రావిచెట్టు ను హిందూ మతంలో పవిత్రమైన చెట్టుగా పరిగణిస్తారు. దీనిని అశ్వత్థ వృక్షం అని కూడా పిలుస్తారు. రావిచెట్టును విష్ణువు యొక్క అంశంగా భావిస్తారు. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నమ్ముతారు. దారిద్ర్యం తొలగిపోతుంది, సంతానం లభిస్తుంది, రోగాలు తగ్గుతాయి, శుభాలు కలుగుతాయి. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయడానికి, ముందుగా శుభ్రంగా స్నానం చేసి, శుచిగా ఉండాలి. తరువాత, రావిచెట్టుకు ముందుగా నమస్కరించి, దానికి పువ్వులు, పూజాసామాగ్రిలు సమర్పించాలి. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయడానికి ఎటువైపు నుండి ప్రారంభించాలనేది ముఖ్యం. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయడానికి ఎల్లప్పుడూ కుడివైపు నుండి ప్రారంభించాలి. ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు, రావిచెట్టును స్పృశిస్తూ, భగవంతుని గురించి ధ్యానం చేయాలి. ఒక్కొక్క ప్రదక్షిణం తర్వాత, రావిచెట్టుకు నమస్కరించాలి. రావిచెట్టుకు 108 ప్రదక్షిణలు చేయడం మంచిది. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయడానికి ఉత్తమ సమయం శనివారం. శనివారం రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల శనిగ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నమ్ముతారు. ప్రదక్షిణలు చేయడం వల్ల కోరుకున్న ఫలితాలు లభించాలంటే, భక్తిశ్రద్ధతో చేయాలి.
devotional news
ప్రజ్వలంగా వెలుగుతున్న హోమ గుండానికి దగ్గరగా కూర్చొంటే ఆ వేడిని తట్టుకునే శక్తి మనకు ఉండదు కాబట్టి హోమ గుండానికి దగ్గరగా కూర్చోము. అలాగే దేవాలయానికి దగ్గరలో నివాసం ఉండక పోవడం కూడా అటువంటిదే. దేవాలయం కేవలం పవిత్ర స్థలం మాత్రమే కాకుండా శాస్త్ర బద్ధంగా నిర్మించిన ఒక శక్తి కేంద్రకం. ఆ శక్తిని ప్రేరేపించే జప హోమ, యాగాదులు ఆలయాలలో జరుగుతూ ఉంటాయి. అందుకని దేవాలయాల నీడ పడే చోట ఇల్లు కట్టుకోకూడదని అంటారు.కొన్ని దేవాలయాలకు ప్రత్యేకంగా కొన్ని వైపులలో అసలు నివసించ కూడదని అంటారు. ఇంటికీ దేవాలయానికీ ఉండే దూరాన్ని గర్భ గుడిలోని మూల విరాట్టు విగ్రహం నుండీ కొలవాలి. శివ, వైష్ణవ, శక్తి ఆలయాలకు 200 అడుగుల మేర వరకు ఇల్లును నిర్మించుకోరాదు. ముందు చెప్పినట్టుగా దూరాన్ని గర్భ గుడిలోని మూల విరాట్టు విగ్రహం నుండీ పరిగణ లోకి తీసుకోవాలి. ఈ ఆలయాలకు అతి సమీపం లో నివసించడం వలన ఆ ఇల్లు దారిద్ర్యం లోకి నెట్టబడుతుంది.
Read Also..
Read Also..
సుబ్రహ్మణ్య షష్టి పురస్కరించుకుని ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. శ్రీ మాణిక్యాంబ అమ్మ వారిని, శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు. ఆలయ ప్రాంగణంలో గల శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పువ్వు,పడగలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. తెల్లవారుజామునుంచి భక్తులు ఇక్కడకు చేరుకోవడంతో క్యూలైన్లు అన్నీ బారులు తీరాయి. భక్తులు రద్దీకి తగ్గట్టుగా దేవాదాయ,ధర్మాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు…
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు తీపి కబురు అందించింది. ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనుంచి. మార్చి మాసానికి సంబంధించిన దర్శన, సేవా టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ నమోదు కోసం భక్తులకు అవకాశం లభిస్తుంది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 20వ ఉదయం 10 గంటల వరకు నమోదు ప్రక్రియ ఉంటుందని టీటీడీ తెలిపింది. 21వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల విడుదల చేస్తారు. 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి తెప్పోత్సవాల టికెట్ల విడుదలవుతాయి. 21న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్ల విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లు, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వృద్దులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తారు. దాతల దర్శనం, గదుల కోటా వెలువరిస్తారు. 25న ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించింది.
కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఇంద్ర పాలెం లోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవాలయానికి 500 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వామి వారు స్వయంభు, 18వ తేదీ సోమవారం తెల్లవారుజాము నుంచి సృష్టికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి షష్టికి 40 వేల పైబడి భక్తులు వస్తారని అందుకు తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని ఈవో జోగా సత్యనారాయణ తెలిపారు. స్వయంభు దేవాలయం కావడంతో భక్తులు సంఖ్య ఏటేటా పెరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు దత్తు తెలిపారు. జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తారని ఆయన వెల్లడించారు.
Read Also..
శ్రీ క్షేత్ర దత్తాత్రేయ ఆలయం మనం సాధారణంగా ఏ గుడిలో అయినా దేవుడి విగ్రహాలను దర్శించుకుంటాం. అయితే కర్నాటకలోని ఆ ఊరిలో మాత్రం స్వామి వారి పాదుకలు మాత్రమే దర్శనమిస్తాయి. అంతేకాదు ఆ గుడిలో దయ్యాలు, భూతాలను వదిలిస్తారట. అక్కడి విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ క్షేత్ర దత్తాత్రేయ ఆలయం ప్రస్తుత డిజిటల్ యుగంలోనూ మనలో చాలా మంది స్నేహితుల దగ్గరో లేదా బంధువుల దగ్గరో దయ్యాల కథ గురించి వింటూ ఉంటారు. అయితే అవన్నీ అభూత కల్పనలనీ చాలా మంది కొట్టిపారేస్తుంటారు. కానీ కర్నాటక రాష్ట్రంలోని కల్బూర్గి ఆలయంలో మాత్రం ఇప్పటికీ దయ్యాల్ని వదిలించడం, ఆత్మల్ని బంధించడం, చేతబడి తొలగించడం వంటి వాటిని ప్రత్యక్షంగా చూడొచ్చు. అందుకే గానగాపూర్ ఆలయాన్ని ఆధ్యాత్మిక స్వర్గంగా భావిస్తారు చాలా మంది భక్తులు. ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చాలా మంది నమ్ముతారు. గానుగాపూర్ అంటే అందరికీ గుర్తొచ్చేది దత్తాత్రేయుని దేవాలయం. ఎందుకంటే ఈ క్షేత్రంలో పాదుకల రూపంలో భక్తుల కోరికలను తీర్చే స్వామి దత్తాత్రేయుడు. దత్తాత్రేయుని రెండో అవతారమైన నరసింహ సరస్వతి అవతారం 1378 సంవత్సరం పుష్య శుద్ధ విదియ నాడు జన్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ కారణ జన్ముడి తల్లిదండ్రులు మాధవ శర్మ, అంబభవానీ. ఈ స్వామివారి పూర్వనామం నరహరి. పాదుకలకు ప్రతిరోజూ అభిషేకం. ఈ ఆలయంలో స్వామి వారి పాదుకలకు ప్రతిరోజూ అభిషేకం, పాదుకా దర్శనం ఉదయం 9 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అభిషేకం ముగిసిన తర్వాత పాదుకలను పూలు, వస్త్రాలను కప్పుతారు. ఈ ఆలయ ప్రాంగణంలో మాత్రమే ప్రతి గురువారం రాత్రి పల్లకీ ఉత్సవం నిర్వహిస్తారు.
Read Also..
Read Also..
వలేటివారిపాలెం మండల పరిధిలోని మాలకొండ పుణ్యక్షేత్రంలో కొలువుతీరి భక్తుల పాలిట కొంగుబంగా రంగా విరాజిల్లుతున్న శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న భక్తుల ద్వారా 829197 రూపాయల ఆదాయం లభించినట్లు దేవస్థానం పర్యవేక్షణ అధికారి కేబి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అష్టోత్తరం ద్వారా 7400, కుంకుమార్చన ద్వారా 26320, వివాహములు ద్వారా 10000 రూపాయలు, భక్తులు సమర్పించిన తలనీలాల ద్వారా 26175 రూపాయలు, వాహన పూజల ద్వారా 2440 రూపాయలు, ప్రత్యేక దర్శనాలు ద్వారా 169200 రూపాయలు, స్థల పురాణం ద్వారా 1020 రూపాయలు, రూము అద్దెలు ద్వారా 32960 రూపాయలు, కవర్లు ద్వారా 5100, లడ్డు ప్రసాదం ద్వారా 201830 రూపాయలు, అన్నదానము ద్వారా 336252 రూపాయలు, విరాళాల ద్వారా 10500 రూపాయలు మొత్తం ఆదాయం 829197 లభించినట్లు తెలిపారు.
Read Also..
మురుడేశ్వర్ చరిత్ర ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలోని శివ విగ్రహాలలో రెండవ ఎత్తైన విగ్రహం ఇక్కడ ఉంది. మురుడేశ్వర్ కర్నాటక రాష్ట్రంలో పశ్చిమ తీర ప్రాంతంలో ఉంది. ఈ ప్రదేశం భారత పురాణాలలో ప్రసిద్ధి చెందిన రామాయణ కాలం నాటిదని చెపుతారు. అతిపెద్ద శివ విగ్రహం పట్టణం అంతా కనపడే రీతిలో ఇక్కడి బీచ్ లో ప్రతిష్టించారు. సుందరమైన, పచ్చటి పచ్చిక బయళ్ళతో కల ఒకచిన్న కొండపై శివుడి అతిపెద్ద విగ్రహం ప్రతిష్టించబడినది, నందీశ్వరుడితో సహా ఈ విగ్రహానికి ఒక దేవాలయం నిర్మించారు. మురుడేశ్వర్ సందర్శించేవారికి ఈ శివ దేవాలయ దర్శనం భక్తులు తమను తాము మరచిపోయే రీతిలో ఒక అత్యంత మధురానుభూతిగా ఉంటుంది. ప్రతిష్టాత్మక శివ భగవానుడి విగ్రహంమురుడేశ్వర్ దేవాలయం ప్రధానంగా ఒక ద్వీపంలో ఉండి మూడు పక్కల అరేబియా మహా సముద్రం ప్రవహిస్తుండటంతో ఈ పుణ్య తీర్ధం దేశ విదేశాలలో ఎంతో ప్రాచుర్యం సంతరించుకొంది. మహాసముద్ర వాతావరణం కారణంగా, అది సముద్రపు గాలి, వర్షాలు, మరియు పెను గాలులకు ప్రభావించబడింది. అతి పెద్దదైన శివ భగవానుడి విగ్రహం కొంతమేరకు దాని సహజ అందం కోల్పోయింది. దానిపై మొదట్లో గల ఆకర్షణీయమైన బంగారు పూత పోయింది. అంతే కాక విగ్రహంలోని ఒక చేయి విరిగిపోయింది. రావణుడు తీవ్ర కోపంతో శివుడి లింగాన్ని తునకలు చేసినపుడు ఒక ముక్క ఈ ప్రదేశంలో పడటంతో, ఈ ప్రదేశంలో నిర్మించిన ఈ దేవాలయం హిందువులకు మతపరంగా ఎంతో పవిత్రత సంతరించుకొంది. దేవాలయ ప్రవేశ భాగం ప్రపంచంలోనే అతి పొడవైనదిగా ఉంటుంది. ఇతర ప్రధాన ఆకర్షణలు ఈ ప్రదేశంలో దేవాలయమేకాక, సందర్శకులకు అనేక ఇతర ఆకర్షణలు కూడా ఉన్నాయి. ఇక్కడి సముద్రం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కనుక ఈ సముద్ర ప్రాంతంలో అందరకు ఎంతో సంతోషపరచే స్విమ్మింగ్, బోట్ సవారి, వంటి వివిధ వినోద చర్యలు కూడా చేసి ఆనందించవచ్చు. ఎంతో చక్కగా రూపొందించిన ప్రణాళికతో దేవాలయానికి సమీపంలోని మార్గాలు బీచ్ కు వెళ్ళేందుకు పర్యాటకులకు సంసిద్ధంగా ఉంటాయి. పర్యాటకులు అలుపూ సొలుపూ లేకుండా ఆహ్లాదకర వాతావరణంలో ఎంతో హాయిగా మెల్లని నడక సాగిస్తూ ఈ చిన్న కొండపైనుండి అద్భుత సూర్యాస్తమయాలు చూసి ఆనందించవచ్చు. ఈ ప్రాంతంలో యాత్రికులకు సూర్యాస్తమయం చూసి ఆనందించటం ఒక పెద్ద విశేషంగా భావిస్తారు. పిల్లలతో వెళ్ళే కుటుంబాలు ఇక్కడి నీటి మడుగులలో గంటల తరబడి స్విమ్మింగ్ చేస్తూ ఆనందించవచ్చు. నీటిపైనే బహుళ అంతస్తుల రెస్టరెంట్లు, డైనింగ్ ప్రదేశాలు ఏర్పరచి పర్యాటకులకు మరచిపోలేని వినోదానుభూతులు కలిగించే ఏర్పాట్లు అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ అనేక హోటళ్ళు, రిసార్టులు ఎవరి బడ్జెట్ కు సరిపోయే రీతిలో వారికి లభ్యంగా ఉంటాయి. మురుడేశ్వర్ ప్రదేశం ఉత్తర కన్నడ జిల్లాలో ఉండటంతో అక్కడకల ఇతర ఆకర్షణలు కూడా మీరు చూసి ఆనందించవచ్చు. వాటిలో టిప్పు సుల్తాన్ పునర్నిర్మించిన కోట, సమీపంలోని సహ్యాద్రి కొండలపై గల హిల్ రిసార్ట్ లు, కోస్తా ప్రదేశమైన భట్కల్ వంటివి తనివితీరా చూసి ఆనందించవచ్చు. ఈ పొడవైన కోస్తాతీరం మరియు పర్వత శ్రేణుల వెంబడి ఇంకా అనేక ఇతర సహజ ఆకర్షణలున్నాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించాలంటే అక్టోబర్ మరియు మార్చి నెలలు వాతావరణ పరంగా అనుకూలం. ఇక్కడికి వచ్చే పర్యాటకులు భట్కల్ నుండి బోట్లను లేదా ట్రాలర్లను అద్దెకు తీసుకొని నేత్రాని ద్వీపం లేదా పిజియన్ ఐలండ్ లో గంటల తరబడి విహరిస్తారు. అయితే, గతకాలంనాటి శిధిలమైన వైభవ చిహ్నాలు మినహా ఇక్కడ మరేమీ కనపడవు. మేకలు, పక్షులు మాత్రమే విహరిస్తూంటాయి.
తిరుమల శ్రీవారిని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు దర్శించుకున్నారు. ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. సురేష్ బాబు రెండో కుమారుడు అభిరామ్ వివాహం ఇటీవలే జరిగింది. ఈ సందర్భంగా కొత్త దంపతులతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో నూతన దంపతులకు వేదపండితులు ఆశీర్వచనం అందించారు. అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు. మరోవైపు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకునే కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల దీపికను చూసేందుకు భక్తులు, అభిమానులు ఎగబడ్డారు.
శ్రీరంగనాథస్వామి ఆలయం, తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగంలో ఉంది. ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు. ఈ ఆలయాన్ని తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఈ గుడి గురించి ప్రాచీన తమిళ సాహిత్యమైన తివియ ప్రబంధంలో వివరించారు. ఈ గ్రంథంలో 6 నుంచి 9వ శతాబ్దం వరకు ఉన్న ఆళ్వారుల గురించి రాశారు. ఈ క్షేత్రాన్ని విష్ణువుకు ప్రీతికరమైన 108 దివ్య దేశాలలో ఒకటిగా పరిగణిస్తారు వైష్ణవులు. ఈ ఆలయంలో తెంకలై సంప్రదాయంలో పూజాధికాలు జరుగుతాయి. దక్షిణ భారతదేశంలో పురాతనమైన, ప్రముఖమైన వైష్ణవ ఆలయాల్లో ఇది ఒకటి. ఈ ఆలయ చరిత్ర చాలా సుప్రసిద్ధమైనది. కావేరి నదిలో ఒక ద్వీపం వంటి దానిలో ఉండే ఈ ఆలయం ఎన్నో ముస్లిం, యూరోపియన్ రాజుల దండయాత్రలకు గురైంది. ఈ ఆలయ ముఖద్వారమైన రాజగోపురం దాదాపు 13 సెంట్ల విస్తీర్ణంలో ఉంది. ఈ గోపురం ఎత్తు 237 అడుగులు కావడం మరో విశేషం. ఈ గోపురానికి 11 అంతస్తులు ఉన్నాయి. తమిళ నెల మార్గళి (డిసెంబరు నుంచి జనవరి) లో జరిగే 21 రోజుల పాటు జరిగే ఉత్సవంలో దాదాపు పది లక్షల మంది పాల్గొంటారు. శ్రీరంగంలోని ఈ దేవాలయాన్ని ప్రపంచంలోని అతిపెద్ద హిందూ ఆలయంగా పేర్కొంటారు. నిజానికి కంబోడియాలోని అంగ్కోర్ వాట్ ఉన్నా, ప్రస్తుతం అది బౌద్ధ దేవాలయంగా మారిపోయింది. ఈ దేవాలయం 156 ఎకరాల్లో 4,116 మీటర్ల చుట్టుకొలతతో భారతదేశంలోనే అతి పెద్ద ఆలయంగా నిలిచింది. అలాగే ప్రపంచంలోనే అతి పెద్ద మత ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది.
శ్రీరంగనాథస్వామి ఆలయం చరిత్ర
కావేరి, కోలెరూన్ లేదా కొల్లిదంల ద్వారా రూపుదిద్దుకున్న ఓ చిన్న ద్వీపంవద్ద ఈ ఆలయం వెలసింది. 108 ప్రధాన విష్ణు దేవాలయాల్లో ఈ ఆలయం మొదటిదిగా, అత్యంత ప్రధానమైనదిగా ఇది ప్రాచుర్యం పొందుతోంది. ఆలయ ప్రాంగణం 156 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. దీనికి ఏడు ప్రహరీలు ఉన్నాయి. ఈ ప్రహరీలు దృఢమైన, భారీ బురుజులున్న గోడలతో నిర్మించబడ్డాయి. ఆలయ గర్భగుడి చుట్టూ ఇవి ఆవరించి ఉంటాయి. అన్ని ప్రాకారాల్లో ఉన్న 21 బ్రహ్మాండమైన స్తంభాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఈ ఆలయం వేల సంవత్సరాలనాటి ప్రాచీన నాగరికతనూ చాటి చెబుతుంది. కోరమండలం తీరాన్నీ, తూర్పు దక్కన్ ప్రాంతంలోని ప్రధాన భూభాగాన్నీ మూడు వందల ఏళ్ళకు పైగా పరిపాలించిన చోళ వంశం ఆ ప్రాంతాల్లో ఓ పురోగామి హిందూ సంస్కృతి వర్థిల్లేందుకు దోహదపడ్డారు. 13వ శతాబ్దంలో చోళులు మధురైకి చెందిన పాండ్యుల చేతిలో, మైసూరుకు చెందిన హోయసల రాజుల చేతిలో ఓడిపోయారు. శ్రీరంగంలో ఆలయ నిర్మాణంపై హోయసలులు ప్రత్యేకమైన శ్రద్ధ చూపారు కానీ, అవి శాసనాలూ, భవనాల వరకూ మాత్రమే పరిమితమైపోయాయి. హోయసలులను 14వ శతాబ్దం మొదటి భాగంలో పాండ్యులు ఓడించారు. ఆ తర్వాత, దక్కన్ పీఠభూమి మీద మహమ్మదీయులు తరచూ దాడులు చేసినప్పటికీ, 1336లో విజయనగరంలో ఏర్పడిన హిందూ సామ్రాజ్యం నుంచి గట్టి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ సామ్రాజ్యం తన స్వతంత్ర ప్రతిపత్తిని 1565 వరకూ కొనసాగించుకోగలిగింది. అదే సమయంలో యూరోపియన్లు దక్షిణ భారతదేశంలో కాలుపెట్టారు. పదహారో శతాబ్దంలో అనేకమంది విదేశీ పర్యాటకులూ, వ్యాపారులూ ఈ మార్గాల్లోంచీ ప్రయాణాలు సాగించారు, కానీ విజయనగర సామ్రాజ్యం తమ వ్యాపారాలకోసం సమకూర్చిన మార్గాలమీద తప్పితే పోషక భూభాగాలమీద వారికి ఆసక్తి చాలా తక్కువగా ఉండేది. ఈ నేపథ్యంలో, 1600లో ఆంగ్లేయుల ఈస్టిండియా కంపెనీ, 1664లో ఫ్రెంచి కంపెనీలు వెలిశాయి. ఔరంగజేబు రాజు (1658-1707) పశ్చిమ దక్కన్ ప్రాంతంలో దండయాత్రకు బయలుదేరే క్రమంలో, ఆక్రమణలూ, భారీ ప్రాణనష్టం తరువాత, బీజాపూర్, గోల్కొండ కోటలు అతని ఆధీనంలోకి వచ్చాయి, అతని మరణం వరకూ ఈ దండయాత్రలు కొనసాగుతూనేవున్నాయి.
Read Also..
Read Also..





Total views : 90752