తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంత పల్లి గ్రామ శివారులో ఉన్న స్వర్ణ దుర్గ ఆశ్రమం వద్ద ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో త్రాచుపాము ప్రత్యక్షమైంది. స్వర్ణ దుర్గ ఆశ్రమంలో స్వర్ణ దుర్గమ్మ తల్లి ఆలయంతో పాటు శివాలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, నవగ్రహాల ఆలయాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం దేవి శరన్నవరాత్రుల సందర్భంగా నిత్యా అన్నదానం, కార్తీక మార్గశిర మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అయితే ఆదివారం మార్గశిర ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు వెళ్లిపోయారు. అనంతరం సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలోకి త్రాచు పాము ఒకటి వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని చుట్టుకుని పడగవిప్పి బుసలు కొట్టింది. ఉదయం నుంచి సుబ్రమణ్య స్వామిని చుట్టుకుని సర్పం అలాగే ఉండిపోయింది. ఈ విషయం తెలిసిన స్థానికులు అక్కడకు వచ్చి సుబ్రమణ్య స్వామి ఈ విధంగా వచ్చి తమ ఆశీస్సులు అందిస్తున్నారని నమస్కరించి వెళ్లిపోయారు.
devotional news
cvr, ఇమేజ్ గ్రూప్స్ చైర్మన్ సివి రావు, ఉషారాణి దంపతులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు పూర్ణ కుంభ స్వాగతం పలికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ పెరిగింది సాక్షి గణపతి ఆలయం నుంచి ముఖద్వారం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై కార్లు బస్సులు నిలిచిపోయాయి సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వరుస సెలువులు రావడంతో శ్రీశైలం ఆలయానికి ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి వాహనాలలో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. భక్తుల రద్దిని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు స్వామివారి సామూహిక అభిషేకాలు, గర్భాలయం అభిషేకాలు పూర్తిగా రద్దు చేశారు. ఆంధ్ర, తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా సొంత కార్లలో తరలి వస్తున్నారు. శ్రీశైలం ఘాట్ రోడ్ మొత్తం సింగిల్ రోడ్డు కావడంతో వచ్చి వెళ్లె వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాక్షి గణపతి ఆలయం నుండి హటకేశ్వరం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖద్వారం నుండి శ్రీశైలానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది. అయితే ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసేందుకు పోలీసులు అష్టకష్టాలు పడుతూ ట్రాఫిక్ ని అదుపు చేయడంలో నిమగ్నమయ్యారు.
మార్గశిర మాసాన్ని పురస్కరించుకొని గ్రామాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రతి ఏటా నిర్వహించుకునే మల్లన్న బోనాల్లో భాగంగా కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలంలోని ఈస్గాం శివమల్లన్న ఆలయం ఆవరణలో వివిధ మండలాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై బోనాలను సమర్పించారు. కుటుంబ సమేతంగా హాజరై అలయ ఆవరణలో పిండి వంటలు వండి స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించారు. పాడి పంటలు సమృద్ధిగా పండి ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయం ఆవరణలో కొత్త ధాన్యంతో వంటలు వండి కుటుంబ సమేతంగా సహపంక్తి భోజనాలు చేశారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి వరుసగా సెలవులు రావడంతో భారీగా పెరిగిన భక్తుల రద్దీ పెరగడంతో క్షేత్రమంత భక్తజనంతో సందడి నెలకొంది. భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో పెద్దిరాజు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, మంచినీరు అందిస్తున్నారు. వరుసగా సెలవులు రావడంతో సామూహిక అభిషేకాలు, గర్భాలయం అభిషేకాలు రద్దు చేశారు. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు భావిస్తున్నారు.
కాణిపాకం ఆంధ్ర ప్రదేశ్లోని చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన గ్రామము. ఈ పుణ్యక్షేత్రం బహుదా నది ఉత్తరపు ఒడ్డున, తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉన్నది. కాణిపాకంలో అనేక ప్రాచీన ఆలయాలున్నాయి. ఇక్కడ జనమేజయుడు కట్టించాడని అనుకునే ఒక పాత దేవాలయము ఉన్నది. మణికంఠేశ్వర స్వామి ఆలయాన్ని చోళ రాజైన రాజరాజేంద్ర చోళుడు కట్టించాడు. ఈ ఆలయంలోని అద్భుతమైన శిల్పసంపద చోళ విశ్వకర్మ శిల్పిశైలికి తార్కాణంగా పేర్కొనబడుతుంది. ఇటీవల కాలంలో వరసిద్ధి వినాయకుని ఆలయం ప్రశస్తి పొందింది. ఈ పుణ్యక్షేత్రం తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉన్నది.
శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం చరిత్ర
పూర్వం మూగ, గుడ్డి, చెవిటి అన్నదమ్ములకు కలిసి ఒక కాణి మడి ఉన్నది. వారు ఆ మడిని బావినీటి సరఫరాతో వ్యవసాయం చేసేవారు. ఒకసారి తీవ్రమన కరువు కారణంగా బావి ఎండిపోవడంతో వారు బావిని మరికొంత లోతు త్రవ్వుతున్న సనయంలో గునపానికి ఒకారాయి తగిలి అందులో నుండి రక్తం పైకి ఎగజిమ్మ అన్నదమ్ముల మిద పడగానే వారి అవకర్యాలు పోయి వారు ముగ్గురూ స్వస్థులైయ్యారు. వారు ఆనందంగా ఈ విషయం ఊరి వారికి తెలియజేయగా అనదరూ కలిసి అక్కడ వినాయకుని విగ్రహం ఉన్నదని తెఉసుకుని దావినిని బయటకు తీసి అక్కడ ఆలయనిర్మాణం చేసి ఆరాధనలు ప్రారంభించారు. కాణి మడిలో లభించిన వినాయకుడు కనుక ఈ క్షేత్రం కాణిపాకంగా ప్రసిద్ధిచెందినది. ఈ ఆలయంలో అసత్యం పలికితే వినాయకుడు దండనకు గురిఔతారని విశ్వసించబడుతుంది. అందువలన ఇక్కడ భక్తులు అసత్యం చెప్పరు.
వరసిద్ధి వినాయకుడు
శాసనాధారాల ప్రకారం కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయాన్ని 11వ శతాబ్దంలో మొదటి కుళోత్తుంగ చోళుడు కట్టించాడు. ఆ తరువాత దాన్ని 15వ శతాబ్దంలో విజయనగర రాజులు విస్తరించారని తెలుస్తున్నది.కాణి అంటే పావు ఎకరా మడిభూమి లేదా మాగాణి అని, పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్ధం. చరిత్ర ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు వుండేవారు. వారు ముగ్గురు మూడు రకాల అవిటితనాలతో బాధపడేవారు, ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ మరొకరికి చెవుడు. వారికి వున్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. పూర్వకాలంలో నూతి నుండి ఏతాంలతో నీటిని తోడేవారు. ముగ్గిరిలో ఒకరు క్రింద వుంటే ఇద్దరు ఏతాం పైన వుండి నీరు తోడేవారు. అలా వుండగా ఒక రోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వటం మొదలు పెట్టాడు. కాసేపటి తరువాత గడ్డపారకు రాయిలాంటి పదార్దం తగలటంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి నిశ్చేత్రుడయ్యాడు. కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది.మహిమతో ముగ్గిరి అవిటితనం పూర్తగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఈ విషయం విన్న చుట్టుప్రక్కల గ్రామస్తులు తండోపతండోలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు త్రవ్వటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయాంభు విగ్రహం వూరే నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభువుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు ఒక ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది. దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు, రానురాను కాణిపాకంగా పిలవసాగారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే వుంటుంది. అక్కడ ప్రాంగణములోనే ఒక్క బావి కూడ వున్నది దానిలో స్వామి వారి వాహనము ఎలుక వున్నది. అక్కడ స్వామివారికి, మనకి ఇష్టమైన పదార్ధం ఏదైనా వదిలి వెస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి.
విశేషాలు
కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు. సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉన్నది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్థి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామి వారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్దీకులు సిద్ధంకారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా?అంటూ సవాల్ విసురుతారు. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయ స్థానాలలో కూడ ప్రామాణికంగా తీసుకునె వారు.
Read Also..
Read Also..
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శనివారం స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు రథాన్ని అధిరోహించి నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వర్ణరథాన్ని టీటీడీ మహిళా ఉద్యోగులతో పాటు పలువురు మహిళలు గోవిందనామస్మరణతో, భక్తిశ్రద్ధలతో లాగారు. స్వర్ణరథోత్సవాన్ని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కరుణాకరరెడ్డి,ఈవో.ధర్మారెడ్డి , జై ఓ వీరబ్రహ్మం..పాల్గొన్నారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని భక్తులు సంతృప్తికరంగా దర్శనం చేసుకున్నారన్నారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేశామని తెలిపారు. భక్తులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయం 5.15 గంటల నుండే సర్వదర్శనం ప్రారంభించామని తెలిపారు టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి. ఆ తరువాత స్లాట్ల వారీగా ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం భక్తులను అనుమతిస్తున్నామని తెలియజేశారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, టీ, కాఫీ, పాలు అందిస్తున్నామని చెప్పారు. తిరుపతిలోని కౌంటర్లలో సర్వదర్శనం టోకెన్ల జారీ సజావుగా జరుగుతోందన్నారు.
Read Also..
Read Also..
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు పి. సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని తుక్కుగూడ మున్సిపాలిటీ శ్రీనగర్ ఫ్యాబ్ సిటీలో ముక్కోటి(వైకుంఠ) ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు యువ నాయకులు కార్తీక్ రెడ్డితో కలిసి పి. సబితా ఇంద్రారెడ్డి ఉత్తరద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదములు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యురాలు సబితా ఇంద్రా రెడ్డి ప్రజలందరికి వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపతో మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
జమ్మలమడుగు పట్టణంలోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున నుంచి ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి రాజేష్ స్వామి వైకుంఠ ఏకాదశి పండగ పర్వదినం విశిష్టతను తెలియజేశారు. ఈ రోజున స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి శుభం కలుగుతాయని తెలిపారు. ఈ సందర్బంగా టిటిడి అధికారులు భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. శ్రీ నారాపురం వెంకటేశ్వర స్వామి గరుడ వాహనంలో భక్తులకు ఉత్తర మార్గంలో దర్శనమిచ్చారు. ఆలయానికి వచ్చిన భక్తులకు శ్రీవారి సేవా సమితి జమ్మలమడుగు సభ్యులు ప్రసాద వితరణ చేశారు.





Total views : 90897