కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ అటవీ డివిజన్ పరిధిలోని ధరిగాం అటవీ ప్రాంతంలో గల మామిడి గుట్ట వద్ద సంవత్సరం నర వయసు గల పులి మృతి చెందినట్టు వైల్డ్ లైఫ్ అధికారి శాంతారామ్ పేర్కొన్నారు. తమ సిబ్బంది పెట్రోలింగ్ లో భాగంగా ట్రాప్ కెమెరాలను పరిశీలించేందుకు వెళ్లగా మృతి చెందిన పులి కాళేబరంను గుర్తించి సమాచారం ఇచ్చారని అన్నారు. స్థానిక అటవీశాఖ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి అందించిన సమాచారం మేరకు తమ బృందంతో సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించడం జరిగిందని అన్నారు. ఓ పశువు కాళేబరాన్ని తినేందుకు రెండు పులులు పరస్పరం దాడి చేసుకోగా ఒక పులి మృతి చెందినట్టు గాయాల ద్వారా తెలుస్తుందని ఎలాంటి విష ప్రయోగం గాని వేటికోసం గాని చంపినట్టు ఆనవాళ్లు లేవని అన్నారు. పులి శరీర బాగాల్లోని అవయవాలను పోస్ట్ మోర్టం ద్వారా సేకరించామని తెలిపారు. మృతి చెందిన పులి వయస్సు సుమారు పదిహేడు నెలలు ఉంటుందని అన్నారు.
devotional news
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ వినియోగదారులకి షాక్ ఇచ్చింది. ఓలా ఎస్1 ప్రో ధరను పెంచింది. ఇప్పుడు ఈ-స్కూటర్‌ను కొనుగోలు చేయడానికి మరో 10 వేలు ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు FAME II సబ్సిడీని తొలగించిన తర్వాత దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.29 లక్షలుగా ఉండేది. ఇప్పుడు అది రూ. 1.39 లక్షలకు పెరిగింది.
Ola S1 ప్రో స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే.. ఈ కొత్త స్కూటర్ పది రంగులలో వస్తుంది. Ola S1 ప్రో అనేది కంపెనీ S1 మోడల్ ప్రీమియం వేరియంట్. S1 ప్రో మోటార్ 5500 W శక్తిని ఇస్తుంది. వినియోగదారులు S1 ప్రో రెండు చక్రాలలో డిస్క్ బ్రేక్‌లతో వస్తుంది. S1 ప్రో గరిష్ట వేగం 115kmph అని కంపెనీ పేర్కొంది. Ola S1 ప్రో ఈ-స్కూటర్ క్రూయిజ్ కంట్రోల్, హిల్-హోల్డ్ సిస్టమ్, వాయిస్ అసిస్ట్ అంటూ మూడు రైడింగ్ మోడ్లతో వస్తుంది. S1 ప్రో బ్యాటరీ ఆరున్నర గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.
ఓలా ఎస్1 ప్రో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈ-స్కూటర్ అని అందరికి తెలిసిందే. మార్చిలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను పెంచాలని ఓలా ఎలక్ట్రిక్ సీఈవో సూచించారు. దీని తర్వాత Ola S1 ప్రో బుకింగ్‌ను పునఃప్రారంభిస్తున్నప్పుడు కంపెనీ ధరను 10 వేల రూపాయలు పెంచింది. అదే సమయంలో Ola త్వరలో MoveOS 2 OS స్కూటర్లని విడుదల చేయనుంది. ఈ ఏడాది జనవరిలో బుక్ చేసుకున్న వినియోగదారులకు కూడా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కంపెనీ నిర్ణయం ప్రకారం జనవరిలో బుకింగ్ చేసుకునే కస్టమర్లు కూడా కొత్త ధరను చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో తాజా బుకింగ్ S1 ప్రో కోసం మాత్రమే ఓపెన్ చేశారు.
ప్రపంచం మొత్తం నుండి లక్షలాది మంది భక్తులను ఆకర్షించే పవిత్ర స్థలం లార్డ్ రాముడు (శ్రీ మహావిష్ణువు ఏడవ అవతారం) నివాసం. దక్షిణ దిశలో ప్రవహించే పవిత్రమైన గోదావరి ఈ ప్రదేశంలో ప్రసిద్ది చెందిన భద్రాగిరి మేరు మరియు మెనాకా యొక్క వంశ పితామహుడు. ఇతిహాసం ప్రకారం, ఈ మందిరం యొక్క ప్రాముఖ్యత రామాయణ కాలం నాటిది. రామాయణ కాలంలో దండకారణ్యంలో ఈ పొరుగింటి కొండ ప్రదేశం ఉనికిలో ఉంది. ఇక్కడ రాముడు తన భార్య సీత మరియు సోదరుడు లక్ష్మణుడు వారి వానావాసా మరియు పార్శ్శలాల గడిపారు. ఈ ఆలయ ప్రదేశం సమీపంలో కూడా. ఇది ఈ మందిర్ ప్రదేశంలో ఉంది, రామావతారానికి పూర్వం భగవాన్ మహావిష్ణు, భగవాన్ శ్రీ రామచంద్ర మూర్తి యొక్క ప్రార్థన కోసం యుగస్ ద్వారా తన తపతులను కొనసాగించిన అతని భక్త భద్ర కు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి రామగా మళ్ళీ తనకు ప్రత్యక్షమయ్యాడు.
నెల్లూరు జిల్లా, ఉదయగిరి బెల్ట్ దుకాణాలపై పోలీసులు దాడులు. ఉదయగిరి పట్టణంలోని గండిపాలెం మార్గం వైపు ఉన్న పెట్రోల్ బంక్ ఎదురుగా అనుమతి లేకుండా బెల్ట్ దుకాణాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 51 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. మద్యం విక్రయిస్తున్న ఇద్దరు మహిళలు కూడా అదుపులో తీసుకున్నారు.
కాకినాడ జిల్లా, అంగన్వాడీల పై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రకటించిన మేము భయపడేది లేదు ఆనాడు తమిళనాడు ప్రభుత్వం ఎస్మా ప్రకటించింది ఆ ప్రభుత్వం కనుమరుగయ్యింది. త్వరలో జగన్మోహన్ రెడ్డి అదే పరిస్థితి ఎదుర్కొంటాడు. కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ లు నైట్ కూడా దిక్షలు నిర్వహించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతాం అని ప్రభుత్వానికి అంగన్వాడీ లు హెచ్చరిస్తున్నారు.
భార్యతో కలిసి కన్న తల్లిని హత్య చేసిన దుర్మార్గుడు. బంధువులకు అనుమానం రావడంతో బయటపడిన విషయం. ఆస్తి అమ్మడానికి అడ్డు వస్తుందని కన్నతల్లినే భార్యతో కలిసి మట్టు పెట్టాడు ఓ కిరాతకుడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ వెంకట్ రెడ్డి నగర్ లో ఆలస్యంగా వెలుగు చూసింది.
వెంకట్ రెడ్డి నగర్ ప్రాంతానికి చెందిన కసావేణి సుగుణమ్మ భర్త కొన్నాళ్ల క్రితం చనిపోయాడు ఆమెకు కుమారుడు అనిల్ ,కోడలు తిరుమల ఉన్నారు
వీరి ఇద్దరు పిల్లలు హాస్టల్లో చదువుకుంటున్నారు, భర్త చనిపోయిన తర్వాత ఇంటిని సుగుణమ్మ తన పేరు మీదకు మార్చుకుంది కొడుకు జులాయి గా తిరగడంతో అప్పులు పెరిగాయి, అప్పులు తీర్చేందుకు ఇల్లు అమ్మాలని కొడుకు, కోడలు కొంతకాలంగా సుగుణమ్మ పై ఒత్తిడి చేస్తున్నారు అయితే సుగుణమ్మ ససేమీరా అనడంతో కోడలుతిరుమల పుట్టింటికి వెళ్ళింది ఇల్లు అమ్మాలంటే ఎలాగైనా తల్లి అడ్డు తొలగించుకోవాలని అనిల్ నిర్ణయించుకున్నాడు ఈ నెల నాలుగవ తేదీ అర్ధరాత్రి తిరుమల మరో వ్యక్తి శివతో కలిసి వెంకటరెడ్డి నగర్ వచ్చింది అదే రాత్రి సుగుణమ్మ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు, అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రలో ఉన్న సుగుణమ్మ ముఖంపై దిండు అదిమి గొంతు చుట్టి హత్య చేశారు అమ్మ నిద్రలోనే చనిపోయిందని అనిల్ బంధువులతో బుకాయించారు. మృతదేహంపై గాయాలు ఉండడంతో బయటపడ్డ అసలు నిజం. మరణ వార్త విని సుగుణమ్మ తల్లి దాసరి ఐలమ్మ సహా బంధువులు వరంగల్ ప్రాంతం నుంచి భారీగా తరలివచ్చారు 5వ తేదీన అంత్యక్రియలకు సన్న హాలు చేశారు సుగుణమ్మ మృతదేహానికి స్నానం చేయిస్తుండగా మెడమీద గాయాలు కనిపించాయి దీంతో అనుమానం వచ్చి బంధువులు అనీలు నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు దీంతో పోలీసులు కొడుకు, కోడలిని అదుపులోకి తీసుకొని విచారించడంతో విషయం బయటపడింది. ఆస్తి కోసం అమ్మను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుని భార్య ఆమెతో వచ్చిన శివతో కలిసి హత్య చేసినట్లు అనిల్ పోలీసులకు తెలిపాడు దీంతో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
నెల్లూరు జిల్లా, గుడ్లూరు (మం) మాచర్ల వద్ద జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం. లారీని ఢీ కొట్టిన TSRTC బస్సు ఒకరు మృతి, 7గురి పరిస్థితి విషమం. మృతి చెందిన వ్యక్తి బస్ డ్రైవర్ వినోద్ గా గుర్తింపు. మిర్యాలగూడ నుండి తిరుపతి వెళ్తున్న TSRTC బస్సు. క్షతగాత్రులను కావలి ఏరియా వైద్యశాల లో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలింపు. ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్న పోలీసులు.
తిరుపతి, ఉమ్మడి నెల్లూరు జిల్లా, గూడూరు జిల్లాలో పలుచోట్ల ఉద్రిక్తత అర్ధరాత్రి మున్సిపల్ కార్మికుల బైటాయింపు. కార్మికులు సమ్మెలో ఉండగా పర్మనెంట్, ప్రైవేట్ కార్మికులతో అర్ధరాత్రి చెత్త తీపిస్తున్న అధికారులు. అడ్డుకున్న మున్సిపల్ పారిశుధ్య ఔట్ సోర్సింగ్ సిబ్బంది. అధికారులు, పోలీసులుతో పారిశుద్ధ్య కార్మికుల వాగ్వాదం. నెల్లూరు నగరంలోనూ ఇదే పరిస్థితి. రోజు రోజుకూ ఉధృతం అవుతున్న కార్మికుల సమ్మె.
తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు శనివారం సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీ తిరుమలనంబి ఆలయం చెంతకు వేంచేపు చేశారు. ప్రతి ఏడాదీ తన్నీరముదు ఉత్సవం మరుసటిరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ తిరుమలనంబి వారికి మేల్ చాట్ శేషవస్త్రాన్ని సమర్పించారు. శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు, శ్రీ వేంకటేశ్వరుని సేవలో తన జీవితాన్ని అర్పించిన మహనీయుడు శ్రీతిరుమలనంబి. వీరు సాక్షాత్తు శ్రీ భగవత్ రామానుజాచార్యులవారికి మేనమామ. ఈ కార్యక్రమంలో తిరుమల జీయంగార్లు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో గత 11 రోజులుగా కొనసాగుతున్న చండీ సహిత అతిరుద్ర మహా యజ్ఞం నేటి తో దిగ్విజయంగా ముగిసింది. రుత్వికుల మంత్రోచ్చారణనలతో శ్రీ వాసుదేవానంద స్వామి సమక్షంలో పూర్ణాహుతి కార్యక్రమం జయప్రదంగా పూర్తయింది. సి వి అర్ గ్రూప్ చైర్మన్ చలసాని వెంకటేశ్వరరావు దంపతులు యజ్ఞంలో పాల్గొన్నారు. లోకకళ్యాణార్థం నిర్వహించిన ఈ మహాయజ్ఞంలో భాగస్వామ్యం కావటం మహా భాగ్యమని పండితులు తెలిపారు.