వాసుదేవానంద నగర్ శ్రీ దండాయుధ పాణి స్వామి వారి దేవస్థానం లో నిర్వహిస్తున్న చండీ సహిత అతిరుద్ర మహా యజ్ఞంలో సి వి ఆర్ గ్రూప్ చైర్మన్ చలసాని వెంకటేశ్వరరావు ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండితులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వాసుదేవానంద స్వామి ఆశీస్సులు తీసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరావు అనంతరం శ్రీ దండాయుధ పాణి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం లేదని, పలనిలో ఉన్న ఆలయాన్ని మించి తెలుగు గడ్డపై మైలవరం శ్రీ వాసుదేవానంద నగర్ లో నిర్మించడం చాలా ఆనందదాయకమని స్వామివారి ఆలయంలో జరిగే చండీ సహిత అతిరుద్ర మహా యజ్ఞం చూడడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఉభయ తెలుగు ప్రజలకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.
devotional news
టికెట్ల కేటాయింపులో అధిష్టానం నిర్ణయం మేరకూ అందరూ కలిసి పని చేస్తామని, ఎవరికి అసంతృప్తి లేదని ఏపీ మంత్రి మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి మెరుగు నాగార్జున స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఆలయ వెలుపలకు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల దృష్ట్యా టికెట్లు కేటాయింపులో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, అయితే అధిష్టానం నిర్ణయం మేరకూ అందరు కలిసి పని చేస్తామని, రాబోయే ఎన్నికల్లో తానూ పోటీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. చంద్రబాబు, అతని టీం ఎందుకు భయపడుతుందో అర్ధం కావడం లేదని, మాతో చంద్రబాబుకు ఏం పనో అర్ధం కావడం లేదని, చంద్రబాబు తన పార్టీ వ్యవహారాలు చూసుకుంటే మంచిదన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కాకుండా కుప్పంలో ఎందుకు పోటీ చేస్తున్నావో, లోకేష్ ఎందుకు మంగళగిరిలో పోటీ చేస్తున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో సామాజిక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని, చంద్రబాబు హామీ ఇచ్చిన నెరవేర్చక పోవడం వల్లే ప్రజల్లోకి వెళ్ళలేక పోతున్నారని, పవన్ ను మళ్ళీ కలిసి చంద్రబాబు ఎన్నికల్లోకి వెళ్తున్నారే గానీ మాకు ఏ పార్టీతో పని లేదని, మంత్రి గుడివాడ అమర్నాథ్ వేరే చోట పని చేయబోతున్నారే గానీ, మా పార్టీలో అమర్నాథ్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అని ఏపి మంత్రి మెరుగు నాగార్జున తెలియజేశారు.
తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి జాహ్నవి కపూర్ దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటి జాహ్నవి కపూర్, సినీ నటి మహేశ్వరీలు కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఆలయ వెలుపలకు వచ్చిన జాహ్నవీ కపూర్ తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు.
సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు తిరుమలలో దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులతో ధార్మిక సంస్థలతో సదస్సు నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన డయల్ యువర్ ఈవో లో పాల్గోని భక్తులు ఫోన్ కాల్ లో అడిగిన ప్రశ్నలకు లైవ్ లో సమాధానం ఇచ్చి వారి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ.. డిసెంబరు నెలలో 19.16 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం జరిగిందని, హుండీ ద్వారా 116.73 కోట్ల రూపాయలు కానుకలు టిటిడికి లభించాయన్నారు. మొత్తం ఒక కోటి 46 వేల లడ్డూలను భక్తులకు విక్రయించామని, 40.77 లక్షల మంది భక్తులు అన్నప్రసాదంను స్వీకరించగా, 6.87 లక్షల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించినట్లు టిటిడి ఈవో వెల్లడించారు. అయోధ్యలో 22వ తేదీ శ్రీ రామచంద్రులవారి విగ్రహ ప్రతిష్ట, శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు గల ఒక లక్ష లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తిరుపతిలోని అలిపిరి సప్తగోప్రదక్షిణ మందిరంలో జరుగుతున్న శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొనే భక్తులు తిరుమలలో రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ను క్యూ లైన్లో నిలబడి కొనుగోలు చేసి శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నామని, ధనుర్మాస కార్యక్రమాల ముగింపులో భాగంగా జనవరి 15వ తేదీ తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని పేరేడ్ మైదానంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు ‘‘శ్రీ గోదా కళ్యాణం’’ వైభవంగా నిర్వహిస్తామన్నారు. శ్రీవారి భక్తులు టిటిడి పేరిట ఉన్న నకిలీ వెబ్సైట్ల కారణంగా మోసపోకూడదనే ఉద్దేశంతో టిటిడి అధికారిక వెబ్సైట్ ttdevasthanams.ap.gov.in లో మాత్రమే ఆర్జితసేవలు, దర్శనం, విరాళాలు, వసతి బుక్ చేసుకోవాలని భక్తులను టిటిడి ఈవో కోరారు. తిరుమలలో జనవరి 16వ తేదీ కనుమ పండుగ సందర్భంగా శ్రీవారి పార్వేట ఉత్సవం, జనవరి 25న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి వైభవంగా నిర్వహిస్తామని టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలియజేశారు.
ఏ ఇంట్లో అయితే గొడవలు లేకుండా సంతోషంగా ఉంటారో ఆ ఇంట్లో ఉండేందుకు లక్ష్మీదేవి ఇష్టపడుతుంది. అలాంటి ఇంటికే లక్ష్మీదేవి వస్తుంది. అయితే ఇలా ఒక ఇంట్లోకి వచ్చే ముందు ఖచ్చితంగా చెప్పే వస్తుంది. దానికోసం ముందుగానే కొన్ని సంకేతాలు పంపిస్తుంది. వాటి ఆధారంగా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో నల్లచీమలు ఉంటే శుభసూచికంగా భావించవచ్చు. నోటిలో బియ్యం లేదా ఇతరత్రా ధాన్యాన్ని తీసుకెళ్లడం గమనిస్తే మహాలక్ష్మి ఇంట్లోకి రావడానికి సిద్ధంగా ఉందని అర్థం. అదే ఇంట్లో ఎర్ర చీమలు ఉంటే మంచిది కాదు. దీనివల్ల అప్పు భారం పెరిగే అవకాశం ఉంటుంది. ఇంట్లో పక్షి గూడు కట్టుకోవడం కూడా లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం. అలాగే మన ఇంటి ఆవరణలో కోయిల కూత కూడా ధనానికి శుభసూచికంగా చెబుతారు. సాయంత్రం పూట ఆగ్నేయ దిశగా కోకిల కూత వినిపిస్తే మంచిది. అదే ఉదయం పూట కూత వినిపిస్తే నష్టం జరుగుతుంది. బల్లి మీద పడితే అశుభమని భావిస్తారు. కానీ బల్లి మీ కుడి చేతి మీద పడి త్వరత్వరగా పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే ఆర్థికంగా పురోగతి సాధిస్తారని పండితులు చెబుతున్నారు. ఒకే చోట మూడు బల్లులు కనిపించడం కూడా లక్ష్మీదేవి రాకకు సంకేతం. తులసి చెట్టు దగ్గర బల్లి కనబడితే కష్టాలు తొలగిపోతాయి. అయితే ఒకటి కంటే ఎక్కువ బల్లులు తులసి చెట్టు దగ్గర కనిపిస్తే ధన నష్టం జరుగుతుంది. కుడి చేతిలో ఎప్పుడూ దురదగా ఉండటం కూడా ధనలక్ష్మీ వచ్చే ముందు కనిపించే సంకేతమే అని పెద్దలు చెబుతున్నారు. ఇంట్లో రెండు ముఖాల పాము కనిపించడం కూడా శుభసూచకమని. ఈ సంకేతాలు కనిపిస్తే నేరుగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చేస్తుంది.
Read Also..
Read Also..
కాకినాడ జిల్లా, రూరల్, ప్రభుత్వం పెంచిన 3000 రూపాయల పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కాకినాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో ఎం.పి.డి.ఓ కే.స్వప్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు హాజరయ్యారు. ప్రభుత్వం పెంచిన పెన్షన్ లను లబ్ధిదారులకు కన్నబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నుండి పెన్షన్ డబ్బులు నేరుగా ఇంటికే అందేలా ఆలోచించిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 65 సంవత్సరాలు నిండిన వారికే పెన్షన్లు ఇచ్చేవారు. పెద ప్రజల కష్టాలు చూసిన జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి నెల 1వ తేదీ ఉదయాన్నే వాలంటీర్ వచ్చి లబ్ధిదారులకు అందజేసి దేశం లో చాలా రాష్ట్రాలకు ఆదర్శంగా పాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. దేశం లో ఏ రాష్ట్రం లో ఇవ్వని విధంగా 3000 రూపాయలు పెన్షన్ లు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని, కులం, మతం, ఏ రాజకీయ పార్టీ కి మద్దతు ఇచ్చారు అని చూడకుండా అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తున్న దమ్మున నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఎల్.డి.ఓ పట్టంసెట్టి నారాయణ మూర్తి, ఎం.పి.పి గోపిసెట్టి పద్మజ బాబ్జీ, జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, తిమ్మపురం గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం, గైట్ కాలేజీలో అంగరగవైభవంగా ప్రారంభమైన 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు. తెలుగు పండుగలా సందడిగా మారిన గైట్ కాలేజీ ఆవరణ. చైతన్య విద్యాసంస్థలు అధినేత చైతన్య రాజు, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ. శ్రీశ్రీ రాజ రాజ నరేంద్రుల పట్టాభిషేక సహస్రాబ్ది నీరాజనంగా తెలుగు మహాసభలు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అతిధులు, ప్రతినిధులు. విశాఖ శారదా పీఠం శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో తెలుగు మహాసభల అంకురార్పణ కార్యక్రమం. మహాసభల ప్రారంభోత్సవ సభ వేదికకు రాజరాజ నరేంద్ర వేదికగా నామకరణం. మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు. తొలిరోజు ముఖ్యఅతిథిగా హాజరు కానున్న రాష్ట్ర గవర్నర్ , న్యాయమూర్తులు, పలువురు రాష్ట్ర మంత్రులు, సాహిత్య ప్రముఖులు, ప్రతినిధులు.
ఎల్బీనగర్, రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌరెల్లి రోడ్డు వద్ద పాపన్న గూడ చౌరస్తాలో టిప్పర్ లారీ బైక్ ఢీ కొని కుత్బుల్లాపూర్ కి చెందిన తండ్రి కొడుకులు మృతి. నాగోల్ పీఎస్ పరిధి కుత్బుల్లాపూర్ కి చెందిన కుతాడి కుమార్ (40) , 7వ తరగతి చదువుతున్న కొడుకు కుతాడి ప్రదీప్ (13) టిప్పర్ ఢీకొని తండ్రి కొడుకులు ఇద్దరు మృతి. పరారీ లో టిప్పర్ డ్రైవర్. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న నాగోల్ పోలీసులు.
మనమంతా కాలంతో పాటు పరుగెడుతూ మన చుట్టూ ఎన్నో వింతలు, విశేషాలను చూడలేకపోతున్నాం. చరిత్రకు సజీవ సాక్ష్యాలు ఉన్న వాటి గురించి తెలుసుకోలేకపోతున్నాం. అలాంటి వాటిలో ఈ ఆలయం కూడా ఒకటి. దాదాపు ఏడు వందల ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం ఇది. వందల ఏళ్లైనా చెక్కు చెదరని నిర్మాణాలు దీని సొంతం. ఎక్కడా లేని విధంగా 700 ఏళ్లుగా నిరంతరం వెలుగుతున్న అఖండజ్యోతి ఈ ఆలయం ప్రత్యేకత.నిజాం పాలనలో నిర్విఘ్నంగా పూజలు సాగిన ఆలయం. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో అతి పురాతనమైన సీతారామాలయం.తెలంగాణ ప్రాంతాన్ని అనేక రాజవంశాలు పరిపాలించాయి. వారి పాలనకు గుర్తులుగా ఆయా ప్రాంతాల్లో పలు దేవాలయాలను అప్పటి రాజులు నిర్మించారు. అలాంటి ఆలయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట లోని అతి పురాతనమైన సీతారామాలయం ఒకటి. కాకతీయ పాలకుల కాలంలో దాదాపు క్రీస్తు శకం 1333లో నిర్మితమైన ఈ దేవాలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయంలో పురాతన లక్ష్మణ సమేత సీతారాముల మూల విగ్రహంతో పాటు 16 రాతి స్తంభాలతో నిర్మించిన కళ్యాణమంటపం, గంట, తటాకం నాటి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఆలయంలోని గంటపై ఆలయ నిర్మాణానికి సంబంధించిన సంవత్సరం చెక్కబడి ఉంది. ప్రతాపరుద్రుని కాలంలో నిర్మాణం. ఓరుగల్లును పరిపాలించిన కాకతీయుల రాజ్యంలో కొన్ని గ్రామాలను పాలన పరంగా ప్రత్యేక గుర్తించేవారు. అలా గుర్తించిన వాటిలో గంభీరావుపేట ప్రధాన కేంద్రంగా ఉండేది. అందుకే అక్కడ ప్రత్యేకంగా లక్ష్మణ సమేత సీతారామాలయాన్ని నిర్మించారని చరిత్రకారులు చెబుతారు. కాకతీయ రాజులలో చివరివాడైన ప్రతాపరుద్రుని కాలంలో ఈ సీతారామాలయాన్ని నిర్మించినట్లు ప్రతీతి. నిజాం పాలనలో లింగన్నపేట సంస్థానానికి చెందిన శ్రీ వెంకటరావు దేశాయి సంస్థానాధీశులుగా ఉండేవాడు. ఈ ఆలయం పరిపాలన ఆయన కిందకి రావడంతో సీతారామాలయం అభివృద్దికి కృషి చేసినట్లు స్థానికులు చెబతుంటారు. ఆలయంలో పూజ కార్యక్రమాల కోసం దగ్గర్లోనే వెంకటాద్రి చెరువును నిర్మించారు. ఆ చెరువు నుంచే ఆలయంలో జరిగే ఉత్సవాల అన్నింటికీ నీటిని తెస్తుంటారు. ఇప్పటికీ ఆ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. నిజాం పాలనలో నిర్విఘ్నంగా పూజలు ఆలయంలో నందాదీపం 700 ఏళ్లుగా నిరంతరంగా వెలుగుతూనే ఉంది. మూల విగ్రహాల ప్రతిష్ఠకు ముందే ఆలయంలో నందా దీపంను ప్రతిష్ఠించినట్లు తెలుస్తుంది. నాటి నుంచి నేటి వరకు ఈ దీపం వెలుగుతూనే ఉంది. నిజాం కాలంలో సైతం ఈ ఆలయంలో నిర్విఘ్నంగా పూజలు సాగినట్లు ఆధారాలున్నాయి. ఈ నందా దీపం వెలుగుతుండడం వల్లే గ్రామస్తులు ఐశ్వర్యం, ధాన్యం, సమృద్ధిగా కలుగుతుందని ఇక్కడి ప్రజలకు ప్రగాఢ విశ్వాసం.
ఎన్టీఆర్ జిల్లా, పెనుగంచిప్రోలు మండలం, అనిగండ్లపాడులో ఉద్రిక్తత. సీఐ సమక్షంలోనే అనుమానిత వ్యక్తి పై గ్రామస్థుల దాడి. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సర్పంచ్ జ్యోతికి చెందిన లారీకి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటనపై స్థానికుల ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. అనుమానంతో బోశెట్టి త్రినాథ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. అతడిని కారులో ఎక్కించుకొని వెళ్తుండగా అడ్డగించిన గ్రామస్తులు. పోలీసులు వినియోగించిన ఆ ప్రైవేటు కారును ధ్వంసం చేసి. సీఐ, ఎస్సై సమక్షంలోనే త్రినాధ్ పై స్థానికులు దాడి. గ్రామానికి చెందిన బోశెట్టి త్రినాథ్, మరో ఇద్దరు కలిసి తన లారీని దగ్ధం చేశారని సర్పంచ్ జ్యోతి దంపతులు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా ఆ 3 వ్యక్తులు గ్రామంలో అలజడి సృష్టిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. గతంలో తమకు చెందిన వరి కోత యంత్రాన్ని కూడా ధ్వంసం చేశారని, ఆ విషయంపై పోలీసులకు ఫిర్యాదులు చేసినా సరిగా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.