Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh కాకినాడ తీరంలో బోటు అగ్నిప్రమాదం

కాకినాడ తీరంలో బోటు అగ్నిప్రమాదం

by Satya
Boat fire in Kakinada coast

కాకినాడ సముద్ర తీరంలో ఓ బోటులో జరిగిన అగ్నిప్రమాదంలో రూ. 80 లక్షల ఆస్తినష్టం సంభవించింది. వారం రోజుల క్రితం చేపలవేటకు సముద్రంలోకి వెళ్లిన బోటు తుపాను హెచ్చరికల నేపథ్యంలో మచిలీపట్టణానికి తిరుగుపయనమైంది. మరో నాలుగు గంటల్లో కాకినాడ చేరుకుంటుందనగా తెల్లవారుజామున ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఆ వెంటనే బోటులో ఉన్న సిలిండర్లు కూడా పెద్ద శబ్దంతో పేలిపోయాయి. అప్రమత్తమైన మత్స్యకారులు సముద్రంలోకి దూకేశారు. బోటు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న తీర రక్షక దళం సిబ్బంది రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. బోటులోని 12 మంది జాలర్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రమాదం కారణంగా దాదాపు రూ. 80 లక్షల ఆస్తినష్టం సంభవించినట్టు మత్స్యకారులు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

014165
Total views : 79342

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.