటింగ్ నమోదైనట్టు తెలిపారు. మునుగోడులో అత్యధికంగా 91.05 శాతం పోలింగ్ నమోదైందని పేర్కొన్నారు. అయితే, గతంలో కంటే ఈసారి పోలింగ్ 3 శాతం తక్కువగా నమోదైందని తెలిపారు. 2018 ఎన్నికల సమయంలో పోలింగ్ శాతం 73.37 అని వివరించారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువని వికాస్ రాజ్ తెలిపారు. ఇక, ఈ నెల 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని, దానికోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని వికాస్ రాజ్ చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ దాదాపు ప్రశాంతంగానే జరిగిందని, ఎక్కడా రీ పోలింగ్ కు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఈసారి ఓట్ ఫ్రమ్ హోమ్ విధానం సత్ఫలితాలను ఇచ్చిందని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.80 లక్షల మంది ఓటేశారని వెల్లడించారు. సీ విజిల్ యాప్ ద్వారా 10,132 ఫిర్యాదులు వచ్చాయని వికాస్ రాజ్ పేర్కొన్నారు.
cvr telugu
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో వేదనారాయణ స్వామిని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి దర్శించుకున్నారు. సిఐ శివ కుమార్ రెడ్డి, ఎస్ఐ ఓబయ్య, ఆలయ అర్చకులు ఎస్పీకి స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనాలు పలికారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించి పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
Read Also..
Read Also..
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ వద్ద గల కాకతీయ టెక్నో స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే స్పందించిన స్థానికులు, స్కూల్ యాజమాన్యం ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తోంది. అగ్ని ప్రమాదం సంబంధించిన గదులలో పిల్లలు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు అంటున్నారు. పాఠశాలలో ఫైర్ సేఫ్టీ మేజర్స్ లేవని, యాజమాన్యం నిర్లక్ష్యమే అగ్ని ప్రమాదానికి కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
Read Also..
Read Also..
నిన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా అనూహ్యరీతిలో నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద ఏపీ, తెలంగాణ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీనిపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సాగర్ పై ఏపీ పోలీసులు దండయాత్ర అని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు అసమర్థత వల్లే తెలంగాణ పోలీసులు ఏపీ భూభాగంలోకి వచ్చారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో తమ భూభాగంలోకి ఏపీ పోలీసులు వెళ్లారని, అది దండయాత్ర ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఏపీ హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని అంబటి విమర్శించారు. తెలంగాణలో ఒక పార్టీని గెలిపించాల్సిన అవసరం కానీ, మరో పార్టీని ఓడించాల్సిన అవసరం కానీ తమకు లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాజకీయాలపై తమకేమీ ఆసక్తి లేదని, అక్కడ ఎవరు గెలిచి అధికారంలోకి వచ్చినా తమకు సంబంధం లేదని పేర్కొన్నారు. కొందరు రెచ్చగొట్టి గందరగోళాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇది చాలా సున్నితమైన అంశం అని, గొడవలు అనవసరం అని హితవు పలికారు. సాగర్ కు సంబంధించి తమ వాటాకు మించి ఒక్క నీటి చుక్క కూడా వాడుకోలేదని అన్నారు. ఈ విషయంలో గతంలో చంద్రబాబు సర్కారు విఫలమైతే, ఇప్పుడు జగన్ సర్కారు సక్సెస్ అయిందని మంత్రి అంబటి గర్వంగా చెప్పారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. అసలీ వివాదం చంద్రబాబు హయాం నుంచే ఉందని, సాగర్ కుడి కాలువను కూడా తెలంగాణ ప్రభుత్వమే నిర్వహిస్తుండడం చట్టవిరుద్ధమని తెలిపారు. మా నీళ్లు మా రైతులకు విడుదల చేయాలంటే మేం తెలంగాణ అనుమతి తీసుకోవాలా? అని అంబటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వాటాను తాను వాడుకునే స్వేచ్ఛ ఏపీకి కావాలని, పురందేశ్వరి ఎందుకు దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాగార్జునసాగర్ డ్యామ్ అంశంలో ఏపీ ప్రభుత్వ చర్యలను ఎవరూ తప్పు పట్టలేరని, ఈ వ్యవహారంలో ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోందని విమర్శించారు. ఈ అంశాన్ని రాజకీయాలకు ముడివేసి, తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించడం తగదని అన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 13వ నెంబరు గేటు వరకు భౌగోళికంగా ఏపీకి చెందుతుందని, అంతవరకే తాము స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కృష్ణా బోర్డు నిర్ణయాల ప్రకారం తెలంగాణ వ్యవహరించడంలేదని, అందుకే ఏపీ హక్కులను కాపాడుకోవడానికే ఇలా చేయాల్సి వచ్చిందని తెలిపారు. “రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నాగార్జునసాగర్ డ్యామ్ లోని 26 గేట్లలో 13 గేట్లు ఏపీకి, మరో 13 గేట్లు తెలంగాణకు చెందుతాయి. కానీ సాగర్ ప్రాజెక్టు మొత్తాన్ని తెలంగాణ స్వాధీనం చేసుకుని నిర్వహిస్తుండడంతో ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలుగుతోంది. ఇప్పుడు సాగర్ డ్యామ్ లో ఏపీకి చెందిన భూభాగాన్ని మాత్రమే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో ఎలాంటి వివాదానికి తావులేదు” అని మంత్రి అంబటి వివరించారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని అంబేద్కర్ భవనంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అసైన్డ్ భూములకు పట్టాలు పంపిణీ చేసారు. బుచ్చి, కోవూరు మండల పరిధిలో నాలుగు గ్రామాలకు చెందిన125 మంది రైతులకు పట్టాలు పంపిణీ చేసారు. దేశానికి వెన్నెముక రైతులు అని, రైతుకు వెన్నెముక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి పట్టాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు శాశ్వత పరిష్కారం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, ఎన్నికలు వస్తున్నాయని పసుపు చొక్కాలేసుకొని పగటి వేషగాల్లందరూ వస్తున్నారు. ఏ పార్టీ ఓటుకు ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకొని ఫ్యాను గుర్తుకు ఓటు వేయండన్నారు. రాబోయే ఎన్నికల్లో గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దోచుకున్న సొమ్ము ఖర్చు పెట్టాలని చూస్తున్నారన్నారు. రాజకీయ నాయకులు కన్నా ప్రజలు తెలివైన వారని వాళ్ళు డబ్బుకు ఆశపడరని, ఎవరి వల్ల లబ్ధి పొందారో వాళ్లకే ఓటు వేస్తారన్నారు.
Read Also..
Read Also..
అగ్రరాజ్యం అమెరికాలో ఏపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు చేసిన కిరాతకాలు వెలుగులోకి వచ్చాయి. 20 ఏళ్ల విద్యార్థిని బంధించి, తీవ్రంగా హింసిస్తూ వీరు రాక్షసానందం పొందారు. దాదాపు 7 నెలల పాటు వారి రాక్షస క్రీడ కొనసాగింది. మిస్సోరి రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది.
20 ఏళ్ల బాధిత యువకుడిపై సత్తారు వెంకటేశ్ రెడ్డి, నిఖిల్, శ్రవణ్ లు తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. ఓ రెస్టారెంట్ లో బాధిత యువకుడు మరో వ్యక్తికి ఎంతో బాధగా కనిపించాడు. దీంతో, ఆ వ్యక్తి బాధిత యువకుడిని కలిసి ఏదైనా సమస్య ఉంటే తనకు ఫోన్ చేయమని ఫోన్ నెంబర్ ఇచ్చాడు. దీంతో, ఈ ముగ్గురు తనను టార్చర్ చేస్తున్న విధానాన్ని వాట్సాప్ ద్వారా అతనికి తెలియజేశాడు. ఈ దారుణం గురించి తెలుసుకున్న ఆయన చలించిపోయి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే ఆ ముగ్గురు ఉంటున్న నివాసానికి పోలీసులు వెళ్లారు. అయితే పోలీసులు లోపలకు వచ్చేందుకు ఆ ముగ్గురు నిరాకరించారు. పోలీసులు వచ్చిన విషయాన్ని గ్రహించిన బాధితుడు వెంటనే వారి వద్దకు వచ్చి తన బాధలను చెప్పుకున్నాడు. తనను రక్షించాలని కోరాడు. అనంతరం ముగ్గురుని పోలీసులు అరెస్ట్ చేశారు. మానవ అక్రమ రవాణా, హింసించడం తదితర సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్సు, ట్రక్ క్లస్టర్ యూనిట్‌ను పెప్పర్ మోషన్ సంస్ధ ఏర్పాటు చేయనున్నారు. పుంగనూరు ఎంపిడిఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ షన్మోహన్, జర్మనీకి చెందిన ప్రముఖ పెప్పర్ మోషన్ సంస్థ సీఈవో ఆండ్రియాస్ హేగర్, ప్రతినిధి బృందంచే మీడియా సమావేశం నిర్వహించారు. 4,640 కోట్లతో 800 ఎకరాల విస్తీర్ణంలో పెప్పర్ మోషన్ సంస్థ రెడీ కాబోతోందని జిల్లా కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. ఈ సమావేశానికి ఆర్డిఓ మనోజ్ కుమార్ రెడ్డి, ఉడా చైర్మన్ వెంకట్ రెడ్డి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Read Also..
Read Also..
మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం చెన్నై నుండి సుమారు 400 కి.మీ ల దూరంలో వుంది. తమిళనాడులోని మదురై పట్టణం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది మీనాక్షి దేవాలయం. మీనాక్షి దేవాలయం మదురై లో కల వేగాయి నది ఒడ్డున కలదు. మదురై పట్టణం తమిళనాడులో రెండవ పెద్ద పట్టణం. తమిళనాడు రాష్ట్ర సంస్కృతి, కళలు, సాంప్రదాయ వారసత్వాలు మొదలైనవాటికి నిలయంగా వుంటుంది. ప్రపంచంలోని అతి పురాతన నగరాలలో ఒకటైన మదురై అనేక రాజ వంశాల పాలనలు చూసింది. చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, బ్రిటిష్ పాలకులు ఎంతో మంది ఈ నగరాన్ని అభివృద్ధి పరచారు. అనేక స్మారకాలు, దేవాలయాలు తమ తమ కళాభిరుచులకు తగినట్లు నిర్మించారు. ఈ పట్టణం అనేక చారిత్రక కధలు కలిగి ఎంతో ప్రాధాన్య సంతరించుకొన్నది. భారత దేశ సంస్కృతి, కళలు, ఆధ్యాత్మికతలలో ప్రధాన పాత్ర వహించే నగరాలలో మదురై పట్టణం ఒకటి. ఇంతటి గొప్పదైన మదురై పట్టణం లోని కొన్నిపర్యాటక ఆకర్షణలు పరిశీలించండి.అలగిర్ కోవిల్ అలగిర్ కోవిల్ అనే ఈ దేవాలయం నగరానికి సుమారు 20 కి. మీ. ల దూరంలో కలదు. మదురై లో తప్పక చూడవలసిన ప్రదేశాలలో ఇది ఒకటి. ఎత్తైన గోపురాలు అనేక ప్రేమ మరియు మానవతల దృశ్యాల శిల్పాలు కలిగి ఆకర్షణీయంగా వుంటాయి. కళలకు సంస్కృతికి ఇవి నిదర్శనంగా నిలుస్తాయి. ఈ టెంపుల్ యొక్క ప్రధాన గోపురం ఎల్లపుడూ మూసి వుంచి, సంవత్సరానికి ఒక సారి తెరుస్తారు. ప్రవేశ ద్వారాన్ని మాత్రమే భక్తులు పూజిస్తారు. మీనాక్షి దేవత అసలు ఎవరు ? మీనాక్షి మాత, రాజు మలయద్వాజ పాండ్య కుమార్తె. ఆమె ఒక యజ్ఞం చేయగా అగ్ని నుండి ఆవిర్భవించినది. ఆమె పుట్టినప్పుడు మూడు స్థనాలు కలిగి వుందని, అందుకు రాజు చిన్తిన్చ గా ఆమెకు వివాహం అయిన వెంటనే, మూడవ స్థనము మాయం అవుతుందని ఆకాశవాణి పేర్కొని, ఆమెను ఒక యువ రాణి వలే కాక, ఒక రాజ కుమారుడిగా పెంచవలసినది గా కోరింది. ఆ రకంగా మాత మీనాక్షి యుద్ధ విద్యలు నేర్ప బడి పట్టాభిషేకం చేయబడి రాజ్యం అప్పగించబడినది. ఆమె అనేక యద్ధాలు గెలిచింది. చివరకు శివుడితో యుద్ధానికి సనద్ధమై, యుద్ధ భూమిలో ఆయనే తన భర్తగా గుర్తించినది. ఎత్తైన గోపురాలు ఈ టెంపుల్ గురించి పురాతన తమిళ సాహిత్యంలో కూడా పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత టెంపుల్ మాత్రం క్రీ. శ. 1623 – 1655 ల మధ్య నిర్మించబడి నట్లు చరిత్ర చెపుతోంది. ఈ దేవాలయానికి 14 గోపురాలు కలవు. ఇవి సుమారుగా 45 – 50 మీటర్ల ఎత్తులో వుంటాయి. ప్రధాన దేవత మీనాక్షి అమ్మవారు ఈ దేవాలయంలో ప్రధాన దేవత మీనాక్షి అమ్మవారు. ఈమెను పార్వతి అవతారంగాను ఈమె సహచరుడైన సుందరేస్వరుడిని శివుడిగాను కొలుస్తారు. సుమారు 2,500 సంవత్సరాల కిందటిదిగా చెప్పబడే మదురై పట్టణానికి ఈ దేవాలయం ప్రధానమైనది.
Read Also..
Read Also..
ఎంతో ఉత్కంఠను రేకెత్తించిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల తలరాతలు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. మరోవైపు ఏ పార్టీ గెలవబోతోందనే విషయంలపై పలు ఎగ్జిట్ పోల్స్ వాటి అంచనాలను వెల్లడించాయి. మరోవైపు గత తెలంగాణ ఎన్నికల సమయంలో ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. 2018లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ఈ సర్వే అప్పట్లో వెల్లడించింది.
బీఆర్ఎస్ కు 62 నుంచి 70 సీట్లు వస్తాయని అప్పట్లో ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. చెప్పినట్టుగానే బీఆర్ఎస్ అధికారాన్ని కైవసం చేసుకుంది. 88 స్థానాల్లో గెలుపొంది మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ 63 నుంచి 79 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. బీఆర్ఎస్ 31 నుంచి 47 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. ఈ అంచనాలు ఎంత వరకు నిజమవుతాయో వేచి చూడాలి.
కృష్ణా జలాల విషయంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని సీపీఎం జాతీయ నేత బీవీ రాఘవులు సూచించారు. నెల్లూరు నగరంలో పర్యటించిన ఆయన జిల్లా సీపీఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశంలో బీజీపీ మళ్లీ అధికారం చేపట్టకుండా చేయడమే తమ పార్టీ విధానమని అన్నారు. సామాజిక సాధికారిత పేరిట బస్సు యాత్ర చేస్తున్న వైకాపా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను రద్దు చేసిన కేంద్రాన్ని ఎందుకు నిలదీయడంలేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రశ్నించారు. సబ్ ప్లాన్‌ను కేంద్రం రద్దు చేయడం వల్ల రాష్ట్రాలకు రావాల్సిన వాటా తగ్గిందన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు.






Total views : 90753