సైబర్ నేరాలు, డీప్ ఫేక్ పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ‘మానవ హక్కుల దినోత్సవం’ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సవాళ్లు పొంచిఉన్నాయని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ త్వరగా వ్యాప్తి చెందుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ నేరాలు, డీప్ ఫేక్, ప్రజల గోప్యతకు భంగం వంటి విషయాలు మనకు కొత్త ముప్పుగా మారాయన్నారు. వీటిని నివారించాలంటే ప్రజల హక్కులను, గౌరవాన్ని కాపాడే డిజిటల్ వాతావరణాన్ని కల్పించడం చాలా ముఖ్యమని అన్నారు. భారత్ అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిచేందుకు తీవ్రంగా కృషి చేస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలతో పాటు వాతావరణంలో వచ్చే వివిధ రకాల మార్పులను ఎదుర్కొంటోందని ముర్ము అన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- నీట్ పేపర్ లీక్‌పై పోరాడుతున్న సోనమ్ వాంగ్‌చుక్.సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన వైద్య చర్యలన్నీ తీసుకోవాలని ప్రభుత్వానికి…
- పాకిస్తాన్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బన్ను జిల్లాలో ఉన్న మిర్యాన్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ పరిసరాలు ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందగా..డజన్ల సంఖ్యలో భద్రతా సిబ్బంది…
- విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.విశాఖపట్నంలో సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో పెను ప్రమాదం తప్పింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తాపడగా… ఏడుగురు మత్స్యకారులు మృత్యువు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, బోటు, వల పూర్తిగా…
- రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా.రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు.మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కేటీఆర్.. ప్రస్తుతం…
- డిసెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ “ఫౌజీ”.ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్న మూవీ రెబల్ స్టార్ ప్రభాస్ “ఫౌజీ”. ఈ క్రేజీ మూవీ రిలీజ్ డేట్ ను ఈ రోజు మేకర్స్ అనౌన్స్ చేశారు. అజాతపర్వం ముగిసింది, ది రెబలియన్ ప్రారంభమైంది అంటూ డిసెంబర్ 3న ఫౌజీ సినిమాను…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 212366