సాధారణంగా ఇంటిముందు బూడిద గుమ్మడికాయ కనుక ఉంటే మన ఇంటిపై ఏ విధమైనటువంటి చెడు ప్రభావం నరదృష్టి నరగోష తగలదని పండితులు చెబుతుంటారు. అందుకే చాలామంది ఇంటి ముందు బూడిద గుమ్మడికాయను వేలాడదీసి ఉండటం మనం చూస్తుంటాము. ఇలా బూడిద గుమ్మడికాయను వేలాడతీయటం వల్ల ఆ ఇంటి పై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకుండా అన్ని అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని చెబుతారు. అయితే బూడిద గుమ్మడికాయను కట్టేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలని కొన్ని తప్పులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఇంటికి కట్టే బూడిద గుమ్మడికాయ సాధారణంగా కొన్ని నెలల వరకు చెడిపోదు. అయితే మనం కట్టిన గుమ్మడికాయ కేవలం నెల రెండు నెలల వ్యవధిలోనే చెడిపోయింది. అంటే మన ఇంటి పైన దృష్టి ఎక్కువగా ఉందని అర్థం ఇలా ఇంటికి కట్టిన బూడిది గుమ్మడికాయ చెడిపోయింది. అంటే వెంటనే దాని స్థానంలో మరొకటి కట్టాలి. ఇలా ఒక దానిని తీసి మరొకటి కట్టేటప్పుడు మన ఇష్టానుసారంగా కట్టకూడదు. సాధారణ గుమ్మడికాయ కదా అని కట్టడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే గుమ్మడికాయ కట్టేటప్పుడు ఈ నియమాలు పాటించాలి. శాస్త్ర పరంగా ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ వేలాడ తీయటానికి ప్రత్యేకమైన పూజలు చేసి దానిని ఇంటి ముందు వేలాడతీయాలి. ఇలా ఇంటి ముందు కానీ దుకాణాల ముందు కానీ బూడిద గుమ్మడికాయలను వేలాడతీయడం వల్ల నరదృష్టి తగలకుండా ఉంటుంది. నరదృష్టి చాలా ప్రమాదకరమైనది. బూడిద గుమ్మడికాయకు ఐశ్వర్య కాళీ ఫోటో యంత్రాన్ని జోడించి ఒక శుభ ముహూర్తంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఐశ్వర్య కాళీ ఫోటోతో సహా బూడిద గుమ్మడికాయ వేలాడు తీయడం వల్ల ఆశక్తి మరింత రెట్టింపు అవుతుంది. గుమ్మడికాయ ఇంటికి ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు అని అర్థం. ఇది ఇంటి మీద ఇంటి మనుషుల మీద చెడదృష్టి పడకుండా కాపాడుతుంది. ఇంటి ముందుకు వచ్చేటువంటి దోషాలు అంటే నరఘోష, నరపీడ, నరదృష్టి, నకారాత్మక శక్తిని కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయ నిరోదిస్తుంది.
devotional news
విజయవాడ, శివరామ క్షేత్రం రామకోటి నుండి ఘనంగా ప్రారంభమైన కలశ జ్యోతులు. అమ్మవారి రథానికి కొబ్బరికాయ కొట్టి ఊరేగింపుగా దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తుల రథాన్ని ప్రారంభం చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రతి ఏడాది దుర్గా మల్లేశ్వర దేవస్థానం శివరామ క్షేత్రం నుండి కళశజ్యోతులు ప్రారంభం. కళశజ్యోతులు తీసుకొని జై దుర్గా జై జై దుర్గా అంటూ భవానీలు నినాదాలు. బి ఆర్ టి ఎస్ రోడ్డు శివరామ క్షేత్రం రామకోటి నుండి ఊరేగింపు ప్రారంభమై గాంధీనగర్, , అలంకార్ థియేటర్, లెనిన్ సెంటర్, దుర్గగుడి ఫ్లైఓవర్ మీదగా అమ్మవారి గుడికి చేరుకోనున్న కలశజ్యోతులు. కనుచూపుమేరకు ఎర్రని దుస్తుల్లో కళశ జ్యోతులతో భవానీలు.
ఆంజనేయ స్వామి హిందూమతంలో ఎక్కువగా పూజించబడే దేవుళ్లలో ఒకరు. ఆంజనేయ స్వామిని పూజించడం లేదా పూజించడం చాలా సరళంగా పరిగణించబడుతుంది. శివుడిలాగే, అతను భక్తులచే త్వరలో ప్రసన్నుడయ్యే దేవుడు అని పిలుస్తారు. ఆంజనేయ స్వామిని భక్తితో, నిర్మలమైన మనస్సుతో పూజించి, స్మరించుకునే వ్యక్తి జీవితంలోని అన్ని ఆటంకాలను త్వరగా తొలగిస్తాడని నమ్మకం. కానీ, ఆంజనేయ స్వామిని పూజించేటప్పుడు ఈ తప్పులు చేయకండి. మంగళ, శనివారాల్లో ఆంజనేయ స్వామి పూజకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ రోజుల్లో మీరు ఉపవాసం, పూజలు చేయవచ్చు. మహిళలు ఈ రోజున ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి మీ ప్రార్థనలు చేసుకోవచ్చు. దీని ద్వారా ఆంజనేయ స్వామి అనుగ్రహం, రక్షణ లభిస్తుంది. ఆంజనేయుడిని పూజించేటప్పుడు మీరు హనుమంతుడికి పండ్లు, ప్రసాదాన్ని సమర్పించవచ్చు. భక్తులు భక్తి రూపంగా ప్రసాదాన్ని స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఆంజనేయ స్వామిని పూజించి, నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత ఇతరులకు ప్రసాదంగా పంచవచ్చు. హనుమాన్ చాలీసా పఠించడం ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందడానికి సులభమైన మార్గం. ఇందులో హనుమాన్ చాలీసాను స్త్రీ పురుషులు ఇద్దరూ పఠించవచ్చు. మీరు హనుమాన్ చాలీసా పఠించలేకపోతే ఇది వినండి. ఇది భక్తులకు అనేక దైవిక ప్రయోజనాలను కలిగించే సాధారణ అభ్యాసం. ఈ తప్పులు చేస్తున్నారా అయితే తెలుసుకోండి. మహిళలు హనుమంతుని పాదాలను, విగ్రహాలను తాకకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి సంపూర్ణ బ్రహ్మచర్యం పాటించాడు. అతనిని తాకడం హనుమంతుని బ్రహ్మచర్య ప్రతిజ్ఞను విస్మరించినట్లు చూడవచ్చు. ఇంకా, మహిళా భక్తులు హనుమంతుడికి పంచామృతాన్ని సమర్పించకూడదు లేదా అభిషేకం చేయకూడదు. వారు హనుమంతునికి బట్టలు లేదా నీరు సమర్పించకూడదు.
తెలంగాణ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఈ రోజు నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, గెలిచిన తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా భావిస్తున్నారని, తన నియోజకవర్గ ప్రజలకు ఎన్నో అభివృద్ధి పనులు చేయాలని దానికి శక్తిని స్వామి వారు ఇవ్వాలని వేడుకున్నానని ఎమ్మెల్యే యశస్విని అన్నారు.
తిరుమల శ్రీవారిని సినీ నిర్మాత అంబికా కృష్ణ దర్శించుకుని, వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని టిటిడి ఏర్పాట్లు చాలా అద్భుతంగా చేసిందని కొనియాడారు. దర్శనం అనంతరం సినీ నిర్మాత అంబికా కృష్ణ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ… టిటిడి చైర్మన్ భూమున కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి అద్భుతమైన ఏర్పాట్లు చేశారని కంపార్ట్మెంట్లో కాసేపు వేచి ఉండే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వారికి కావలసిన పాలు, నీరు, ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు ఇస్తున్న టీటీడీ యాజమాన్యాన్ని అభినందించారు. భక్తులకు ఇలాంటి దర్శన భాగ్యం కలిగిస్తున్న కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలకు ఆ దేవదేవుడు మరింత శక్తి నివ్వాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని దేవుడిని ప్రార్థించానని నిర్మాత అంబికా కృష్ణ అన్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం పూజిత అక్షింతల కలశ వితరణ మహోత్సవాన్ని నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాస్కర యోగి హాజరైనారు. ఈ కార్యక్రమంలో అయోధ్య నుంచి శ్రీరాముని అక్షింతలను తీసుకువచ్చి ప్రతీ ఇంటింటికి పంపించే కార్యక్రమంలో భాగంగా కార్యక్రమాల్ని నిర్వహించి శ్రీరామునీ రాజ్య పరిపాలన, ఆయన గొప్ప తనం గురించి వివరించారు. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామానికి అక్షింతలు పంపించి డిసెంబర్ వరకు హనుమాన్ దేవాలయంలో పెట్టి హనుమాన్ చాలిసను పఠించి జనవరి 1 తరువాత ప్రతి గడపగడపకు అందించాలని ఈ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాస్కరా యోగీ, బీజేపి నాయకులు, భజరంగ్ దళ్ నాయకులు పాల్గొన్నారు.
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతూ దుర్గమ్మ నామస్మరణతో మార్మోగింది. సెలవు సోమవారం కలిసి రావడంతో భక్తులు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులు తెల్లవారుజామునే తలనీలాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రి పై ఉన్న క్యూలైన్ మార్గాలు భక్తులతో కిటకిటలాడాయి. అనంతరం భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనాలు ఉచిత దర్శనానికి మూడు గంటలు, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనానికి గంటలు పాటు క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావడంతో మేడారం గద్దెల ప్రాంగణంలో భక్తులు భారీగా తరలి వచ్చి సందడి చేశారు. మహా జాతర సమీపిస్తుండడంతో తెలుగు రాష్ట్రల ప్రజలే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. ఉదయం 5 గంటల నుండి సమ్మక్క సారలమ్మలకు పసుపు కుంకుమ చీరసారే నిలువెత్తు బంగారం మొక్కులు సమర్పించుకుంటున్నారు. కరోనా ఎఫెక్ట్ కూడా జాతరపై చాలానే ఉంది. కరోనా భయంతో భక్తులు ముందుగానే తండోవతండాలు వస్తున్నారు. మేడారం పరిసరాలు మొత్తం భక్తులతో కిక్కిరిసింది. అకస్తాత్తుగా భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు ఏర్పాట్లు చెయ్యలేక తలలు పట్టుకుంటున్నారు.
Read Also..
Read Also..
పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం తెలంగాణాలో మిని శ్రీశైలంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం ఇక్కడ కొలువై ఉన్న పరమశివుడు భక్తుల కోరిన కోరికలు నెరవేర్చే ముక్కొటిగా ఆయురారోగ్యాలను ప్రసాదించే భోళా శంకరుడిగా. సంతానాన్ని నెరవేర్చే సంతానేశ్వరుడిగా పేరుగాంచాడు. చెరువుగట్టు గ్రామంలో వెలసిన శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి జాతర అద్భుతంగా జరుగుతాయి. ఐదు రోజుల పాటు సాగి జాతరను తిలకించేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిస్తారు. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెం గ్రామానికి కిలో మీటర్ దూరంలో చెర్వుగట్టుపై పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడికి ప్రతిరోజూ స్వామివారిని దర్శించుకోవడం కోసం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అడిగిన వెంటనే భక్తుల కోరికలు తీరుస్తూ పూజలందుకుంటున్నాడు. స్వామివారు కొండ గుహలో భక్తవత్సలుడుగా కొలువై ఉంటాడు. అందుకే భక్తులు గుండ్లపై ఉన్న స్వామివారిని దర్శించుకుని తప్పనిసరిగా క్షీరాభిషేకం చేస్తారు. భక్తుల కోరికలు నెరవేర్చే భోళా శంకరుడిగా, సంతానం ప్రసాదించే సంతానేశ్వరుడిగా పేరుగాంచిన ఆ ముక్కోటి ని దర్శించుకోవడానికి ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. కామధేనువు విషయంలో తండ్రి జమదగ్ని మహర్షిని అదును చూసి చంపిన కర్త్యా వీరార్జునుడిని సంహరించిన తర్వాత పరశ రాముడు పాప ప్రక్షాళన కోసం దేశమంతా 108 శివలింగాలను ప్రతిష్టించారు. అలా ప్రతిష్టించిన ఆ 108 వ లింగమే చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరుడి ఆలయమని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శివరాత్రి మహాపర్వదినం రోజున ఇక్కడకు వేలాదిగా భక్తులు తరలివస్తారు. శివమాలలు వేస్తారు. లింగ ప్రతిష్టాపనలో భాగంగా పరశురాముడు వేల సంత్సరాలు తపస్సు చేస్తాడు. ఎంతకాలం తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపోద్రిక్తుడై లింగం మీద గొడ్డలితో ఒక దెబ్బ వేస్తాడు. భక్తుడి కోరిక మేరకు శివుడు ప్రత్యక్షమై కలియుగాంతం వరకు ఇక్కడే ఉండి భక్తుల కోరికలు నెరవేరుస్తానని హామీ ఇచ్చాడని అనంతరం పరుశురాముడు అక్కడే శివైక్యం చెందాడని పురాణాలు చెబుతున్నాయి. నల్గొండ జిల్లాలో కొలువైన చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఓ ప్రత్యేక విశిష్టత ఉంది. క్షత్రియ సంహారం అనంతరం పాప ప్రక్షాళన కోసం పరశురాముడు ప్రతిష్టించిన 108 శివలింగాలలోచివరి లింగమని పురాణాలు చెబుతున్నాయి.
హిందూ, ముస్లిం, క్రైస్తవులనే భేదం లేకుండా ఐకమత్యంతో అభివృద్ధికి పాటుపడాలని హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా ఆస్థానం నిత్యాన్నదాత అల్తాఫ్ బాబా అన్నారు. కొండపల్లి పట్టణంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా ఆస్థానంలో శనివారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని పాస్టర్లు హాజరై క్రీస్తు జన్మ వృత్తాంతంపై సందేశమిచ్చారు. ఈ సందర్భంగా అల్తాఫ్ బాబా మాట్లాడుతూ క్రిస్మస్ ను పురస్కరించుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పాస్టర్ ఎలీషా సేవా అవార్డు అందుకోవడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా ఆయనను అభినందించారు. ఈభూమి ఉన్నంత వరకు షా బుఖారి బాబా ఆస్థానంలో నిత్య అన్నదానం కొనసాగాలని, నిత్యం కనీసం ఐదు వేల మందికి అన్నదానం చేసేలా ప్రార్థించాలని కోరారు. అనంతరం పాస్టర్లను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.





Total views : 90937