సింహపురి సీమలో, పవిత్ర పెన్నా నది తీరాన, ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీ తల్పగిరి రంగనాథుడి ఉత్తర ద్వార దర్శనం కోసం అర్థరాత్రి నుంచి భక్తులు ఆలయంలో వేచి ఉన్నారు. రంగనాథుని ఉత్తర ద్వారం ద్వారా దర్శించే భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాట్లు చేసి, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ముక్కోటి ఏకాదశి పర్వదినంతో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ ప్రాంగణం హరినామస్మరణతో మారుమోగింది.
devotional news
శ్రీశైల మహాక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి, అమ్మవారికి ప్రత్యేక ఉత్సవం నిర్వహించి భక్తులను ఉత్తరద్వారం ద్వారా శ్రీస్వామి, అమ్మవారి దర్శనానికి దేవస్థానం ఈవో పెద్దిరాజు, అధికారులు అనుమతిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని వేకువజామున 3 గంటలకే ఆలయ ద్వారాలు తెరచి మంగళవాయిద్యాలు, సుప్రభాతసేవ, ప్రాతఃకాలపూజ అనంతరం శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను ఉత్తరద్వార ముఖమండపం నుండి వెలుపలకు తోడ్కొని వచ్చి రావణవాహనంపై అధిష్ఠింపజేసి అర్చకులు ఉత్సవ సంకల్పన్ని పఠనించి ప్రత్యేక పూజలు, అర్చనలతో హారతులిచ్చారు. అనంతరం రావణవాహనోత్సవపై క్షేత్రపురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారికి ఘనంగా గ్రామోత్సవం నిర్వహించారు. అలానే భక్తులు దర్శించుకునేందుకు వీలుగా శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం ముఖమండపం వెలుపల (బలిపీఠం సమీపంలో) ఆశీనులను చేశారు. భక్తులు శ్రీస్వామి అమ్మవారిని ఉత్తరద్వారా దర్శనం ద్వారా దర్శించుకుంటున్నారు. విశేషపూజలు, గ్రామోత్సవం అనంతరం ఉదయం 6 గంటల నుండి శ్రీస్వామి అమ్మవార్ల సర్వదర్శనానికి, ఆర్జితసేవలకు భక్తులను అనుమతించారు. భక్తులు తెల్లవారుజాము నుండే క్యూలైన్లలో బారులు తీరారు. శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది.
Read Also..
ముక్కోటి ఏకాదశి సందర్భంగా శిల్ప అవెన్యూ, తులసి వనంలో అందంగా ముస్తబైన ఆలయాలు , హరి నామస్మరణతో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా తగు ఏర్పాట్లు చేశామని తెలిపారు. గుడి అర్చకులు శ్రీహరి మాట్లాడుతూ ఈ రోజు స్వామి వారి దర్శనం ప్రతి ఒక్కరు చేసుకుని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు తెలిపారు అదేవిధంగా ముక్కోటి ఏకాదశి విశిషటత గురించి వివరించారు.
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో దివ్య ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని జరిగిన స్వామి వారి గిరి ప్రదక్షిణ సేవ భక్తులను అలరించింది. గజలక్ష్మి గుర్రాలు గోమాత ముందు నడుస్తుంటే ప్రచార వాహనంపై కొలువు తీరిన స్వామి వారు ఉభయదేవేరులు, కలిసి క్షేత్రపురవీథుల్లో ఊరేగారు. స్వామివారి పాతిక మండపం నుండి ఆలయం చైర్మన్ నివృత రావు, ఈవో వేండ్ర త్రినాథరావు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రచార వాహనం కొలువు తీరిన స్వామివారి అమ్మవారు ప్రత్యేక అలంకరణతో ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వాహనాన్ని ముందు కదిలించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోలాట భజనలు కేరళ డప్పులతో శక్తి వేషధారణలతో భక్తులను అలరించారు. వెంకటేశ్వర స్వామి వారి వేషధారణ చేసిన ఇంత ఆకర్షణీయంగా ఉండటం మరో ప్రత్యేకత వివిధ దేవతల అవతారాల రూపంలో వేషాలను వేసి గిరి ప్రదిక్షణలో పాల్గొన్న భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. గిరిప్రదక్షిణ వాహనంపై స్వామి అమ్మవార్లతో పాటు ఆలయ అర్చకులు ప్రత్యేక మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ స్వామి వారి గిరిప్రదక్షిణ సుమారు 6 కిలోమీటర్లు జరిగింది. ఆలయ తొలిమెట్టు వద్ద పలువురు స్వామి అమ్మవార్లకు హారతులని ఇచ్చారు. అనంతరం క్షేత్రంలో తిరుగాడి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత హారతులు సమర్పించారు. ఈ ఉత్సవం ఆద్యంతం భక్తులను విచిత్ర వేషధారణలు, నృత్యాలు, భజనలు, శక్తి వేషలు వెంకటేశ్వర స్వామి వివిధ దేవుళ్ళ వేషధారణలు ప్రత్యేకముగా విశేషంగా ఆకట్టుకుంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో నేడు చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ది మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమంలో భాగంగా మొదటి రోజు యజ్ఞ క్రతువులు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు జరిపారు. ప్రజలందరికీ మేలు జరగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా చంద్రబాబు – భువనేశ్వరి దంపతులు ప్రార్థించారు. గుంటూరుకు చెందిన వేద పండితులు శ్రీనివాసాచార్యుల వారి పర్యవేక్షణలో 40 మంది రిత్వికులు యాగం నిర్వహించారు. రేపు, ఎల్లుండి కూడా యజ్ఞహోమాది కార్యక్రమాలు జరగనున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు పార్టీ నేతలు కుటుంబ సభ్యులతో కలిసి యాగంలో పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. గుత్తి పట్టణంలో కన్నులపండుగగా శ్రీరామ శోభాయాత్ర జరిగింది. జనవరి నెల 22వ తేదీన అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా గుత్తిలో శ్రీరాములవారి అక్షితల విగ్రహాల ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని పురాతన రామాలయం నుండి శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. యాత్ర దేవాలయం నుండి గాంధీచౌక్ ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా సాగింది. మండలంలోని ప్రతి గ్రామానికి స్వామివారి అక్షితలను కమిటీ సభ్యులు అందజేశారు.
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ గురించి చాలా మందికి తెలిసిందే. ఇది దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పవిత్ర స్థలాల్లో ఒకటి. ఈ గురుద్వార గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. పంజాబ్‌లోని ఈ అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని శ్రీ హర్మందిర్ సాహిబ్ అని కూడా పిలుస్తారు. ఇది దేశంలోనే అత్యంత సుందరమైన పవిత్ర స్థలాల్లో ఒకటి. అలాగే సిక్కుల ప్రధాన గురుద్వార్ కూడా ఈ స్వర్ణ మందిరమే. దీంతో ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించడానికి కేవలం సిక్కులు మాత్రమే కాకుండా ఇతర మతాల వారు సైతం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఎవరైనా ఈ ఆలయ సముదాయంలోకి అడుగు పెట్టగానే ఎక్కడా దొరకని ప్రశాంతత ఆవహిస్తుంది. ఈ గోల్డెన్ టెంపుల్ భారతదేశంలో అత్యధికంగా సందర్శించే ప్రార్థనా మందిరాల్లో ఒకటిగా పేరుగాంచింది. తిరుమల శ్రీవారిని నిత్యం వాలేది మంది భక్తులు దర్శించుకున్నట్లే ఇక్కడికి కూడా దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశీ టూరిస్టులు సైతం ఎంతో మంది వచ్చి ఈ గురుద్వారను సందర్శిస్తుంటారు. ఈ గురుద్వారకున్న ప్రత్యేకమైన ఆకర్షణే బంగారు తాపడం. ఈ మందిరం చుట్టూ 24 క్యారెట్ల బంగారు పూతను అద్దడం విశేషం. దీంతో ఈ ఆలయానికి స్వర్ణమందిరం అనే పేరొచ్చింది. మహారాజా రంజిత్ సింగ్ అనే వ్యక్తి తొలిసారి ఈ ఆలయానికి బంగారం జోడించాలని అనుకున్నారు. అలా మొదట 162 కిలోల బంగారు పూతతో ప్రారంభించగా 90ల కాలంలో 500 కిలోల బంగారు పూతను ఆలయానికి అతికించారు. దీంతో ఈ గురుద్వార దగదగలాడుతుంది. ఈ గోల్డెన్ టెంపుల్లో నిత్యం వేలాది మంది భక్తులకు ఉచితంగా భోజన ఏర్పాట్లు చేస్తుంది. దీంతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లంగర్ సేవను అందిస్తున్న దేవాలయంగా ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఇక్కడికి వచ్చే భక్తులూ, టూరిస్టులు ఎవరైనా సరే నేల మీద కూర్చొనే ఆహారం తీసుకుంటారు. ఇక్కడ కులమతాలకతీతంగా ప్రతి ఒక్కర్నీ సమానంగా చూడటం విశేషం. దీంతో వేలాదికి మందికి ఇక్కడ ఉచితంగా ఆహారం అందుతుంది. మీరెప్పుడైనా ఈ స్వర్ణ మందిరాన్ని నిశితంగా పరిశీలించారా? అలా గమనిస్తే ఈ ఆలయ నిర్మాణ శైలి మీకు అర్థమవుతుంది. ఈ ఆలయాన్ని హిందూ – మొఘల్ కలయిక శైలిలో అద్భుతంగా నిర్మించారు. గోపురం వెలుపలి భాగం నుండి కిటికీలు, గుమ్మాల వరకు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. దీంతో ఈ గోల్డెన్ టెంపుల్ నిర్మాణ కూడా ఓ అద్భుతమనే చెప్పాలి. ఇతర మతపరమైన ప్రదేశాల మాదిరిగా కాకుండా ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి ఉండే మెట్ల మార్గం కిందకు ఉంటుంది. అంటే దీని అర్థం దేవుడి దగ్గరకు వచ్చే భక్తులు తమకున్న అహంకారం, రాగద్వేషాలను వదులుకొని వినయ పూర్వకంగా మెలగాలని. ప్రతి ఒక్కరూ ఇలాంటి నిరాడంబరమైన జీవనశైలిని కలిగి ఉంటే దేవుని ఆశిస్సులు ఉంటాయనేది దానివెనకున్న ఉద్దేశం. ఈ ఆలయం అన్ని మతాల వారికీ తెరిచి ఉంటుంది. అందుకే ఈ ఆలయానికి నలుదిక్కులా ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు. అంటే ఇది అన్ని మతాల వారినీ ఆదరిస్తుందని అర్థం. మరోవైపు ఆలయ నిర్మాణ సమయంలోనూ గురు అర్జన్ దేవ్ సుఫీ సెయింట్ మియాన్ మీర్‌ను ఆలయ శంకుస్థాపనకు ఆహ్వానించారు. దాంతో అక్కడ కుల, మతాలతో సంబంధం లేకుండా ఆలయానికి ఎవరైనా వెళ్లొచ్చనే భావన కలిగించారు. అలాగే ఈ స్వర్ణ మందిరంలో ఎవరైనా స్వచ్ఛందంగా సేవ చేయవచ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా గోల్డెన్ టెంపుల్లో మీ సేవలు అందించవచ్చు. అక్కడ మీరు సేవ చేయడానికి కచ్చితంగా సిక్కులే అయి ఉండాల్సిన పనిలేదు. మీకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే హ్యాపీగా అక్కడ పాల్గొనవచ్చు.
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి, 24న వైకుంఠ ద్వాదశి. డిసెంబరు 22న అదే రోజు దర్శనానికి సంబంధించిన సర్వదర్శనం టోకెన్ల రద్దు. డిసెంబరు 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ ప్రారంభం. డిసెంబరు 23న తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం. జనవరి ఒకటో తేదీ రాత్రి 12 గంటలకు మూసివేత. డిసెంబరు 22వతేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి తిరుపతిలోని 9 కేంద్రాలలో 90 కౌంటర్ల ద్వారా కోటా పూర్తయ్యేంత వరకు మొత్తం 4,23,500 సర్వదర్శనం టోకెన్లు మంజూరు. తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, భైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జడ్పి హైస్కూల్లో ఉచితంగా సర్వదర్శన టోకెన్లు పొందవచ్చు. వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు. వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు, కుటుంబ సభ్యులకు పరిమిత సంఖ్యలో మాత్రమే బ్రేక్ దర్శనం ఇవ్వబడుతుంది. 10 రోజుల పాటు సిఫారసు లేఖలు స్వీకరించబడవు. వైకుంఠ ద్వార దర్శన ఫలితం 10 రోజలు పాటు ఉంటుంది. కావున విఐపిలు, ఇతర భక్తులు పది రోజుల్లో ఏదో ఒకరోజు దర్శనం చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకోవాల్సిందిగా కోరిన టిటిడి.
అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో ఉలవపాడులో అయోధ్య రాముని అక్షింతల ఊరేగింపు జరిగింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర కమిటీ ఆధ్వర్యంలో ఉలవపాడు మండల వాసులు, రామభక్తులు ఊరేగింపుగా అక్షింతలను మండలంలోని శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నందు పంచాయితీ వారి జన సంపర్క్ అభయాన్ ప్రముఖులకు, సహ ప్రముఖులకు అక్షింతలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ దక్షిణాంధ్ర ప్రాంత సహ కార్యదర్శి పర్రే. కోటేశ్వరరావు, జన సంపర్క్ అభయాన్ జిల్లా సహ ప్రముఖులు కోట సురేంద్ర రెడ్డి, ఉలవపాడు మండలం జన సంపర్క్ అభయాన్ ప్రముఖ ఏ సత్యం, సహ ప్రముఖ పి వెంకట్రావు, విశ్వహిందూ పరిషత్ సంఘటన కార్యదర్శి కోనసం సంజీవరెడ్డి, సత్సంగ ప్రముఖ బి బాలిరెడ్డి అన్ని పంచాయతీల జన సంపర్క్ ప్రముఖులు పాల్గొన్నారు.
బతుకమ్మ పండుగ తెలుగు సంప్రదాయంలో ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఈ పండుగ శ్రావణ మాసంలోని అమావాస్య నాడు జరుపుకుంటారు. ఈ పండుగను ఆడపిల్లలు, స్త్రీలు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు.
బతుకమ్మ పండుగను జరుపుకునే విధానం:
- పువ్వులతో బతుకమ్మను తయారు చేయడం: బతుకమ్మను తయారు చేయడానికి తాజా పువ్వులు, పసుపు, కుంకుమ, ఒత్తులు, పూలమాలలు మరియు ఇతర అలంకరణలు ఉపయోగిస్తారు. బతుకమ్మకు తలపై ఒక పెద్ద పువ్వు ఉంచుతారు. మెడలో పసుపు, కుంకుమతో ఒక గొలుసును వేస్తారు. ఒంటిపై పువ్వుల మాలలు మరియు ఇతర అలంకరణలను కడతారు.
- బతుకమ్మలను పూజించడం: బతుకమ్మలను పూజించడానికి ముందు, వాటిని ఒక పెద్ద కుండలో నీటితో నింపి ఉంచుతారు. పూజ ముగిసిన తర్వాత, ఆ నీటిని పిల్లలకు త్రాగిస్తారు. బతుకమ్మలను పూజించేటప్పుడు, మంగళ హారతి ఇస్తారు. స్త్రీలు బతుకమ్మలకు పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ పూజిస్తారు.
- బతుకమ్మలను ఊరేగించడం: బతుకమ్మలను పూజించిన తర్వాత, వాటిని ఊరేగిస్తారు. ఊరేగింపులో భాగంగా, బతుకమ్మలను ఒక ఊరేగింపు బండిలో ఉంచి, గ్రామంలోని ప్రతి ఇంటి ముందు ఊరేగిస్తారు. ఊరేగింపులో పాల్గొనే వారు బతుకమ్మలకు పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ ఉంటారు.
- బతుకమ్మలను వదిలిపెట్టడం: ఊరేగింపు ముగిసిన తర్వాత, బతుకమ్మలను ఒక చెట్టు కింద వదిలిపెడతారు. ఈ కార్యక్రమాన్ని “బతుకమ్మలను వదిలిపెట్టడం” అంటారు. ఈ కార్యక్రమం ద్వారా, భూమికి బతుకమ్మలు తిరిగి వెళ్లిపోతున్నారని భావిస్తారు.
బతుకమ్మ పండుగ అనేది భూమికి ఋణపూర్ణతను తెలియజేయడానికి జరుపుకునే పండుగ. ఈ పండుగ ద్వారా, భూమిని కాపాడుకోవాలనే భావాన్ని ప్రోత్సహిస్తారు.






Total views : 90808