అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. సమ్మె పై ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించిన ప్రభుత్వం. అత్యవసర సర్వీస్ లు క్రిందకు తీసుకొస్తూ GO జారీ. ఆరు నెలలు పాటు సమ్మె నిషేధం. అత్యవసర సర్వీస్ లు క్రిందకు రాని అంగన్వాడీల సేవలు. పౌష్టికాహారం సరఫరా చేసే ప్రక్రియ దృష్యా అత్యవసర సర్వీస్ ల క్రిందకు తీసుకువచ్చిన ప్రభుత్వం. GO నంబర్ 2 ను విడుదల చేసిన ప్రభుత్వం.
devotional news
మందస మండలం రట్టిలో ఎలుగు బంటి సంచారంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. రట్టి గ్రామానికి సమీపంలోని తోటలో అలజడి చేసిన ఎలుగుబంటిని చూసిన గ్రామస్తులు భయబ్రాంతులకు గురయ్యారు. రట్టిలో ఆహార అన్వేషణ కోసం ఎలుగుబంటి పుట్టను త్రవ్వి హల్ చల్ చేసింది. అటు ఇటు తిరుగుతూ కాసేపు చక్కర్లు కొట్టిన ఎలుగుబంటి నెమ్మదిగా జారుకుని సమీపంలోని జీడి తోటల్లోకి పారిపోయింది. రట్టి సమీపంలోని కొండల నుంచి ఎలుగు బంట్లు గ్రామాల్లోకి చొరబడి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అటవీశాఖ అధికారులు స్పందించి భల్లూకాలు జనవాసాల్లోకి రాకుండా శాశ్వత చర్యలు తీసుకొని ఎలుగుబంట్ల బారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
గుంటూరు ఎంపీ ఎన్నికల బరిలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు నియామకం చేసేందుకు వైసీపీ కసరత్తు. ఎంపీ మార్పు పై ఆసక్తి చూపని నరసరావు పేట పార్లమెంట్ ఎమ్మెల్యేలు. నరసరావు పేట ఎంపీ స్థానాన్ని బిసి వర్గాలకి ఇస్తే అన్ని నియోజకవర్గాల్లో పట్టు సాధించవచ్చని వైసీపీ అధిష్టానం యోచన. సీఎం జగన్ మోహన్ రెడ్డి అపాయింట్ మెంట్ కోరిన ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు. నరసరావు పేట పార్లమెంట్ లో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు. గుంటూరు పార్లమెంట్ కి వస్తే తాడికొండ, మంగళగిరి లాంటి నియోజకవర్గాల్లో అసంతృప్తి సెగ తగులుతుందని ఎంపీ ఆలోచన. సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు ఎలాంటి మార్పు జరుగుతుందా అని వైసీపీ కింది స్థాయి నేతల్లో ఆసక్తి నెలకొంది.
కేశినేని రాజీనామా నేపద్యంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన PVP. ట్విట్టర్ లో నాని రాజీనామా పోస్ట్ ను షేర్ చేస్తూ విమర్శలు చేసిన పీవీపీ. కేశినేని నాని పిప్పళ్ల బస్తా, బెజవాడకే గుదిబండలా తయారయ్యావు. ఏదో మచ్చేసుకుని పుట్టావు, పార్టీలో పదేళ్లు బండి కొనసాగించావు. బ్యాంకులను బాదావు, జనాలని ఉద్యోగులని పీల్చి పిప్పి చేశావు. ఇకనైనా ఒట్టిమాటలు కట్టి పెట్టి, అన్ని మూసుకొని మూలపడుండు పుండాకోర్.!! అంటూ తీవ్ర స్దాయిలో విమర్శలు గుప్పించిన పీవీపీ. 2019 ఎన్నికల్లో నానిపై పోటి చేసిన పీవీపీ. వైసీపిలో పీవీపి కొనసాగనప్పటికి ఐదేళ్లుగా నాని విషయంలో మాత్రం విమర్శలు గుప్పిస్తునే ఉన్నారు.
అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం చాలా ప్రసిద్ధమైంది. ఈ ఆలయం తూర్పు గోదావరి జిల్లా, అన్నవరంలో రత్నగిరి కొండమీద ఉంది. రత్నగిరి సత్రం, దేవస్థానం వారి ఫలహార శాల దాటగానే ప్రవేశద్వారం కనిపిస్తుంది. అందులోంచి కొంతదూరం నడిస్తే సత్యనారాయణ స్వామి దేవాలయం దర్శనమిస్తుంది. సత్యనారాయణ స్వామి దేవాలయ ముఖద్వారం దగ్గర గోడ మీద ”హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక స్వరూప” అంటూ సాగిన శ్లోకాన్ని భక్తులందరూ తప్పక పఠిస్తారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి కుడివైపున రామాలయం, విశ్రాంతి మందిరం, ఎడమవైపున కళ్యాణ మండపం ఉన్నాయి. రామాలయం పక్కనే వ్రతాల మండపాలు, భోజనశాల ఉన్నాయి. అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు కనుక, గుడి చుట్టూ అనేక వ్రత మండపాలు ఉన్నాయి. అలాగే గుడి వెనుక గుట్టమీద అనేక కాటేజ్ లు ఉన్నాయి. కొత్తగా పెళ్ళయిన జంటలు తప్పక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం హిందూ ఆచారం. ఇళ్ళలో వ్రతం చేసుకోవడం సంగతి అలా ఉంచి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో వ్రతం చేసుకోవడం మరీ శ్రేష్టమని భావిస్తారు. కొందరు అలా చేసుకోవాలని మొక్కుకుంటారు కూడా. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రవేశించగానే ప్రశాంతత చేకూరుతుంది అనేది భక్తుల అనుభవం. ఆలయ ముఖద్వారం, స్వామివారి విగ్రహం, గాలి గోపురం దేనికదే మహా సుందరంగా ఉంటుంది. స్థల పురాణాన్ని స్థల పురాణాన్ని అనుసరించింది. పూర్వం అనరాజు రాజ్యాన్ని ఓ బలవంతుడైన రాజు ఆక్రమించుకున్నాడు. దాంతో అనరాజు రాజ్యాన్ని కోల్పోయిన దుఃఖంతో అడవికి వెళ్ళిపోయాడు. అలా తిరుగుతూ రత్నగిరి కొండను చేరాడు. అక్కడే ఉంటూ సత్యనారాయణ స్వామిని ఆరాధించసాగాడు. అనరాజు భక్తి భావనకు స్వామి సంతోషించాడు. రాజుకు కలలో కనిపించి బాధ పడకు, నీ రాజ్యం నీకు దక్కుతుంది. అని చెప్పి, సత్యనారాయణ స్వామి రత్నగిరి పర్వతారణ్యాల్లోకి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి ఉండూరు సంస్థాన అధిపతి ఒక కల కన్నాడు. ”రత్నగిరి కొండపై సత్యనారాయణ స్వామి ఆలయం కట్టించమని, దానివల్ల మేలు జరుగుతుందని” కల సారాంశం. ఆ అధికారి తనకు ఆ కల రావడంలో ఆంతర్యం ఏమిటా అనుకుని, వెంటనే ప్రయాణమై రత్నగిరి కొండ మీదికి వెళ్ళాడు. ఆశ్చర్యకరంగా కొండమీద అంకుడు చెట్టు కింద సత్యనారాయణ స్వామి వారి విగ్రహం దర్సనమిచ్చింది. ఇక ఉండూరు సంస్థాన అధిపతి తాత్సారం చేయలేదు. వెంటనే రత్నగిరి కొండమీద ఆలయం కట్టించాడు. తనకు లభించిన విగ్రహాన్ని గుడిలో ప్రతిష్టించాడు. అదే అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న వారి కోరికలు, వెంటనే నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.
Read Also..
Read Also..
అమరావతి, గుంటూరు – విజయవాడ వారధిపై హిట్ అండ్ రన్. స్కూటీ పై వెళ్తున్న మహిళలను ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం. గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదంలో ఇద్దరు మహిళలు స్పాట్ డెడ్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కృష్ణ లంక పోలీసులు. గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన మహిళలుగా గుర్తింపు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీసులు. గుంటూరు నుండి విజయవాడ వస్తుండగా ప్రమాదం. ఢీ కొట్టిన వాహనం కోసం సీసి కెమెరాలను జల్లెడ పడుతున్న పోలీసులు.
కడప జిల్లా, కాజీపేటలో 300 కుటుంబాలు వైకాపా నుంచి తెలుగుదేశం లోకి చేరిక. వైకాపా ఎంపీటీసీ చంద్ర భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మైదుకూరు టీడీపీ ఇన్ ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో టీడీపీలోకి చేరికలు. సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ అభివృద్ధి కావాలని సొంత పార్టీ ఎంపీటీసీ అడిగితె సస్పెండ్ చేసిన ఘనత వైకాపా కు చెందుతుంది. వైకాపా ఎంపీటీసీనే చేరుతున్నారంటే వారి అరాచకం అర్ధం అవుతుంది. రాష్ట్రానికి అభివృద్ధి కావాలి సంక్షేమం కాదు. అభివృద్ధి లేకుండా సంక్షేమం పనికిరాదు. అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని రాత్రికి రాత్రే అరెస్టు చేస్తారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోంది. నియంత పాలన ఎక్కువ రోజులు ఉండదు. మైదుకూరు శాసనసభ్యులు రఘురామిరెడ్డి కి దోచుకోవడం తప్పితే అభివృద్ధి చేయడం తెలియదు. శాసనసభ్యుడు రఘురామిరెడ్డికి సంక్షేమానికి, అభివృద్ధికి తేడా కూడా తెలియదు. తెలుగుదేశంతోనే అభివృద్ధి సాధ్యం అని వైకాపా నుంచి తెలుగుదేశం లోకి చేరుతున్నారు. తెలుగుదేశం లోకి స్వచ్ఛంగా చేరుతున్న వైసీపీ పార్టీ అధికార నాయకులు. వైసీపీ పాలనలో కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు. కాజీపేట మండలం అభివృద్ధిలో వెనకబడి ఉంది అని వెల్లడించారు.
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని పేదలు, అట్టడుగువర్గాలకు కరుణతో సేవ చేయాలనే ఆయన సందేశం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ అన్నారు. బీజేపీ ఉంగుటూరు అసెంబ్లీ కన్వీనర్ శరణాల మాలతీరాణి ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో ఏర్పాటుచేసిన భారతీయ జనసంఘ్ సహవ్యవస్థాపకుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని శుక్రవారం రాత్రి కేంద్రమంత్రి భారతి ప్రవీణ్ పవార్ ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిశోర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ రూపొందించిన అంత్యోదయ సిద్ధాంతాన్ని ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ సందర్బంగా కేంద్రమంత్రి భారతీ పవర్ తెలుగు ప్రసంగం ఆకట్టుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ విగ్రహాన్ని చెక్కిన వారు, ఏర్పాటు చేసిన వారు, ఆవిష్కరించిన వారు మహిళలే కావడం గర్వంగా ఉందన్నారు. సర్పంచి రాంధే లక్ష్మీసునీత, మహిళామోర్చా రాష్ట్రాధ్యక్షురాలు నిర్మలా కుమారి, మైనార్టీమోర్చా రాష్ట్రాధ్యక్షుడు బాజీ, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. ఈకార్యక్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని పొత్తులపై వివరాలు కోరగా అతిత్వరలో వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
విజయవాడ, టీడీపీకి గుడ్ బై చెప్పిన విజయవాడ ఎంపీ కేశినేని నాని. త్వరలో టీడీపీకి రాజీనామా చేయనున్న ఎంపీ కేశినేని నాని. ఫేస్ బుక్ పోస్ట్, ట్విట్టర్ ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించిన కేశినేని నాని. తెలుగుదేశం పార్టీకి నా అవసరం లేదని చంద్రబాబు భావించిన తర్వాత కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని నా భావన. త్వరలో ఢిల్లీ వెళ్లి లోక్ సభ స్పీకర్ ను కలిసి లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా. ఆ మరుక్షణమే టీడీపీకి రాజీనామా చేస్తా.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ లో కొలువుదీరిన వాసవి మాత అమ్మవారికి 3,33,333/- రూపాయల కరెన్సీతో ప్రత్యేక అలంకరణ చేసిన ఆర్యవైశ్య సంఘ సమాజం.. అనంతరం మహిళలు కుంకుమ పూజలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని వేడుకున్నారు. ప్రతి రోజు ఉదయం సాయంత్రం అమ్మవారికి వివిధ రకాలుగా పూజలందిస్తూ, అలంకరణలతో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ, సంఘ సభ్యులు ముందుకు సాగారు. మహిళలు అమ్మవారికి ప్రీతి ప్రదమైన నైవేద్యాలు సమర్పిస్తూ, మంగళ హారతులతో భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ, భక్తులను అలరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు..