విజయవాడ, కోడి కత్తి శీను కుటుంబ సభ్యులు చేస్తున్న అమరణ నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు. కోడి కత్తి శీను ను వెంటనే విడుదల చేయాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న శ్రీనివాస్ కుటుంబ సభ్యులు. కోడి కత్తి శీను జైలు నుండి బయటకు రావాలని మూడు రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కోడికత్తి శీను కుటుంబ సభ్యులు. కోడికత్తి శీను తల్లి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన ఆరోగ్యం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రి తరలించిన పోలీసులు. పోలీసులు నిరాహార దీక్ష భగ్నం చేసి ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో పోలీస్ జీబు ముందు పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకోబోయిన నిరసనకారులు. వెంటనే స్పందించి అతని వద్ద ఉన్న అగ్గిపెట్టెను లాక్కున్న పోలీసులు. నిరసనకారులను చెదరగొట్టి కోడి కత్తి శీను కుటుంబ సభ్యులను విజయవాడ హాస్పటల్ తరలించిన పోలీసులు.
health news
ఉరవకొండ, ఈనెల 23న ఉరవకొండలో జరిగే వైఎస్ఆర్ ఆసరా బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం కలెక్టరు గౌతమి, ఎస్పీ అన్బురా జన్, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అనంతరం పట్టణం లోని తొగటవీర క్షత్రియ కల్యాణ మండపంలో జిల్లా ఉన్నతాధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. 7,876 లక్షల మంది మహిళలకు రూ.6,379 కోట్ల ఆసరా మొత్తాన్ని సీఎం విడుదల చేయనున్నారని తెలిపారు. ఏపీ ఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందురెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, మంగమ్మ, ఎమ్మెల్యే శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, జడ్పీ సీఈఓ వైభోమ్ నిదియాదేవి, గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాసులురెడ్డి, స్థానిక తహసీల్దారు శ్రీధరమూర్తి పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా కలువయి మండలం వెంకటరెడ్డి పల్లి జంక్షన్ వద్ద తమిళనాడు కూలీలను పట్టుకున్న తిరుపతి టాస్క్ ఫోర్స్ ఎస్సై రాఘవేంద్ర వారి సిబ్బంది. వెంకట రెడ్డి పల్లి హైవే 565 కూడలిలో టెంపో వాహనం లో ప్రయాణిస్తున్న 20 మంది కూలీ. వాహనం ను ఆడుకున్న అధికారులపై స్మగ్లర్లు దాడి కి యత్నం. వెంకట రెడ్డి పల్లి గ్రామస్తులు సహకారం తో స్మగ్లర్లు, కూలీలను పట్టుకొన్న పోలీసులు. వారి వద్ద గొడ్డళ్ళు, కత్తులు. ఎర్ర చందనం దుంగలు స్వాధీనం.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఎన్టీఆర్ కాలనీ వాసులు త్రాగునీటి కోసం ఆర్డీటీ ఆసుపత్రికి ఎదురుగా ప్రధాన రహదారి పై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. త్రాగునీటి కోసం కాళీ బిందెలతో మహిళలు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదేమి రాజ్యం నీళ్లు లేని రాజ్యం అంటూ మహిళలు నినాదాలు చేశారు. వారు మాట్లాడుతూ.. గొంతులోకి గుక్కెడు నీరు అందక రోడ్డెక్కామని ఏమి సీఎం అని ఇదేమి రాజ్యమని సీఎం పై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులుగా త్రాగునీటి కోసం అల్లాడుతున్నామన్నారు. ఉప్పు నీటి కోసం రెండు కిలోమీటర్లు వెళ్లి తెచుకుంటున్నామని మండిపడ్డారు. సమ్మె లో ఉన్న శ్రీరామిరెడ్డి కార్మికులకు జీతాలు ఇస్తేనే కదా నీళ్లు విడిచేది ఇలా చేస్తే ఎలా అని ప్రభుత్వాన్ని కాలనీ వాసులు నిలదీశారు. కనీసం మా కౌన్సిలర్ కాలనీ వైపు తొంగి కూడా చూడలేదు. కౌన్సిలర్ పరారీ అయ్యాడని మహిళలు మండిపడ్డారు. మున్సిపల్ అధికారులు పట్టించుకోరు. ఎన్నికల వేల ఓట్లు కోసం వచ్చి అది చేస్తాం ఇది చేస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితమయ్యారని వైసీపీ నాయకులను దుయ్యబట్టారు.
పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. వారికి మద్దతుగా సిపిఐ, సిపిఎం, జనసేన, టిడిపి, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై రాస్తారోకో, మానవహారం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు నిరసనలు చేస్తున్న నేపథ్యంలో పల్నాడు జిల్లా గురజాలలో దీక్షలు విరమించి, వెంటనే విధుల్లో చేరాలని స్థానిక వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు అంగన్వాడి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దీక్షలు విరమించి వెంటనే విధుల్లోకి చేరకపోతే టెర్మినేట్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నరని అంగన్వాడీ కార్యకర్తలు తెలిపారు. ప్రభుత్వం, స్థానిక వైసీపీ నేతలు ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా కానీ బెదిరేది లేదని వారు తెలిపారు.
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా కూకట్ పల్లి ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ప్రత్యేక శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ టెంపుల్ చీఫ్ కోఆర్డినేటర్ శ్రావణి తెలిపారు. ఈ నెల 22 సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదర్ నగర్ లోని మైసమ్మ దేవాలయం నుండి ఊరేగింపుగా శోభయాత్ర ప్రారంభమై నిజాంపేట్ చౌరస్తా, జె ఎన్ టి యూ, వివేకానంద నగర్, క్రొమో షో రూమ్ మీదగా మెట్రో షాపింగ్ మాల్ సమీపంలోని హుడా పార్కింగ్ దగ్గర శోభయాత్ర ముగుస్తుందని, శ్రీరాముడు, సీతా, లక్ష్మణుడు మరియు హనుమంతుడు రథని అధిరోహించగా శోభయాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ రథయాత్రను పురస్కరించుకొని ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోఆర్డినేటర్ శ్రావణి మాట్లాడుతూ అయోధ్య రామమందిర నిర్మాణం మన దేశ చరిత్రలో కొత్త శకానికి నాంది అని, ఇది మన వైదిక సంస్కృతి అన్నారు. ఈ రథయాత్రలో వేలాదిమంది వైష్ణవ భక్తులు పాల్గొని సంప్రదాయ నృత్యాలు చేస్తూ, భక్త బృందాలచే శ్రావణమైన కీర్తనలు ఆలపిస్తూ రథయాత్ర సాగుతుందని తెలిపారు. ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో అయోధ్యలో మెగా అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తున్నామని, ప్రతిరోజు 30 వేల మందికి పైగా సాధువులకు నెల రోజులు ఉచిత అన్న ప్రసాదాన్ని అందిస్తున్నామని తెలిపారు.
సీవీఆర్ న్యూస్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా చే లాంఛనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోజా క్యాలెండర్ ను ఆవిష్కరించి అతిధులకు అందజేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. ” నిష్పక్షపాతంగా వార్త ప్రసారాలు చేస్తూ, సమాజంలో సమూల మార్పులకు నాంది పలుకుతున్న సివిఆర్ న్యూస్ ఛానల్ మరిన్ని శిఖరాలు అందుకోవాలని మంత్రి రోజా శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తదితర నాయకులు పాల్గొన్నారు.
ప్రొద్దుటూరులో సామాన్యులు బంగారు, బట్టలు కొనడానికి వస్తే పోలీసులు తనిఖీలు చేసి అధారాల్లేవని డబ్బులు సీజ్ చేయడం వెనుక ఎమ్మెల్యే రాచమల్లు ఉన్నాడని, ఆయనకు తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయని ప్రొద్దుటూరు టిడిపి ఇంచార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల కోడ్ ఇంకా అమలు కాకముందే పోలీసులు దాడుల చేస్తూ పెద్ద ఎత్తున నగదు పట్టుకుని ఐటికీ అప్పజెప్పడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఈ దాడులు చేయించేది, ఆపై సానుభూతి ప్రకటించి, ధర్నాలు చేసేది ఎమ్మెల్యేనే అంటూ ఆరోపించారు. పోలీసుల దాడుల వ్యవహారంపై ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని టిడిపి తో కలసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు రావాలని ప్రవీణ్ రెడ్డి సవాల్ విసిరారు. 30 మద్యం బాటిళ్లు పట్టుకుంటే ఎక్సైజ్ స్టేషన్ కు వెళ్ళి ఎస్ఐని నిలదీసిన ఎమ్మెల్యే 14 లక్షల నగదు కూతురు పెళ్ళి నగల కోసం తీసుకురాగా పట్టుకున్నప్పుడు ఎందుకు పోలీస్టేషన్‌కు వెళ్లలేదన్నారు. తాను నియమించుకున్న ఇబ్రహీం ఎమ్మెల్యేకి తెలియకుండా ఏదీ చేయడని విమర్శించారు.
తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ సినీ నటుడు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, ప్రముఖ సినీ గాయని సునీత, ప్రముఖ యాంకర్ సుమ కనకాల…రోషన్ కనకాలలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.




Total views : 92722