అమెరికా సుప్రీంకోర్టులో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌కు బిగ్ షాక్ తగిలింది. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఉండాల్సిందేనని సుంప్రీకోర్టు స్పష్టం చేసింది. జన్మహక్కు పౌరసత్వాన్ని పరిమితం చేయాలన్న ట్రంప్ ప్రతిపాదనలను కోర్టు తిరస్కరించింది. అమెరికాలో వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. వలసదారులకు పౌరసత్వాన్ని పరిమితం చేసేందుకు ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాత్కాలిక వీసాలపై అమెరికాకు వచ్చి బిడ్డలకు జన్మనిచ్చిన పిల్లలకు లభించే పౌరసత్వాన్ని రద్దు చేయాలని ప్రతిపాధించారు. అయితే ఆ ప్రతిపాధనను కోర్టు తోసిపుచ్చింది. అమెరికాలో ఎలా జన్మించినా వారంతా పౌరసత్వం పొందేందుకు అర్హులేనని స్పష్టం చేసింది. అమెరికా అంతర్యుద్ధం తరవాత బానిసలుగా ఉన్నవారికి, వారి వారసులకు పౌరసత్వం కల్పించడానికి, చట్టపరమైన రక్షణ కల్పించేందుకు 1868 ఆర్టికల్ 14ను సవరించారు. ఈ సవరణ ఆధారంగా కోర్టు తీర్పునిచ్చింది.
Tag: