పటాకులు మిరగల్లు పడి పశుగ్రాసం వరి గడ్డి దగ్దమైన సంఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం కొత్తపేట రామాపురం ధర్మారెడ్డి విధి నందు చోటు చేసుకోంది.దీంతో సమాచారం అందుకొన్న అగ్నిమాపక అధికారి వెంకట్రామి రెడ్డి అద్వర్యంలో హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకొన్నారు .మంటలను అదుపులోకి తీసుకువచ్చారు .వారు తెలిపిన వివరాల మేరకు ధర్మా రెడ్డి విధికి చెందిన రాజమ్మ ,సహదేవ రెడ్డి లు కొత్తపేట రామాపురం లో నివాసం ఉంటూ కొన్ని పసువులను (గేదలను )మేపుకొంటు జీవనం సాగిస్తున్నారు .గేదలకు కావాల్సిన పశు గ్రాసం ను సుమారు లక్ష రూపాయలు వెచ్చించి ఎనిమిది లోడ్ల వరి గడ్డిని కొనుగోలు చేసుకొని తన నివాసం వద్ద ఓక వామి గా ఏర్పాటు చేసికొన్నారు .నిన్నటి దినమ దీపావళి పండుగ సందర్బంగా అక్కడే సమీపంలో రాత్రి సమయంలో బాణాసంచాలు పేల్చే క్రమంలో రాకెట్ మిరగల్లు గడ్డి వమి పై పడడంతో చిన్న చిన్న మంటలు పెద్ద పెద్ద మంటలుగా ఏర్పడి వరి గడ్డి అగ్గి మంటలకు ఆహుతి అయ్యింది .పైగా నిద్ర సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఇంత పెద్ద ప్రమాదం జరిగినట్లు వారు తెలిపారు .అప్పటికి పశుగ్రాసం పూర్తిగా మంటలలో పూర్తిగా దగ్ధమై బూడిద కావడంతో సుమారు లక్ష రూపాయలు పశుగ్రాసం నష్టం వాటినట్లు వారు తెలియజేశారు .నివాసాల మధ్య మంటలు పెద్దగా చెలరేగడంతో నివాస ప్రజలు బయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు
fire accident
మేడిపల్లి పీస్ పరిధిలోని బాలాజీ హిల్స్ లో అగ్నిప్రమాదం… దీపావళి సందర్బంగా బుక్ స్టాల్ లో దీపం వెలిగించి షాప్ మూసివేసి వెళ్లగా ప్రమాదవశాత్తు షాపులో మంటలు అంటుకొని షాప్ దగ్ధం అయ్యింది పక్కనే ఉన్న టైలర్ షాప్ లోకి కూడ మంటలు వ్యాపించి రెండు షాప్ లు దగ్ధం అయ్యాయి… ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పీయడం జరిగింది దాదాపు మూడు లక్షల ఆస్థి నష్టం జరగోచ్చు అని తెలుస్తుంది. పండుగ రోజు షాప్ దగ్ధం కావడంతో తమకు దిక్కువరని టైలర్ షాప్ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
షహలిబండ లోని గోమతి ఎలక్ట్రానిక్స్ పక్కన గల బజాజ్ ఎలక్ట్రానిక్స్ వద్ద ఈ తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే అగ్నిమాపక సిబ్బంది సహాయం తో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసారు. ఈ ఘటన పై పోలీసులు విచారణ జరుపుతున్నారు మరిన్ని వివరాలు ఇంకా తెలియల్సి ఉంది.
సంగారెడ్డి పటాన్ చేరు( మం) పాశమైలారం పారిశ్రామిక వాడలో రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. 4గురు కార్మికులు కు గాయాలయ్యాయి, ఇంటర్మీడియట్ సాల్వెంట్ తయారు చేసే పరిశ్రమ. ఘటన స్థలానికి చేరుకున్న 2 ఫైర్ ఇంజన్లు స్థానిక ఫైర్ స్టేషన్ లో పనిచేసే ముగ్గురు ఔట్ సోర్స్ ఉద్యోగులు కు మంటలు ఆర్పుతుండగా గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి.
Read Also..
సూరారం పి.యస్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది.. ఉదయం సూరారం మైన్ రోడ్డు లో రిజిష్టర్ ఆఫీస్ సమీపంలో ఉన్న అరుంధతి ట్రేడర్స్ సెల్లార్ గోదాంలో నుండి దట్టమైన పొగలతో అగ్ని ప్రమాదం సంభవించింది. హార్డ్ వేర్, ఎలెక్ట్రికల్ , పివిసి పైపులు నిలువ ఉంచిన సెల్లార్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. షాపు యజమాని సమాచారం తో అగ్నిమాపక సిబ్బంది పైర్ ఇంజన్ తో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం లో ఎలాంటి ప్రాణ నష్టం లేదు. ఆస్తి నష్టం 5 లక్షల రూపాయల వరకు ఉండవచ్చని సమాచారం.
ఈజిప్ట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పొగమంచు కారణంగా హైవేపై వెహికల్స్ ఒకదానినొకటి ఢీకొన్నాయి. దీంతో వాహనాల్లో మంటలు చెలరేగి 32 మంది మృతి చెందారు. మరో 63 మందికి గాయాలయ్యాయి. ఈజిప్ట్ రాజధాని కైరో నుంచి అలెగ్జాండ్రియాను కలిపే హైవేపై.. నుబారియా టౌన్లో స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ బస్సు కైరో వైపు వెళ్తూ.. ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టడంతో మంటలు చెలరేగినట్టు స్థానిక మీడియా తెలిపింది. ఆ తర్వాత ఆ మంటల్లోకి సుమారు 29 వెహికల్స్ దూసుకెళ్లినట్టు వెల్లడించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది స్పాట్‌కు చేరుకొని మంటలు ఆర్పారు. అప్పటికే చాలా వెహికల్స్ మంటల్లో కాలిపోయాయి. వాహనాల్లోనే కొంతమంది సజీవ దహనమయ్యారు. కాగా, హైవేలపై భారీగా పొగమంచు ఉంటుందని ఈజిప్టు వాతావరణ అథారిటీ ఒక రోజు ముందే హెచ్చరించినట్టు తెలిపింది.